Half Day Schools: సమ్మర్ రాకముందే భానుడు తీవ్ర ప్రతాపం చూపుకున్నాడు. తెలంగాణలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి పాఠశాలు ఒంటి పూట పెట్టాలని నిర్ణయించింది. ఒక విధంగా చెప్పాలంటే విద్యార్థులకు శుభవార్త.
తెలంగాణలో ఉక్కపోత
ఫిబ్రవరి నుంచి తెలంగాణలో విపరీతమైన ఉక్కపోత మొదలైంది. మార్చి ప్రారంభం నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటగానే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండల తీవ్రతకు రోడ్లకు ఇరువైపులా బండ్లు పెట్టుకుని చిన్న చిన్న వ్యాపారాలు అల్లాడి పోతున్నారు. స్కూళ్లకు వెళ్లే విద్యార్థుల గురించి చెప్పనక్కర్లేదు.
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంది విద్యాశాఖ. ఈసారి ముందుగా ఒంటిపూట బడులు పెట్టాలనే ఆలోచన చేసింది. రంజాన్ పండుగ నేపథ్యంతో తెలంగాణలో ఉర్దూ స్కూళ్లకు ఒంటి పూట బడులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మార్చి సెకండ్ నుంచి అన్ని స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది.
ఒంటిపూట బడులు
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు ఉదయం 8 గంటలకు పాఠశాలలు ప్రారంభమవు తాయి. మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయి. ఏప్రిల్ 23 వరకు ఇదే కంటిన్యూ అవుతాయి స్కూళ్లు. 10వ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం పూట స్కూళ్లు జరుగుతాయని సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 20 లేదా 25 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం అవుతాయి.
ALSO READ: మంచి నీళ్లు బైక్ క్లీనింగ్.. ఆ యువకుడికి రూ. 1000 ఫైన్
ఓవైపు హెచ్చరికలు
ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణలోని కొన్నిజిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి. వడగాలులు ఉంటాయని ఓ వైపు వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. మధ్యాహ్నం సమయంలో చిన్నారులు, వృద్ధులు సాధ్యమైనంత వరకు బయటకు రావద్దని చెబుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చినా ఎండ వేడిమి నుంచి కాపాడుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నది వైద్యులు సూచన.
ఉష్ణోగ్రతల్లో మార్పులు 40 డిగ్రీలు పైగానే
ఏపీ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చాయి. ఎండ వేడితోపాటు వడ గాలులు ఈసారి మార్చిలో మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. బుధవారం ఉమ్మడి కర్నూలు జిల్లా ఆత్మకూరులో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో 40 డిగ్రీలు నమోదు అయ్యాయి.
వడగాలుల అలర్ట్
ఇక కడప జిల్లా వేంపల్లి, కృష్ణా జిల్లా కంకిపాడులో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన అడ్డతీగల, దేవీపట్నం, గంగవరం, రంపచోడవరం, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు వంటి ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 143 మండలాల్లో వడగాలులు వీయనున్నాయి. శ్రీకాకుళం జిల్లా- 11 మండలాలు, విజయనగరం- 11, పార్వతీపురం మన్యం- 9, అల్లూరి సీతారామరాజు జిల్లా- 6, కాకినాడ-2, తూర్పు గోదావరి- 16, పశ్చిమ గోదావరి-16, ఏలూరు- 14, కృష్ణా- 19, వడగాలులు వీయనున్నాయి. ఎప్పుడూ లేని విధంగా మార్చి మొదటి వారంలో ఎండ 40 డిగ్రీలను దాటేసింది.