BigTV English

Anchor Pradeep: స్టేజ్ పైనే స్టార్ హీరోయిన్ కి ప్రదీప్ ప్రేమలేఖ.. క్రేజీ రియాక్షన్..!

Anchor Pradeep: స్టేజ్ పైనే స్టార్ హీరోయిన్ కి ప్రదీప్ ప్రేమలేఖ.. క్రేజీ రియాక్షన్..!

Anchor Pradeep:బుల్లితెరపై అద్భుతమైన వాక్చాతుర్యంతో, కామెడీతో ఆడియన్స్ ని అలరిస్తూ షోను సక్సెస్ చేస్తూ ముందుకు సాగుతున్న యాంకర్స్ లో ప్రదీప్(Pradeep) ప్రథమ స్థానంలో నిలిచారు. ఫిమేల్ యాంకర్స్ లో సుమా(Suma) ఎలా అయితే పేరు దక్కించుకుందో.. మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కూడా అంతే పేరు సొంతం చేసుకున్నారు. బుల్లితెరపై పలు ఛానల్స్ లో ప్రసారమయ్యే పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఒక పాత్రలో నటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్ గా చేసిన ఈయన తొలిసారి ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమాతో హీరోగా మారి సక్సెస్ అందుకున్నారు.


స్టార్ హీరోయిన్ కి ప్రదీప్ ప్రేమలేఖ..

ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ప్రదీప్. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రముఖ యాంకర్ దీపిక పిల్లి(Deepika Pilli) నటిస్తోంది. ఈ క్రమంలోనే ప్రదీప్ కి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రదీప్ తన మొదటి ప్రేమలేఖను ఒక స్టార్ హీరోయిన్ కి ఇచ్చాడని, అయితే ఆ స్టార్ హీరోయిన్ కూడా క్రేజీగా సమాధానం చెప్పిందని సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో ప్రదీప్ ‘కొంచెం టచ్ లో ఉంటే చెబుతా’ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఈ కార్యక్రమానికి పలువురు స్టార్ సెలబ్రిటీలు వచ్చి సందడి చేసేవారు. ఈ నేపథ్యంలోనే అనుపమ కూడా ఒకరోజు షో కి రాగా..ఆమెకు తన ప్రేమ లేఖను అందించారు ప్రదీప్.


అందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అనుపమ..

అంద చందాలతో నటనతో యువతను ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ అమ్మడు,ఈ మధ్య కాలంలో హద్దులు దాటి మరీ నటిస్తోంది అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే అబ్బాయిల కలల రాకుమారిగా మారిన ఈమె నటి మాత్రమే కాదు మల్టీ టాలెంటెడ్ కూడా. ఒకప్పుడు పద్ధతికి పెద్దపీట వేసిన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసి ట్రెండ్ ని ఫాలో అవుతోంది. ఇక ఆమధ్య ప్రదీప్ యాంకర్ గా చేస్తున్న కొంచెం టచ్ లో ఉంటే చెబుతా షో కి వెళ్లిన ఈమె, అందులో తన స్కూల్ డేస్ మెమోరీస్ ని పంచుకుంది.

అనుపమ పరమేశ్వరన్ కు ప్రేమలేఖ ఇచ్చిన ప్రదీప్..

అనుపమా మాట్లాడుతూ..” ఒకటి రెండు లవ్ లెటర్స్ మినహా ఎవరు నాకు పెద్దగా లవ్ లెటర్లు రాయలేదు. అయితే అవి సీరియస్గా రాసేవారు కాదు. అదే బాధగా ఉండేది. అయితే చాలామంది నా వెంటపడేవారు కానీ నేను కోప్పడడంతో వెళ్లిపోయేవారు” అంటూ తెలిపింది అనుపమ. ఇక దీనిని విన్న ప్రదీప్ అవకాశంగా తీసుకున్నాడు. అనుపమ పరమేశ్వరన్ కి పొయెటిక్ గా, రొమాంటిక్ గా లవ్ లెటర్ కూడా రాశాడు. తనమీద గులాబీ పూల రేకులు చల్లుతూ లవ్ లెటర్ ఇచ్చాడు. కానీ అది తెలుగులో ఉండడంతో ఆమెకు అర్థం కాలేదు. దానితో ప్రదీప్ స్వయంగా చదివి వినిపించాడు… “ప్రియమైన అను.. ప్రేమతో నీ ప్రదీప్. మీ నడక, చూపు అద్భుతం , మీరే అద్భుతం, ఒక్క అవకాశం ఇస్తే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను”అంటూ లవ్ ప్రపోజ్ చేశాడు. దీంతో అనుపమ కూడా థాంక్యూ సో మచ్, మోస్ట్ వండర్ఫుల్ లవ్ లెటర్ అంటూ కామెంట్లు చేసింది. దీంతో ప్రదీప్ ఫుల్ ఖుషీ అయిపోయి థాంక్యూ చెప్పాడు. అంతే కాదు తాను రాసిన మొదటి ప్రేమలేఖ అని, అందులోను ఒక స్టార్ హీరోయిన్ కి అని చెప్పి సంబరపడిపోయారు ప్రదీప్.

Related News

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!

Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?

Big tv Kissik Talks: గోకులంలో సీత 2 మనసులో మాట బయటపెట్టిన రాశి… పవన్ ఛాన్స్ ఇస్తారా?

Big Stories

×