BigTV English

UPI-Credit Card Link: యూపీఐతో క్రెడిట్ కార్డు లింక్.. ఈ విషయాలు మీకు తెలుసా ?

UPI-Credit Card Link: యూపీఐతో క్రెడిట్ కార్డు లింక్.. ఈ విషయాలు మీకు తెలుసా ?

UPI-Credit Card Link: డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉన్నవారంతా దాదాపుగా డిజిటల్ చెల్లింపులపైనే ఆధారపడ్డారు. డెబిట్ కార్డు నుంచి మనీ విత్ డ్రా చేయడం దాదాపు తగ్గిపోయింది. డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించడంలో భాగంగా.. ఆర్బీఐ యూపీఐ కి క్రెడిట్ కార్డులను కూడా అనుసంధానించే సదుపాయాన్ని తీసుకొచ్చింది. రూపే క్రెడిట్ కార్డులు వాడుతున్నవారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ.. దీనివల్ల ప్రయోజనాలతో పాటు ప్రతి కూలతలు కూడా ఉన్నాయి.


లాభాలు..

  • గతంలో బ్యాంకు ఖాతాలో డబ్బులుంటేనే యూపీఐ చెల్లింపులు చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డును యూపీఐకు లింక్ చేసి బ్యాంక్ నిర్ణయించిన క్రెడిట్ లిమిట్ వరకూ చెల్లింపులు చేయవచ్చు.
  • క్రెడిట్ కార్డ్ ద్వారా జరిపే యూపీఐ చెల్లింపులపై రివార్డు పాయింట్లు పొందవచ్చు.
  • యూపీఐతో క్రెడిట్ కార్డు లింక్ చేయడం వల్ల క్రెడిట్ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేయడం మరింత సులభమవుతుంది.
  • పాయింట్ ఆఫ్ సేల్ కార్డు స్వైప్ మెషీన్లు లేని చిన్న దుకాణాల్లోనూ యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డులను వాడుకోవచ్చు.
  • చిన్న చిన్న చెల్లింపులు కూడా బ్యాంక్ స్టేట్ మెంట్లో వస్తాయి. క్రెడిట్ కార్డు ద్వారా చేసే పేమెంట్లు స్టేట్ మెంట్ లో క్లియర్ గా ఉంటాయి. ఇవి కేవలం కార్డు స్టేట్ మెంట్ లో మాత్రమే నమోదవుతాయి.

ప్రతికూలతలు


  • రూపే క్రెడిట్ కార్డు యూజర్లు మాత్రమే యూపీఐ లింక్ సౌకర్యాన్ని వాడుకోగలరు. మాస్టర్, వీసా వంటి నెట్ వర్క్ లపై పనిచేసే క్రెడిట్ కార్డులకు ఈ సదుపాయం లేదు.
  • యూపీఐతో జతచేసిన క్రెడిట్ కార్డు ద్వారా జరిపే ప్రతి చెల్లింపులపై వ్యాపారస్తులు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి క్రెడిట్ యూపీఐ చెల్లింపులను వారు నిరాకరించే అవకాశం ఉంది.
  • వ్యక్తిగత యూపీఐ ఐడీని ఉపయోగించే చిన్న వ్యాపారాలకు క్రెడిట్ కార్డులతో యూపీఐ లావాదేవీల చెల్లింపులు చేయడం వీలుకాదు.
  • క్రెడిట్ కార్డు- యూపీఐ లింక్ వల్ల అప్పుల ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఎక్కువ. సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డులో ఉన్నాయని ఎక్కువగా వాడే అవకాశం ఉంది.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×