CM Revanth Reddy: జపాన్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ రోజు సీఎం కిటాక్యూషూ నగరాన్ని సందర్శించారు. నగరంలో కలుషిత నివారణ కోసం తీసుకున్న చర్యల గురించి అక్కడి అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.
ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ బృందాన్ని స్థానిక జపనీస్ నగర మేయర్ టకేచీ సాంప్రదాయ రీతిలో ఘనంగా స్వాగతించారు. సీఎం రేవంత్ రెడ్డికి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులకు మేయర్ స్వాగతం పలికారు.
ఇదిగో వీడియో..
జపాన్‌లో సీఎం రేవంత్ రెడ్డి
కితాక్యూషూ మేయర్‌ను కలుసుకున్న జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు మరియు అధికారులను అక్కడి సాంప్రదాయ రీతిలో ఘనంగా స్వాగతించిన మేయర్ కజుహిసా టకేచీ pic.twitter.com/7TnPPEhGNY
— BIG TV Breaking News (@bigtvtelugu) April 20, 2025
అయితే ఒకప్పుడు జపాన్ దేశంలో అత్యంత పొల్యూషన్ ఉన్న నగరం కిటాక్యూషూ. ఈ నగరంలో గాలి, నీరు, నేల విపరీతమైన కాలుష్యంతో కూరుకుపోయిన పరిస్థితి నెలకొని ఉండేది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి అమలు చేసిన పర్యావరణ పరిరక్షణ విధానాలతో కిటాక్యూషూ నగరం పొల్యూషన్ నుంచి బయటపడింది. కొన్ని సంస్కరణల వల్ల అది కాలుష్యం నుంచి విముక్తి పొందింది. పర్యావరణ పరిరక్షణ, రీసైక్లింగ్ ఆవిష్కరణలు, సుస్థిరత పరంగా కిటాక్యూషూ నగరం ప్రపంచ వ్యాప్తంగా హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది.
పర్యావరణ పునరుజ్జీవనానికి, సుస్థిర నగరాభివృద్ధి ఓ ఆదర్శంగా నగరంగా కిటాక్యూషూ పేరు ప్రఖ్యాతలు గాంచింది. కాలుష్యం నుంచి బయటపడేందుకు కిటాక్యూషూ నగరంలో అమలు చేసిన సంస్కరణలు, అక్కడ పాటించిన విధానాలను మేయర్ కజుహిసా టకేచీ నేతృత్వంలోని అధికారుల బృందం సీఎం రేవంత్ రెడ్డి బృందానికి వివరించింది. సరైన విధానాలు, సంస్కరణలు చేపడితే ఎలాంటి నగరం అయినా, దేశం అయినా అభివృద్ధి చెందుతోందని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
Also Read: CSIR-CRRI Recruitment: గుడ్ న్యూస్.. ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.81,100 జీతం..