BigTV English

Ration Cards: రేషన్ కార్డ్ ఉన్నా లేకపోయినా సన్నబియ్యం గ్యారెంటీ.. ఎలాగంటే..?

Ration Cards: రేషన్ కార్డ్ ఉన్నా లేకపోయినా సన్నబియ్యం గ్యారెంటీ.. ఎలాగంటే..?

రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యాన్ని దాదాపు చాలామంది అన్నం వండుకోడానికి ఉపయోగించరు. దోశ పిండి కోసమో, ఇతరత్రా అవసరాల కోసమో దాన్ని వినియోగిస్తారు. రేషన్ బియ్యం తీసుకునే చాలామంది బహిరంగ మార్కెట్ లో సన్నబియ్యాన్ని కొనుక్కుంటారు. మరి రేషన్ షాపుల్లో బియ్యం ఇవ్వడం దేనికి. తినడానికి అంతగా పనికిరావు అని తెలిసినా కూడా ప్రభుత్వాలు వాటినే ఉచితంగా ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటాయి, పేదల్ని ఉద్ధరిస్తున్నామంటూ ఫోజులు కొడుతుంటాయి. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం ఇలాంటి ప్రచారం తమకు అక్కర్లేదని చెబుతోంది. నిరుపేదలు కూడా సన్నబియ్యం తినాలనే తలంపుతో రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టింది.


సన్నబియ్యం ఎవరికి..?
గతంలో రేషన్ కార్డు అనేది ఒక గుర్తింపు కార్డులా ఉండేది. పావర్టీ లైన్ దిగువన ఉండేవారికి తెల్ల కార్డులు, ఆదాయం ఎక్కువగా ఉండే వారికి గోధుమ రంగు కార్డులు ఇచ్చేవారు. ఆ తర్వాత బిలో పావర్టీ లైన్ వారికి మాత్రమే కార్డులు ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డుల గురించి అసలు పట్టించుకోలేదు. దీంతో చాలామంది అర్హులు కనీసం రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్త కార్డులు మంజూరు ప్రక్రియ మొదలు పెట్టింది. దరఖాస్తులు స్వీకరించారు, వాటిని ఫిల్టర్ చేసి కొత్త కార్డుల మంజూరు ప్రక్రియ మొదలు పెట్టారు. బీపీఎల్ కుటుంబాలకు మూడు రంగుల కార్డ్ లు మంజూరు చేయబోతున్నారు, పావర్టీ లైన్ పైన అంటే అబౌవ్ పావర్టీ లైన్(ఏపీఎల్)కుటుంబాలకు గ్రీన్ కలర్ కార్డ్ లు ఇస్తారు. అయితే ఈలోగా అంటే ఏప్రిల్-1 నుంచి రేషన్ కార్డులు ఉన్నవారికి సన్నబియ్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉగాది సందర్భంగా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తోంది. అయితే ఇక్కడ రేషన్ కార్డులు లేకపోయినా కూడా సన్నబియ్యం పొందే అవకాశాన్న ప్రజలకు కల్పించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

రేషన్ కార్డ్ లేకపోయినా..?
ఇటీవల కొత్త రేషన్ కార్డులకోసం ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుని లిస్ట్ రెడీ చేసింది. ఆ లిస్ట్ లో ఉన్న వారికి త్వరలో ఫిజికల్ రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంది. ఈలోగా కొత్త పథకం తెచ్చారు కాబట్టి, అర్హులెవరూ నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు సడలించింది. అంటే ప్రస్తుతం రేషన్ కార్డ్ ఉన్నా లేకపోయినా, కొత్త కార్డు లిస్ట్ లో పేరుంటే కచ్చితంగా వారికి సన్నబియ్యం ఇస్తారు. సన్నబియ్యం పొందేందుకు రేషన్ కార్డ్ ప్రామాణికం కాదు అనేది ఇక్కడ ప్రభుత్వ విధానం. కొత్త కార్డుకి అర్హత ఉండి, ఆ లిస్ట్ లో పేరుంటే సన్నబియ్యం తీసుకోడానికి అర్హులేనంటూ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.


ప్రభుత్వ నిర్ణయం వల్ల దాదాపు 80నుంచి 84శాతం జనాభాకు సన్నబియ్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గతంలో ఇచ్చే బియ్యాన్ని చాలామంది బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు. దాని వల్ల ప్రభుత్వానికి వ్యయం తప్ప ప్రజలకు ఉపయోగం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇచ్చే బియ్యాన్ని ప్రజలు నేరుగా వినియోగించుకుంటారు. అందుకే సన్నబియ్యం పంపిణీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అందులోనూ రేషన్ కార్డ్ లేకపోయినా కూడా బియ్యం పంపిణీ చేయాలనే నిర్ణయాన్ని సామాన్యులు స్వాగతిస్తున్నారు. పేదల కష్టాలను పట్టించుకునే ప్రభుత్వం ఇది అని అభినందిస్తున్నారు.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×