BigTV English

Chalapathirao : టాలీవుడ్ లో మరో విషాదం.. నటుడు చలపతిరావు కన్నుమూత..

Chalapathirao : టాలీవుడ్ లో మరో విషాదం.. నటుడు చలపతిరావు కన్నుమూత..

Chalapathirao : టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు చలపతిరావు (78) కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో ప్రాణాలు కోల్పోయారు. 1944 మే 8న కృష్ణా జిల్లా బల్లిపర్రులో చలపతిరావు జన్మించారు. 600కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు.


చలపతిరావు గుడఛారి 116 సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. సాక్షి , బుద్ధిమంతుడు, కథానాయకుడు, సంపూర్ణ రామాయణం సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని నటుడిగా నిలబడ్డారు. ఆ తర్వాత విలన్ గా, కామెడీ విలన్ గా తన ప్రత్యేక శైలితో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు.


చలపతిరావుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆయన కుమారుడు రవిబాబు దర్శకుడిగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రెండు రోజుల క్రితమే సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ మృతిచెందారు. ఇప్పుడు చలపతిరావు ఆకస్మిక మరణంతో తెలుగు చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.

సీనియర్‌ ఎన్టీఆర్‌తో చలపతిరావుకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయనతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ లాంటి అగ్రకథానాయకుల చిత్రాల్లో ఆయన సహాయనటుడిగా, ప్రతినాయకుడిగా మెప్పించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి ఈ తరం కథానాయకులు చిత్రాల్లో నటించారు. ఇలా మూడు తరాల నటులతోనూ ఆయన నటించారు.

యమగోల’, ‘యుగపురుషుడు’, ‘డ్రైవర్‌ రాముడు’, ‘అక్బర్‌ సలీమ్‌ అనార్కలి’, ‘భలే కృష్ణుడు’, ‘సరదా రాముడు’, ‘జస్టిస్‌ చౌదరి’, ‘బొబ్బిలి పులి’, ‘చట్టంతో పోరాటం’, ‘దొంగ రాముడు’, ‘అల్లరి అల్లుడు’, ‘అల్లరి’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘నువ్వే కావాలి’, ‘సింహాద్రి’, ‘బన్నీ’, ‘బొమ్మరిల్లు’, ‘అరుంధతి’, ‘సింహా’, ‘దమ్ము’, ‘లెజెండ్‌’ ఇలా ఎన్నో చిత్రాల్లో చలపతిరావు కీలకపాత్రలు పోషించారు.

నటుడిగానే కాకుండా చలపతిరావు పలు చిత్రాలను నిర్మించారు. కలియుగ కృష్ణుడు’, ’కడప రెడ్డమ్మ’, ‘జగన్నాటకం’, ‘పెళ్లంటే నూరేళ్ల పంట సినిమాలను చలపతిరావు నిర్మించారు. గతేడాది విడుదలైన ‘బంగార్రాజు’ సినిమా తర్వాత చలపతిరావు వెండితెరపై కనిపించలేదు.

బుధవారం అంత్యక్రియలు
కుమార్తె అమెరికా నుంచి వచ్చిన తర్వాత చలపతిరావు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని రవిబాబు ఇంట్లోనే ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానంలోని ఫ్రీజర్‌లో ఉంచనున్నారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×