Guru Controversy: ఒంటిపై కాషాయం దుస్తులు.. మెడలో రుద్రాక్షమాలలు నోరు తెరిస్తే ఆధ్యాత్మిక సూక్తులు కానీ ఆ గురుజీ మొబైల్ లాక్ ఓపెన్ చేస్తే భక్తి సూక్తులు ఉండవు రక్తి సూక్తులే దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 71. ఇక్కడే ఉంది శ్రీవిద్యా సాధనా సెంటర్. ఇక్కడ ఆధ్యాత్మిక సాధనలు, పూజలు, ధ్యానం.. ఇలా భక్తితో ముడిపడిన కార్యక్రమాలు జరుగుతాయి. లోపల కూర్చునేది శ్రీ చైతన్య గురూజీ.. అలియాస్ మేరెడ్డి సునీల్‌రెడ్డి. ఆయన సాధన నేర్పిస్తానంటే జనం క్యూ కట్టారు.. భక్తితో నమ్మారు. కానీ ఆ నమ్మకం వెనుక నమ్మలేని మరో కథ నడుస్తోందా?
అదే ప్రాంతంలోని స్రవంతి నగర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ భార్య.. మానసిక ప్రశాంతత కోసం క్రమం తప్పకుండా ఈ కేంద్రానికి వచ్చేది. భార్య సాధన కోసం వెళ్తుందనే నమ్మకంతో ఆ భర్త కూడా మొదట్లో ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు. కానీ గురుజీ సెల్‌ఫోన్ నుంచి ఆ మహిళకు అసభ్యకరమైన మెసేజ్‌లు, అభ్యంతరకరమైన చాటింగ్‌లు వస్తున్నాయి. ఆ మెసేజ్‌లు భర్త చూడడంతో మ్యాటర్ సీరియస్ అయ్యింది.
వారి ఇంట్లో ప్రశాంతత పోయింది. భార్యాభర్తల మధ్య చిచ్చు రేగింది. వెంటనే ఈ దారుణాన్ని ప్రశ్నించడానికి ఆ సాధనా కేంద్రానికి వెళ్తే.. తనను చంపేస్తానని ఆ గురుజీ బెదిరించాడని ఆ మహిళ భర్త వాపోయాడు. ఇక లాభం లేదనుకొని పక్కా ప్రూఫ్స్‌తో నేరుగా కోర్టు గుమ్మం తొక్కాడు. ఇది గురూజీ అస్సలు ఊహించి ఉండడు. సాధనకు అర్థం చెప్పే వాడికి.. ఇప్పుడు చట్టం తనదైన భాషలో పాఠం చెప్పబోతోంది. కోర్టు ఆదేశాలతో జూబ్లీహిల్స్ పోలీసులు శ్రీ చైతన్య గురూజీపై కేసు నమోదు చేశారు. మెసేజ్‌లు ఎప్పుడు పంపారు..? ఎంతకాలం ఈ వ్యవహారం సాగింది..? వాటిలో అసలు ఏం ఉంది..? ఫోన్లో మరిన్ని ఆధారాలు ఉన్నాయా..? ఇలా ఒక్కో అంశాన్ని పోలీసులు చెక్ చేస్తున్నారు. మొత్తానికి ఆ గురుజీ మొబైల్లోఉన్న గుట్టు ఏంటో తేలిపోనుంది.
Also read: అగ్గిపెట్టి మచ్చ అంత్యక్రియల్లో అసలేం జరిగింది? బయటపెట్టిన వైజాగ్ సత్య!