BigTV English

Delhi Crime : బెయిల్ పై బయటికొచ్చి.. నడిరోడ్డుపై యువతి దారుణహత్య..

Delhi Crime : బెయిల్ పై బయటికొచ్చి.. నడిరోడ్డుపై యువతి దారుణహత్య..

Delhi Crime : నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగానే ఓ యువతి అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఉత్తరప్రదేశ్ లోని కౌశాంబి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోగా.. హత్య చూసిన స్థానికులు వణికిపోయారు. యువతి హత్యకేసుకు సంబంధించి.. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.


పవన్ నిషద్ అనే యువకుడు మూడేళ్ల క్రితం బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో పవన్ అరెస్టై జైలుకెళ్లాడు. ఈ కేసును వెనక్కి తీసుకోవాలని అతని సోదరులు అప్పటి నుంచి వేధిస్తూనే ఉన్నారు. కానీ యువతి కుటుంబం వారి బెదిరింపులకు లొంగలేదు. పవన్ సోదరుడు అశోక్ నిషద్ మరో కేసులో జైల్లో ఉండగా.. ఇటీవలే ఇద్దరూ బయటికొచ్చారు. పవన్ పై ఉన్న అత్యాచార కేసును వెనక్కి తీసుకునే విషయంలో యువతి కుటుంబంతో మరోసారి ఘర్షణ జరిగింది.

కేసు వెనక్కి తీసుకోబమని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో పశువులను కాసుకుని.. ఇంటికి తిరిగి వస్తున్న 19 ఏళ్ల యువతిని అడ్డుకుని.. నడిరోడ్డుపై వెంటాడి మరీ గొడ్డలితో నరికి చంపారు. ఆ సమయంలో అక్కడున్నవారంతా భయంతో వణికిపోయారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పవన్, అశోక్ లు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు కౌశాంబి జిల్లా ఎస్పీ తెలిపారు.


Related News

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Kukatpally News: ఎంత పని చేశావ్ దేవుడా..? షటిల్ ఆడుతుండగా కరెంట్ షాక్.. క్షణాల్లో బాలుడు మృతి

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బోలెరో ఢీకొనడంతో స్పాట్‌లో ముగ్గురు మృతి

Nagpur Tragedy: దారుణం.. భార్య శవాన్ని బైకుకు కట్టుకుని వెళ్లిన భర్త.. ఎందుకంటే?

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Big Stories

×