BigTV English

Delimitation: అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏమిటి..? దక్షిణాది రాష్ట్రాలకే ఎందుకీ నష్టం..?

Delimitation: అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏమిటి..? దక్షిణాది రాష్ట్రాలకే ఎందుకీ నష్టం..?

Delimitation: తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాలులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్యర్యంలో సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన అంశంపై రాష్ట్రంలోని అన్ని పార్టీ నాయకులతో డిప్యూటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ హాజరయ్యారు. అయితే  అఖిల పక్ష సమావేశంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు హాజరు కాలేదు.


ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశాల్లో డీలిమిటేషన్ విధానంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ అఖిల పక్ష సమావేశానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా హాజరు కావాలని పిలుపునిస్తూ భట్టి విక్రమార్క ఒ లేఖను కూడా రిలీజ్ చేశారు. పాపులేషన్ ఆధారంగా జరగబోయే డీలిమిటేషన్ తో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరగనుందని.. జరగబోయే నష్టాన్ని గురించి అన్ని పార్టీలతో  ముందుగానే చర్చించాలని ఈ సమావేశ ప్రధాన ఉద్దేశ్యం. తక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్స్ డిలీమిటేషన్ విధానం ద్వారా నష్టపోయే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఇటీవల తమిళనాడు గవర్నమెంట్ 1971 జనాభా ప్రాతిపదికన తీసుకోవాలని కేంద్రానికి తీర్మానం కూడా పంపింది.

అయితే ఈ రోజు నిర్వహించిన అఖిలపక్ష సమావేశం గురించి మీడియా చిట్ చాట్ లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడారు. ‘డీలిమిటెషన్ పై ఉన్న ఆందోళన గురించి అన్ని పార్టీలతో చర్చించాం. అన్ని పార్టీలు అభిప్రాయాలు చెప్పాయి. ఈ రోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో కొన్ని పార్టీల గైర్హాజరు కావడం మామూలు విషయమే. భవిష్యత్తులో అన్ని పార్టీలు కలిసి వస్తాయి. ఇది ప్రాసెస్ లో ముందడుగు మాత్రమే. ఇంకా ఇలాంటి అఖిల పక్ష సమావేశాలు కొనసాగుతాయి. తమిళనాడు ప్రభుత్వం నిర్వహించినున్న సమావేశానికి తెలంగాణ నుంచి ఓ ప్రతినిధి బృందం వెళ్తుంది. అన్ని పార్టీల నుంచి ఒక్కొకరు ఉంటారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.


డీలిమిటేషన్ అంటే ఏమిటి..? 

డీలిమిటేషన్ అంటే ప్రతి రాష్ట్రంలోని లోక్‌సభ (ఆర్టికల్ 82), అసెంబ్లీ (172) స్థానాల సంఖ్య, అలాగే ప్రాదేశిక నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియ. ఈ విధానం పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన ‘డీలిమిటేషన్ కమిషన్’ నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ దేశంలో మూడు సార్లు జరిగింది. చివరి సారి 1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభలో సీట్ల సంఖ్య 543గా నిర్ణయించారు. అప్పుడు జనాభా 54.8 కోట్లు. అయితే అప్పటి నుంచి  డీలిమిటేషన్ ప్రక్రియ క్రమంగా వాయిదా పడుతూ వస్తుంది. దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాల కారణంగా ఈ వాయిదాను 2026 వరకు పొడిగించారు.

డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు నష్టమెందుకు..?

భారతదేశ రాజ్యాంగం ప్రకారం.. జనాభా ప్రాతిపదికగా నియోజకవర్గాల సంఖ్య నిర్ణయించాల్సి ఉంటుంది. దీని ప్రకారం జనాభా ఎక్కువ గల రాష్ట్రాలకు ఎక్కువ లోక్ సభ స్థానాలు వస్తే.. తక్కువ జనాభా గల రాష్ట్రాల్లో ఈ సంఖ్య తగ్గుతుంది. ఎమ్మెల్యేల సంఖ్య కూడా ఈ విధంగానే నిర్ణయిస్తారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా పలు సార్లు తీసుకొచ్చిన(1952, 1975-76) జనాభా నియంత్రణను ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాలు సక్సెస్ ఫుల్ గా పాటించాయి. ఫలితంగా ఈ రాష్ట్రాలకు జనాభా నియంత్రణ బాగా జరిగింది. ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బిహార్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో మాత్రం జనాభా విపరీతంగా పెరిగింది. నిబంధనలను ఏమాత్రం పాటించని ఈ రాష్ట్రాలకు డీలిమిటేషన్ ప్రక్రియ లాభం చేకూరనుంది. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉంది. దీని కారణంగా ఈ రాష్ట్రాలకు లోక్ సభ స్థానాల సంఖ్య ఎక్కువగా పెరగనున్నాయి. దీనిపైనే దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.. ఈ అభ్యంతరాల వల్లే డీలిమిటేషన్ ప్రక్రియ 2026 వరకు వాయిదా పడింది. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాలు ముందుస్తు జాగ్రత్తగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి.

డీలిమిటేషన్ కమిషన్ ఏం చేస్తుంది..?

☀ డీలిమిటేషన్ కమిషన్‌ను భారత రాష్ట్రపతి నియమిస్తారు. భారత ఎన్నికల సంఘంతో కలిసి డీలిమిటేషన్ కమిషన్ పనిచేస్తుంది

☀ దేశవ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల సరిహద్దులను కమిషన్ నిర్ణయిస్తుంది.

☀ ఎంపీ, ఎమ్మెల్యేల సంఖ్యను జనాభా ప్రాతిపదికన తగ్గించాలా..? పెంచాలా..? అనేది కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది.

☀ షెడ్యూల్డ్ తెగల జనాభా అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలను ఎస్టీలకు రిజర్వ్ చేస్తుంది.

☀ షెడ్యూల్డ్ కులాల విషయంలో కూడా డీలిమిటేషన్ కమిషన్ ఓ నిర్ణయం తీసుకుని కొన్ని నియోజకవర్గాలను ఎస్సీలకు రిజర్వ్ చేస్తుంది.

ALSO READ: CM Revanth Reddy: యువతకు భారీ గుడ్ న్యూస్.. రూ.4,00,000 స్కీం ప్రారంభించిన సీఎం రేవంత్

ALSO READ: Agniveer Recruitment: ఎనిమిది, పదో తరగతి అర్హతతో భారీగా అగ్నివీర్ జాబ్స్.. నోటిఫికేషన్ వచ్చేసింది.. జీతం రూ.30,000

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×