Bandi Sanjay: కరీంనగర్ దీక్షా దివస్ సభలో కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. గురువు కాళ్లుమొక్కి చెప్పులు ఎత్తుకుపోయే గజ దొంగలు మీరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువుకు దండం పెట్టే సంస్క్రుతి మాది. పార్లమెంట్‌లో తెలంగాణ కోసం పోరాడిన పార్టీ బీజేపీది. పార్లమెంట్‌కు రాకుండా తుగ్లక్ రోడ్డులో తాగి పడుకున్న చరిత్ర కేసీఆర్ ది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేసిన మోసగాళ్లు మీరని, తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్నది చరిత్ర మాదని అన్నారు. అధికారంలో ఉన్నంత కాలం రూ.లక్షల కోట్లు దోచుకున్న చరిత్ర మీది. 13 ఏళ్లలో రూ.13 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చిన చరిత్ర మాదని అన్నారు. కడుపులో విషం పెట్టుకుని తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెట్టుకున్న చరిత్ర కేసీఆర్ ది. తెలంగాణపై ప్రేమతో అత్యధిక నిధులిస్తున్న చరిత్ర మోదీదని బండి సంజయ్ అన్నారు.
కరీంనగర్‌కు రూ.వేల కోట్ల దొంగ హామీలిచ్చి మోసం చేసిన చరిత్ర మీది. కరీంనగర్‌కు బడి, గుడితోపాటు రూ.20 వేల కోట్లపైగా నిధులు ఖర్చు చేసిన చరిత్ర మాదని అన్నారు. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లేన్ నిర్మాణ పనులు సిరిసిల్ల వరకు పూర్తి కావొస్తున్నయని, కళ్లుండి చూడలేని కబోధి కేటీఆర్ అని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. దీక్షా దివస్ కాదు.. పొర్లు దండాల దీక్షలు చేసిన జనం మిమ్ముల్ని నమ్మరని, ఇక మీ బతుకుంతా ఫాంహౌజ్ కే పరిమితం అని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరూ తోడు దొంగలేనని, కల్వకుంట్ల అవీనీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోదని అన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు, 420 హామీల వైఫల్యాలపై పోరాడే దమ్ము బీఆర్ఎస్‌కు లేదు. నువ్వు కొట్టినట్లు చేయ్.. నేను ఏడ్చినట్లు చేస్తానన్నట్లుంది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరు అని బండి సంజయ్ విమర్షించారు. ప్రజలకు రెండు పార్టీల భాగోతం అర్ధంమైందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను చిత్తుచిత్తుగా ఓడిస్తామని, రాసిపెట్టుకోండి.. గొల్లకొండ కోటపై ఈసారి ఎగిరేది కాషాయ జెండానని కేంద్ర మంత్రి బండి సంజయ్ దీమా వ్యక్తం చేశారు.
Also Read: డీలిమిటేషన్ అంశం పై.. స్టాలిన్ తేల్చిచెప్పిన మాటలివే..?