E-Paper
Advertisement

బీఆర్ఎస్ పార్టీలో మళ్లీ అదే సీన్ రిపీట్.. అధిష్టానాన్ని నిలదీస్తున్న యువ గళం!

బీఆర్ఎస్ పార్టీలో మళ్లీ అదే సీన్ రిపీట్.. అధిష్టానాన్ని నిలదీస్తున్న యువ గళం!
Advertisement

BRS Committees: స్వేచ్చ బ్యూరో: గులాబీ పార్టీలో ఇప్పుడుజోరుగా చర్చ జరుగుతుంది. పార్టీ కమిటీల్లోనూ, సభ్యత్వ నమోదు కమిటీల్లోనూ పగ్గాలు మళ్ళీ పాతవారికే దక్కుతాయా? లేక యువ రక్తాన్ని ఎక్కించి కొత్త ఊపిరి పోస్తారా? అనేది జోరందుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ త్వరలో కమిటీల ఏర్పాటుకు కసరత్తులు మొదలుపెట్టిన నేపథ్యంలో, యువతకు ఎంతవరకు ప్రాధాన్యం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలంగా పార్టీలో ‘మాజీల’ హవా కొనసాగుతుండటంతో, ద్వితీయ శ్రేణి నాయకత్వం, యువత అసహనంతో ఉన్నది.

పాత వారికే ఇస్తారా..

బీఆర్‌ఎస్ పార్టీ పునర్వైభవం దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతుంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అధినేత కేసీఆర్ కసరత్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే మంగళవారం నేతలతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో పార్టీ కమిటీల్లో యువతకు ఏ మేరకు ప్రాధాన్యం లభిస్తుందనే అంశంపై ఇటు పార్టీ నేతల్లోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ మొదలైంది. “పాత నీరు పోయి.. కొత్త నీరు రావాలి” అన్న చందంగా, పార్టీ పగ్గాలను యువ నేతలకు అప్పగిస్తారా అనేది చూడాలి. ఇప్పటికే పలు సందర్భాల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తామని పార్టీ అధిష్టానం ప్రకటించింది. కానీ ఇవ్వలేదు. పార్టీ మరో 40 ఏళ్లకు పైగా ఉండాలంటే యువ నాయకత్వం అవసరం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ సమావేశాల్లోనూ పేర్కొన్నప్పటికీ 2017 నుంచి పార్టీ కమిటీలువేయకపోవడంతోనే యువతకు ప్రాధాన్యం ఇవ్వలేదనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు కేసీఆర్ పార్టీపై దృష్టిసారించడం అందులో భాగంగానే సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీలపై సమావేశం నిర్వహిస్తుండటంతో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమకు అవకాశం రాబోతుందని యువనాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సభ్యత్వ నమోదులో మార్పు వచ్చేనా?.

Advertisement

త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించాలని అధిష్టానం భావిస్తోంది. అయితే, ఎప్పటి నుంచి ప్రారంభించేది మంగళవారం నిర్వహించే సమావేశంలో క్లారిటీ రాబోతున్నట్లు సమాచారం. ఈసారి కేవలం సంఖ్య పెంచుకోవడమే కాకుండా, విద్యావంతులైన యువతను, టెక్నాలజీపై అవగాహన ఉన్న వారిని పార్టీలోకి భారీగా చేర్చుకోవాలని యోచిస్తోంది. గతంలో నియోజకవర్గ ఇన్ చార్జులుగా ఉన్న ఎమ్మెల్యేలకే సభ్యత్వ నమోదు బాధ్యతలు అప్పగించడం, గ్రూపు రాజకీయాలు తెరమీదకు రావడంతో కొందరికి పార్టీకోసం పనిచేసేవారికి అన్యాయం జరిగిందని పలువురు బహిరంగంగానే పేర్కొన్నారు. అయితే ఈసారి కూడా వారికే ఇస్తే మాత్రం మళ్లీ నైరాశ్యం నెలకొనే అవకాశం ఉంది. పార్టీ డిజిటల్ మెంబర్‌షిప్‌ సైతం చేపడుతుండటంతో గ్రామ స్థాయి నుంచి యువతకు సభ్యత్వ బాధ్యతలు అప్పగిస్తారా లేదా అన్నది చూడాలి.

Also Read: దేశవ్యాప్తంగా జులై 1 నుండి కొత్త చట్టం అమలు.. పాత పేరుకు కేద్రం స్వస్తి!

మాజీల పెత్తనానికి చెక్?

Advertisement

గత పన్నెండేళ్లుగా పార్టీలో, నియోజకవర్గాల్లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలదే హవా నడుస్తోంది. దీనివల్ల ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎదగలేకపోతోందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ అసంతృప్తిని గమనించిన కేసీఆర్, ఈసారి ‘మాజీల’ నీడ నుంచి పార్టీని బయటపడేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అనుభవం ఉన్న పెద్దలను సలహాదారులుగా ఉంచి, పని చేసే యువతకు కార్యనిర్వాహక బాధ్యతలు అప్పగించేలా ప్రణాళికలు సిద్ధంచేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం అధికారం కోల్పోయినప్పటికీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలపై పెత్తనం సాగుతుండటంతో కొంత నైరాశ్యం నెలకొంది.

నియోజకవర్గాల్లో ‘యువ’ సారథ్యం?

గత ఎన్నికల ఫలితాల తర్వాత చాలా నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు మౌనంగా ఉంటుండటంతో పార్టీ కేడర్ అయోమయంలో ఉంది. దీనికి తోడు సీనియర్ల ఏకపక్ష నిర్ణయాలు సైతం పార్టీకి నష్టం చేకూరుస్తున్నట్లు పార్టీ దృష్టికి వచ్చినట్లు సమాచారం. యువతను కలుపుకుపోవడం, పార్టీని నడిపించడంలోనూ వెనుకబడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో నియోజకవర్గాల్లో పార్టీని పరుగులు పెట్టించాలంటే యువ నాయకత్వం అవసరమని కేడర్ భావిస్తోంది. పార్టీ అధిష్టానం సైతం ఆ దిశగానే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓడిన నియోజకవర్గాల్లోనూ వారే ఇన్‌చార్జులుగా కొనసాగుతుండటంతో, యువ నాయకులు ఎదగడానికి అవకాశం దక్కడం లేదనే వాదన బలంగా ఉంది. దీంతో వారికి గౌరవ ప్రదమైన పార్టీ పోస్టులు ఇచ్చి.. యువతకు ఇన్ చార్జీ బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలుగా, సోషల్ మీడియా బాధ్యతలు చూసే కీలక పదవుల్లో, మండల అధ్యక్షులు, గ్రామకమిటీ అధ్యక్షులుగా యువతకు చోటు కల్పించాలని ఇప్పటికే పలువురు బహిరంగంగానే పేర్కొంటున్నారు. అంతేకాదు పార్టీ మనుగడ సాగించాలంటే యువత భాగస్వామ్యం అనివార్యం. కేవలం ప్రచారానికే కాకుండా, నిర్ణయాధికారాల్లోనూ మాకు భాగస్వామ్యం కల్పించాలి. అని పార్టీకి చెందిన ఓ యువ నాయకుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Also read: పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి, 18 మందికి గాయాలు

అధినేత క్లారిటీ ఇచ్చేనా?

ఇప్పటికే పార్టీ గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా కమిటీలన్నింటిని రద్దు చేస్తున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భారీ మార్పులు ఉంటాయని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. కానీ, అవి ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతాయనేది ప్రశ్నార్థకం. సీనియర్ల అనుభవం, యువత ఉత్సాహం.. రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కేసీఆర్‌కు కత్తి మీద సాము లాంటిదే. పార్టీ నిర్వహించే ఈ సమావేశంలో యువతకు ప్రాధాన్యత ఇస్తారా? మాజీలపై పెద్దపీట వేస్తారా? అనేదానిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేటీఆర్ కూడా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. మరి ‘వృద్ధ’ జంబూకాల రాజకీయాలకు స్వస్తి పలికి, ‘యువ’ గర్జనకు కేసీఆర్ పచ్చజెండా ఊపుతారా అనేది చూడాలి.

పార్టీలో జోరుగా చర్చ

ప్రస్తుతం గులాబీ శ్రేణుల్లో ఎక్కడ చూసినా కమిటీల గురించే చర్చ జరుగుతోంది. “ఈసారి కూడా పాతవారికే పదవులు ఇస్తే, పార్టీలో కొత్త ఉత్సాహం రాదు” అని కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే యువతకు ఈసారి పార్టీలో సముచిత స్థానం దక్కుతుందనే ప్రచారం జరుగుతుండటంతో అందరి కళ్లు కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

Alao Read: సుప్రీం తీర్పును తుంగలో తొక్కుతారా.. పోలవరం అథారిటీపై తెలంగాణ సర్కార్ ఫైర్!

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×