CSK VS MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament) భాగంగా ఇవాళ మరో.. రసవత్తర ఫైట్ జరగబోతోంది. సూపర్ సండే కావడంతో ఇవాళ రెండు మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాయల్ చాలెంజెస్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ పూర్తయింది. ఇందులో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక ఇటు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( CSK VS Mumbai ) మధ్య మరికాసేపట్లోనే మ్యాచ్ ప్రారంభం కాబోతోంది.
Also Read: Krunal-Kohli: నీకు మెంటలా… ఎక్కడ చూస్తున్నావ్.. కోహ్లీ పరువు తీసిన కృనాల్ పాండ్యా
ఇలాంటి నేపథ్యంలో.. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటికి క్రితమే ముగిసింది. ఇందులో మొదట టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా… బౌలింగ్ చేసేందుకే నిర్ణయం తీసుకున్నాడు. ఈ ముంబై గడ్డపైన.. చేజింగ్ చేసిన జట్లు ఎక్కువగా గెలుస్తున్నాయి. అందుకే ముంబై ఇండియన్స్ కెప్టెన్ చాలా తెలివిగా వ్యవహరించి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ముంబై ఇండియన్స్ మొదట టాస్ గెలవడంతో… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తోంది. మరి కాసేపట్లోనే ధోని టీం బ్యాటింగ్ చేయనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఈ రెండు జట్ల రికార్డులు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇప్పుడు వరకు ఈ రెండు జట్ల మధ్య 38 మ్యాచులు జరిగాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ 18 మ్యాచ్లో విజయం సాధిస్తే ముంబై ఇండియన్స్ ఏకంగా 20 మ్యాచ్ లో విజయం సాధించింది. అంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పైన ముంబై ఇండియన్స్ కు మంచి రికార్డు ఉందన్నమాట. ఇక చివరగా ఐపిఎల్ 2024 టోర్నమెంటులో ముంబై ఇండియన్స్ పైన చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. అటు 2023 ఐపీఎల్ టోర్నమెంట్ లో కూడా రెండుసార్లు చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడం జరిగింది. కానీ ఓవరాల్ గా ముంబై ఇండియన్స్ ఎక్కువ విజయాలను నమోదు చేసుకుంది.
Also Read: Chahal-RJ Mahvash: పెళ్ళాన్ని వదిలేసి.. ప్రియురాలితో అడ్డంగా దొరికిపోయిన చాహల్
ముంబై ఇండియన్స్ VS చెన్నై సూపర్ కింగ్స్
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, ఆయుష్ మ్హత్రే, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, విజయ్ శంకర్, జామీ ఓవర్‌టన్, MS ధోని(w/c), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ