E-Paper
Advertisement

కొండాపురంలో గ్రామ పంచాయతీ పైసలు మాయం.. కార్యదర్శిపై ఎంపీడీవోకు ఫిర్యాదు..!

కొండాపురంలో గ్రామ పంచాయతీ పైసలు మాయం.. కార్యదర్శిపై ఎంపీడీవోకు ఫిర్యాదు..!
Advertisement

Panchayat Irregularities: స్వేచ్చ బ్యూరో: జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం కొండాపురం గ్రామపంచాయతీలో పరిపాలనా వ్యవస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ గ్రామస్తులు మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. గ్రామ కార్యదర్శి గత పది రోజులుగా విధులకు హాజరు కాకపోవడం వల్ల ప్రజలకు అవసరమైన సేవలు పూర్తిగా స్తంభించి పోయాయని, దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, నివాస ధృవీకరణ పత్రాలు, ఇతర ప్రభుత్వ అవసరాలకు సంబంధించిన పత్రాల కోసం ప్రజలు పలుమార్లు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆశ్రయించినప్పటికీ సంబంధిత అధికారి అందుబాటులో లేకపోవడంతో వారి పనులు నెలల తరబడి పెండింగ్‌లో పడుతున్నాయి. ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత కలిగిన గ్రామపంచాయతీ కార్యాలయమే ప్రజలకు అందని ద్రాక్షగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, సర్టిఫికెట్ల జారీ విషయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలను కూడా గ్రామస్తులు ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఉచితంగా, పారదర్శకంగా అందాల్సిన సేవల విషయంలో అక్రమ వసూళ్ల ఆరోపణలు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

నిధుల వినియోగంపై అనుమానాలు

గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై కూడా గ్రామస్తులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గ్రామంలో గత రెండేళ్లుగా గ్రామపంచాయతీ ట్రాక్టర్ ఎటువంటి సేవలు నిర్వహించకపోయినప్పటికీ, దానికి సంబంధించిన బిల్లులు ఎత్తినట్లు తమకు సమాచారం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే గ్రామంలో చేపట్టని అభివృద్ధి పనులకు సైతం బిల్లులు మంజూరు చేసి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపించారు. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయి స్తున్న నిధులు నిజంగా ప్రజల అవసరాలకే వినియోగించబడుతున్నాయా, లేక కాగితాలకే పరిమితమవుతున్నాయా అనే అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Advertisement

Also read: నెలలోపే ఓటీటీలోకి రొమాంటిక్ ఎంటర్టైనర్… కానీ చిన్న ట్విస్ట్

ఉన్నతస్థాయి విచారణకు డిమాండ్

గ్రామ కార్యదర్శి విధుల పట్ల నిర్లక్ష్యం, ప్రజలకు సేవలందకపోవడం, సర్టిఫికెట్ల జారీలో అవకతవకల ఆరోపణలు, గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై తలెత్తిన అనుమానాల నేపథ్యంలో ఉన్నతాధికారులతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసి వాస్తవాలను వెలికితీయాలని గ్రామస్తులు ఎంపీడీవోను కోరారు. ప్రజాధన దుర్వినియోగానికి పాల్పడిన వారెవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామ ప్రజలకు సకాలంలో సేవలు అందేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సేవలు అందించాల్సిన గ్రామపంచాయతీ వ్యవస్థ పైనే ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో కొండాపురం గ్రామస్తుల ఫిర్యాదుపై అధికారులు ఎలా స్పందిస్తా రన్నది ఆసక్తికరంగా మారింది. గ్రామస్థులు లేవనెత్తిన ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందో విచారణలో తేలాల్సి ఉంది.

Advertisement

Also read: తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. బీజేపీకి అన్నామలై గుడ్ బై? త్వరలో కొత్తపార్టీ!

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×