BigTV English

CM Revanth Reddy: గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: గోల్కొండ కోటలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ జెండాను ఆవిష్కరణకు ముందు సీఎం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కళాకారుల ప్రదర్శనలు, కోలాట నృత్యాలు, డబ్బు చప్పుళ్లు ప్రధాక ఆకర్షణగా నిలిచారు. కోటలో ప్రసిద్ధమైన ప్రాంతీయ శిల్పాలు, చారిత్రక నిర్మాణాల మధ్య జాతీయ పతాకం ఎగురవేయబడటం ఈ వేడుకలకు ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర గవర్నర్, అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పొల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ అందరికి స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రసంగంలో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించారు. కాంగ్రెస్ పార్టీ యొక్క డీఎన్ఏలో సామాజిక న్యాయం ఉందని తెలిపారు.


తెలంగాణలో సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించేందుకు ఫిబ్రవరి 4వ తేదీని తెలంగాణ సోషల్ జస్టిస్ డే గా జరుపుకోవాలని సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రజల నుంచి విస్తృతమైన మద్దతు లభించే అవకాశం ఈ నిర్ణయం పై ఉందని తెలిపారు. అంతే కాకుండా సీఎం మాట్లాడుతూ తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి క్లుప్తంగా వివరించారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాష్ట్ర రైతాంగానికి రుణమాఫీ, గృహజ్యోతి పథకం వంటి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని సీఎం తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి యువత సాధికారత కాకుండా.. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ లాంటి గొప్ప కార్యక్రమాలను ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. గోల్కొండలో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Related News

BRS Politics: కారు రోడ్డుపైకి వస్తుందా? గంటల వ్యవధిలో కేసీఆర్‌తో కొడుకు-కూతురు భేటీ వెనుక

Cm Revanth Reddy: అపోహలు నమ్మొద్దు.. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు

Independence Day: తలక్రిందులుగా జాతీయ జెండా.. ఎగురవేసిన తహసీల్దార్.. ఎక్కడంటే

Banakacherla Project: తగ్గేదేలే.. బనకచర్ల ప్రాజెక్టుపై ఇద్దరు సీఎంల మాటల యుద్ధం

Kingfisher Beer: కింగ్ ఫిషర్ బీరులో సర్ప్రైజ్.. వరంగల్‌లో షాకింగ్ ఘటన!

Big Stories

×