Karuvanam web series Review in Telugu: కథలో విషయం ఉండాలే కానీ.. భాషతో సంబంధం ఏం ఉంది చెప్పండి. మనల్ని ఎంటర్‌టైన్ చేస్తూ ఎంగేజ్ చేస్తే చాలు.. ఏదైనా ఎక్కేస్తుంది. తాజాగా ఓ తమిళ వెబ్ సీరిస్ ఇలాంటి క్రేజ్‌నే సొంతం చేసుకుంది. ఐఎండీబీ (IMDB)లో ఏకంగా 8.5 రేటింగ్‌తో దూసుకుపోతోంది. ఈ హార్రర్ – మిస్టరీ వెబ్ సీరిస్ పేరు.. ‘కరువనం’ (Karuvanam web series explained in telugu). దీన్ని సింగపూర్‌లో నిర్మించారు.
కథ ఏమిటంటే..
ఈ సిరీస్ ప్రధానంగా అనాథ కవల సోదరీమణులు మీరా (ఉదయ సౌందరి), శాలిని (జయశ్రీ విజయన్) చుట్టూ తిరుగుతుంది. వీరిద్దరూ తమ తల్లి మరణం తర్వాత ఆమె ఇంటిని వారసత్వంగా పొందుతారు. అయితే ఆ ఇంట్లో చీకటి రహస్యాలు.. చాలానే ఉంటాయి. అవేంటీ అనేది నెమ్మదిగా ఒక్కో ఎపిసోడ్‌లో రివీల్ అవుతుంది. ఇక కథలోకి వెళ్తే.. మీరా, శాలినికి తమ గతం గురించి ఏమీ తెలీదు. దీంతో తమ తల్లి గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో వారసత్వంగా లభించిన ఇంట్లో అడుగు పెడతారు. మీరా తన భర్త ఆదిత్య (వీరరాఘవన్), వారి కొడుకుతో కలిసి ఆ ఇంట్లోకి వస్తుంది. కానీ, శాలిని ఒంటరిగా, స్వతంత్ర భావాలతో ఉంటుంది.
ఇంట్లో భయానక అనుభవాలు
వారు ఆ ఇంట్లో అడుగుపెట్టగానే భయానక అనుభవాలు ఎదురవ్వుతాయి. అప్పుడే విఘ్నేష్ అనే వ్యక్తి ఆ ఇంట్లోకి ఎంట్రీ అవుతాడు. అతడికి వారి తల్లి గురించి బాగా తెలుసు. కానీ, అతడు వారి వద్ద ఏదో దాస్తున్నట్లుగా కనిపిస్తాడు. అయితే, అతడి వల్ల మీరా, శాలిని మధ్య స్పర్థలు వస్తాయి. అదే సమయంలో మీరా తన కొడుకు కనిపించకుండా పోతాడు. దీని వెనుక బీమా అనే వ్యక్తి హస్తం ఉందని అనుమానిస్తారు. అక్కడి నుంచి కథ మరిన్ని మలుపులు తిరుగుతుంది.
Also Read: Sonu Sood: మాట నిలబెట్టుకున్న సోను సూద్.. ఫిష్ వెంకట్ కుటుంబాన్ని పరామర్శించిన రియల్ హీరో
భూతవైద్యుడి ఎంట్రీతో.. రహస్యాలు బయటకు..
ఇంట్లో ఎదురవుతోన్న భయానక అనుభవాలను వల్ల.. ఓ భూత వైద్యుడు ఎంట్రీ ఇస్తాడు. ఆ ఇంటికి ఓ ఆత్మ శాపం ఉందని చెబుతాడు. ఆ ఇంట్లోవారికి నిద్రలేకుండా చేస్తున్న ఆత్మ ఎవరిది? దానికి, తమ తల్లికి ఉన్న సంబంధం ఏమిటీ అనేది ఒక్కో ఎపిసోడ్‌లో రివీల్ అవుతుంది. అయితే, ఇంట్లో దెయ్యం.. భయపడటం అన్నీ సాధారణమే కదా అని లైట్‌గా తీసుకోవద్దు. ఇందులో భయపెట్టే సన్నివేశాలు కంటే ట్విస్టులే ఎక్కువ ఆసక్తిగా ఉంటాయి. చివరి వరకు సస్పెన్స్ ఉంటుంది. మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రస్తుతం ఈ వెబ్ సీరిస్ (Karuvanam web series explained in telugu) యూట్యూబ్‌లో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో లేదు. తమిళ సబ్ టైటిల్స్‌తో చూడాలి.
Also Read: Ghaati Movie: స్వీటీ ఫ్యాన్స్‌కి డబుల్ సర్‌ప్రైజ్.. ఒకేరోజు ఘాటీ ట్రైలర్, రిలీజ్ డేట్..