Massive Fire Incident: ఖమ్మంలోని బర్హాన్‌పురంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఉగాది పండుగ రోజు పూజ లో దీపారాధన చేసి గుడికి వెళ్ళిన కుటుంబీకులు.. తిరిగి వచ్చేలోపు అగ్నికి ఆహుతైంది. ప్రమాద సమయం ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అపార్ట్‌మెంట్‌వాసులు భయంతో పరుగులు తీశారు. ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఖమ్మంలోని బర్హాన్‌పురం ప్రాతంలోని అపార్ట్ మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొత్తగా నిర్మాణం చేపట్టిన మూడంతస్థుల భవనం రెడ్డి అనే ఓ వ్యక్తి నూతనంగా ప్రారంభించారు. ఇక ఈరోజు ఉగాది పర్వదినం కావడంతో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం.. అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లి.. ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి గుడికి వెళ్లి.. అక్కడ కూడా పూజలు నిర్వహించి, తిరిగి వచ్చేలోపు అపార్ట్ మెంట్ అగ్నికి ఆహుతైంది. అయితే ఆ భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు.
ఇది గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థాలానికి చేరుకుని.. మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉగాది పర్వదినం రోజు భక్తి పారవశ్యంలో ఉండి పూజలు నిర్వహిస్తున్న క్రమంలో.. ఒక్కసారిగా అపార్ట్‌మెంట్ నుంచి పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో.. చుట్టుప్రక్కల ప్రజలు భయంతో పరుగులు తీశారు.
Also Read: మారుతల్లి కర్కశం.. ఒకరిని చంపి.. మరొకరికి వాతలు..!
ఇదిలా ఉంటే.. హనుమకొండలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాపువాడలో ఉపేందర్ ఫర్నిచర్ సముదాయంలో ఐదు ఫర్నిచర్ దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్న సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బంధికి సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థాలికి చేరుకుని.. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఉడ్ డిజైన్ యంత్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. విలువైన కలప కాలిబూడిదయింది. దాదాపు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణం షార్ట్ సర్క్యూట్ అని పోలీసులు తెలిపారు.