Pushpa movie Drug smuggler | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా దేశ వ్యాప్తంగా బాక్సాఫీసుని షేక్ చేస్తోంది. వేయి కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డులు తిరగారస్తోంది. పుష్ప -2 ప్రభంజనానికి బాలీవుడ్ హీరోల సినిమాలు సైతం విడుదల తేదీలు వాయిదాలు వేసుకుంటున్నాయి. దక్షిణాదితో పాటు హిందీ రాష్ట్రాల్లో కూడా ప్రేక్షకులు భారీ సంఖ్యలో సినిమా చూడడానికి వెళుతున్నారు.
ఈ క్రమంలో థియేటర్ల వద్ద టికెట్ల కోసం ఘర్షణ జరుగుతున్న ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని నాగ్ పూర్ నగరంలో ఒక వింత ఘటన జరిగింది. పుష్ప -1 సినిమాలో అల్ల అర్జున్ ఒక ఎర్రచందనం స్మగ్లర్ పాత్ర పోషించి మెప్పించాడు. అది చూసిన ఒక హంతకుడు, డ్రగ్స్ స్మగ్లర్ అల్లు అర్జున్ కు వీరాభిమాని అయిపోయాడు. పుష్ప -2 సినిమా చూడడానికి అతను చాలా కాలంగా ఎదురు చూశాడు. కానీ పోలీసులు అతని కోసం గాలిస్తుండడంతో సినిమా చూడడానికి కష్టాలు పడ్డాడు. ఎలాగైతేనే అతను చివరికి పుష్ప -2 సినిమాకు వెళ్లాడు. కానీ అతని బ్యాడ్ లక్.. అక్కడ అతడిని పట్టుకోవడానికి పోలీసులు పెద్ద స్కెచ్ వేశారు.
విశాల్ మెశ్రాం అనే నేరస్తుడు గత పద నెలలుగా పోలీసులు నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. అతను తరుచూ ఒక చోట నుంచి మరో చోటికి మకాం మారుస్తుండడంతో పోలీసులు అతడిని పట్టుకోలేకోపోయారు. ఈ క్రమంలో గత గురువారం డిసెంబర్ 19, 2024న అతను నాగ్ పూర్ లోని పాచ్ పావోలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పివిఆర్ మల్లీప్లెక్స్ లో సెకండ్ షో చూడడానికి వెళ్లాడు. సినిమా థియేటర్లో ఫుల్ గా ఉన్న జనం మధ్య వెళ్లి కూర్చున్నాడు. అయితే థియేటర్ కు అతను ఒక స్పోర్ట్స్ కారులో వచ్చాడు.
Also Read: శోభనం రాత్రి గంజాయి, మటన్ కావాలన్న పెళ్లికూతురు.. ఆమె ఆడది కాదన్న అనుమానంతో వరుడు!
గత కొన్ని నెలలుగా విశాల్ మెశ్రాం కోసం గాలిస్తున్న పోలీసులకు అతను సినిమా చూడడానికి వెళుతున్నట్లు చివరి నిమిషంలో సమాచారం అందింది. దీంతో పోలీసులు తాపీగా సినిమా థియేటర్‌కు వెళ్లి.. అతడు తప్పించుకోకుండా ఉండేందుకు అతని కారు టైర్ల గాలి తీసేశారు. ఆ తరువాత 10 మంది పోలీసులు థియేటర్లో ప్రవేశించి.. హత్య, డ్రగ్స్ కేసులలో నిందితుడైన విశాల్ మేశ్రాం కూర్చున్న సీటుని మెల్లగా చుట్టుముట్టారు. పోలీసులు సివిల్ డ్రెస్సులో ఉండడంతో నేరస్తుడు వారిని గుర్తుపట్టలేకపోయాడు. అందువల్ల సునాయసంగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఆ సమయంలో పుష్ప 2 సినిమా క్లైమాక్స్ సీన్ నడుస్తోంది.
ఇది చూసి థియేటర్లో ప్రేక్షకులంతా ఏం జరుగుతోందని భయపడిపోయారు. పోలీసులు చేతిలో తుపాకులు ఉండడంతో ప్రేక్షకులు కేకలు వేశారు. కానీ పోలీసులు వారిని శాంతింప చేసి.. ఏ ప్రమాదం లేదని చెప్పి.. థియేటర్ లో క్లైమాక్స్ సీన్ మళ్లీ రన్ చేయమని థియేటర్ యజమాన్యానికి సూచించి వెళ్లిపోయారు.
డ్రగ్స్ స్మగ్లర్ అయిన విశాల్ మేశ్రాం గతంలో పోలీసులపై దాడులు చేశాడని.. ఇద్దరిని హత్య కూడా చేశాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విశాల్ మెశ్రాం నాగ్ పూర్ సెంట్రల్ జైల్ లో ఉన్నాడు. త్వరలోని అతడిని నాశిక్ జైలుని బదిలీ చేస్తామని పోలీసులు వెల్లడించారు. అంటే పుష్ప-2 సినిమా వల్ల ఒక డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్ అయ్యాడు.