BigTV English

Security : ఈటలకు Y+, అర్వింద్ కు Y కేటగిరి.. బీజేపీ నేతలకు భద్రత పెంపు..

Security : ఈటలకు Y+, అర్వింద్ కు Y కేటగిరి.. బీజేపీ నేతలకు భద్రత పెంపు..

BJP News Telangana(Latest political news telangana) : తెలంగాణలో ఇద్దరు బీజేపీ నేతలకు కేంద్రం భద్రతను పెంచింది. హుజురాబాద్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్ కు, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ఇకపై కేంద్ర బలగాలు భద్రత కల్పిస్తాయి. ఈట‌లకు Y +, అర్వింద్‌కు Y కేటగిరి భద్రత కల్పించారు. ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతోపాటు 11 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు సెక్యూరిటీగా ఉంటాయి. అర్వింద్‌కు 8 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు రక్షణగా ఉంటాయి.


ఇప్పటికే ఈటల రాజేందర్‌కు తెలంగాణ ప్రభుత్వం Y + కేటగిరి భద్రత కల్పించింది. ఈటల ప్రాణాలకు ముప్పు ఉందని కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆయన హత్యకు ప్లాన్‌ జరుగుతోందని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఈటలకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం సహా 16 మంది సెక్యూరిటీని కేటాయించారు.

ఇప్పటికే ఐబీ టీమ్, స్టేట్ ఇంటెలిజెన్స్ టీమ్, జాయింట్ రివ్యూ మీటింగ్ లో పాల్గొని.. వ్యక్తిగత వివరాలతోపాటు అర్వింద్ ఆఫీస్, నివాసం దగ్గర్లోని పరిసర ప్రాంతాల ఫొటోలను సేకరించారు. అర్వింద్ వెంట పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ సహా, స్పెషల్ గార్డులు నియమిస్తారు. ఆయన నివాసం దగ్గర ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది, ఒక గార్డ్ కమాండర్ ఉంటారు.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×