BigTV English

Star Heroine: ఈ ఫొటోలో ఉన్న చిన్నారి.. ఇప్పుడు గ్లామర్ క్వీన్, గుర్తు పట్టారా?

Star Heroine: ఈ ఫొటోలో ఉన్న చిన్నారి.. ఇప్పుడు గ్లామర్ క్వీన్, గుర్తు పట్టారా?

Star Heroine: కొంతమంది హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలు చూస్తే ఇట్టే గుర్తుపట్టేయవచ్చు. కానీ కొందరి ఫోటోలు చూస్తే వారు ఎవరో గుర్తుపట్టడం అనేది అంత ఈజీ కాదు. తాజాగా ఒక గ్లామర్ క్వీన్ కూడా తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఫోటోలు షేర్ చేసి విషెస్ తెలిపింది. అందులో తన చిన్నప్పటి ఫోటోలు కూడా యాడ్ చేసింది. అసలు ఫోటోలు అనేవి ఎంత ముఖ్యమని తన తండ్రి చెప్తుండేవారని, ఇప్పుడు తను షేర్ చేసిన ఫోటోలు తనకు చాలా విలువైనవని చెప్పుకొచ్చింది. దీంతో ఆ ఫోటోలకు, అందులో ఉన్న తన క్యూట్ ఫేస్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ప్రస్తుతం సౌత్‌లో గ్లామర్ క్వీన్‌గా వెలిగిపోతున్న మాళవికా మోహనన్.


క్యూట్‌గా ఉంది

మాళవికా మోహనన్ (Malavika Mohanan).. తెలుగులో నేరుగా ఒక్క సినిమా చేయకపోయినా ఈ హీరోయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. తమిళంలో పలు స్టార్ హీరోలతో కలిసి నటించిన మాళవికా.. త్వరలోనే ప్రభాస్ ‘రాజా సాబ్’తో టాలీవుడ్‌లో డెబ్యూ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. సినిమాలతోనే కాదు.. సోషల్ మీడియాతో కూడా ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌ను పలకరిస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తన తల్లి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది మాళవికా. అందులో తన తల్లి పాత ఫోటోలతో పాటు తన చిన్నప్పటి ఫోటోలు కూడా యాడ్ చేయడంతో మాళవికా చాలా క్యూట్‌గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


అందమైన జ్ఞాపకాలు

‘నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న.. అమ్మ ఫోటోలను చాలా అందంగా తీసేవారు. అందులోని చాలా ఫోటోలు సినిమాల్లోని ఫ్రేమ్స్‌లాగా అనిపించేవి. ఇవి ఎంత ముఖ్యమని నాకు చిన్నప్పుడు తెలియలేదు. కానీ ఈ ఫోటోల మధ్యే నేను పెరిగాను. ప్రతీ ఇంట్లోనూ ఇలాంటి అందమైన ఫోటోలు ఉంటాయని అనుకునేదాన్ని. మెల్లగా అంతా డిజిటల్ అయిపోయి మా నాన్న ఫోటోలు తీయడం ఆపేశారు. డిజిటల్‌లో ఆయనకు ఆ ప్రేమ కనిపించలేదేమో. ఫోటోలు తీయడం చాలా ఈజీ అయిపోయిందేమో. ఏదైనా పనిచేయడం ఈజీ అయిపోయినప్పుడు అది పెద్దగా చేయాలని అనిపించదు. ఆయన ఫిల్మ్‌ను మిస్ అయ్యారేమో’ అంటూ తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంది మాళవికా.

Also Read: ఆమె బయోపిక్‌లో నటించాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన తమన్నా

అమ్మ పుట్టినరోజు

‘ఈరోజు మా ఇంట్లో ఉన్న విలువైన వస్తువుల్లో ఈ ఫోటోలు కూడా ఒకటి. ఈరోజు అమ్మ పుట్టినరోజు. అందుకే నావి, తనవి ఫేవరెట్ ఫోటోలు షేర్ చేయాలని అనుకున్నాను’ అంటూ తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది మాళవికా మోహనన్. దీంతో తన ఫ్యాన్స్ సైతం మాళవికా తల్లికి బర్త్ డే విషెస్ తెలిపారు. ముఖ్యంగా తన చిన్నప్పటి ఫోటోలు చూసి చాలా క్యూట్ ఉందని, ఏమీ మారలేదని కామెంట్స్ చేస్తున్నారు ఫాలోవర్స్. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా ఇలా తన పర్సనల్ లైఫ్ విషయాలు, స్పెషల్ మూమెంట్స్ షేర్ చేసుకుంటూ సోషల్ మీడియా ఫాలోవర్స్‌ను కూడా హ్యాపీ చేస్తుంటుంది మాళవికా మోహనన్. ప్రస్తుతం తనకు సోషల్ మీడియాలో 4 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×