BigTV English

Revanth Vs Sabitha: సభలో అక్కా తమ్ముడి పంచాయతీ.. దద్దరిల్లుతున్న అసెంబ్లీ

Revanth Vs Sabitha: సభలో అక్కా తమ్ముడి పంచాయతీ.. దద్దరిల్లుతున్న అసెంబ్లీ

Revanth Vs Sabitha in Assembly: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రతిపక్ష, అధికార సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. తగ్గేదేలే అన్న చందంగా నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పిచ్చుకుంటున్నారు. బీఆర్ఎస్‌పై మంత్రి సీతక్క ఘాటు విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పత్రాన్ని కూడా కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన సబితా ఇంద్రారెడ్డితోనే ఇప్పించారు. ఆరోజు మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్నారు. మరి వాళ్లను కూడా రాజీనామా చేయించి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారా?’ అంటూ సీతక్క ప్రశ్నల వర్షం కురిపించారు.


వెంటనే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థంకావడంలేదు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి జాయిన్ అయ్యారు. ఆరోజు రేవంత్ రెడ్డిని నేను ఒక అక్కగా కాంగ్రెస్ పార్టీలోకి సంతోషంగా ఆహ్వానించాను. నువ్వు ఖచ్చితంగా సీఎం అవుతావంటూ కూడా రేవంత్ రెడ్డికి చెప్పా. మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డిని ఆశీర్వదించాను. ఆ విధంగా చూసిన నాపై రేవంత్ రెడ్డి ఎందుకు ఇంతలా కక్ష చూపిస్తున్నారు..?’ అంటూ ఆమె అసెంబ్లీలో పేర్కొన్నారు.

Also Read: రేవంత్ రెడ్డి నాకు మిత్రుడే.. పదేళ్ల కిందటి నుంచే చెడింది: అసెంబ్లీలో కేటీఆర్


ఆ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘ఆరోజు సబితక్క నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన మాట వాస్తవమే. వ్యక్తిగతంగా జరిగిన సంభాషణ గురించి సభలో ఆమె ప్రస్తావించారు. సభలో ఆమె ప్రస్తావించారు కాబట్టి అడుగుతున్నా.. అప్పుడు జరిగిన పరిణామాలను కూడా సభలో సబితక్క వివరించాలి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నన్ను కోరింది. మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తే తాను కూడా అండగా ఉంటానంటూ సబితక్క కూడా నాకు సలహా ఇచ్చారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నన్ను మల్కాజిగిరి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే సబితక్క బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేవలం అధికారంలో కోసం కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి తీసుకున్నారు. తమ్ముడిగా నాకు మోసం చేశారు కాబట్టే ఆమెను నమ్మబోకండి అంటూ అప్పుడు కేటీఆర్ కు చెప్పాను. అంతేకాదు.. ఆరోజు మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తే నిన్ను గెలిపించే బాధ్యత నాదే అంటూ సబితక్క నాకు భారీ భరోసా ఇచ్చారు. నేను చెప్పింది నిజమో కాదో అనేది సబితక్కనే చెప్పాలి’ అంటూ రేవంత్ రెడ్డి అన్నారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×