BigTV English

$300 Million SuperYacht : రూ.2500 కోట్ల లగ్జరీ పడవ.. యూరప్ నుంచి అమెరికా ప్రయాణం.. మధ్యమార్గంలో దాడులు

$300 Million SuperYacht : సూపర్ యాచ్ట్ కావోస్ ఒక లగ్జరీ పడవ. దీని విలువ 300 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.2500 కోట్లు). 2008 సంవత్సరంలో ఖగర్ దేశ అప్పటి పాలకుడు షేక్ ఖలీఫా దీనిని ప్రత్యేకంగా తయారు చేయించారు. దీని పొడవు 360 అడుగులు.

$300 Million SuperYacht : రూ.2500 కోట్ల లగ్జరీ పడవ.. యూరప్ నుంచి అమెరికా ప్రయాణం.. మధ్యమార్గంలో దాడులు

$300 Million SuperYacht : సూపర్ యాచ్ట్ కావోస్ ఒక లగ్జరీ పడవ. దీని విలువ 300 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.2500 కోట్లు). 2008 సంవత్సరంలో ఖగర్ దేశ అప్పటి పాలకుడు షేక్ ఖలీఫా దీనిని ప్రత్యేకంగా తయారు చేయించారు. దీని పొడవు 360 అడుగులు. ఈ సూపర్ యాచ్ట్‌లో జిమ్, స్విమ్మింగ్ పూల్, సినియా హాలు, పెద్దలు మీటింగ్ చేయడానికి లగ్జరీ రూములు, కుటుంబంతో సరదాగా గడపడానికి పెద్ద లౌంజ్, డీజె బార్ లాంటివి ఎన్నో సదుపాయాలున్నాయి. ఇందులో 31 అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. 45 మంది ఈ లగ్జరీ పడవలో సేవలందించడానికి ఎల్లప్పుడూ ఉంటారు.


అయితే కొంత కాలం ఆయన దీనిని ఉపయోగించిన తరువాత వాల్ మార్ట్ వారసురాలు నేన్సీ వాల్టన్ లారీకి అమ్మేశారు. నేన్సీ కూడా అపార ధనవంతురాలు. ఆమె నికర ఆస్తి విలువ 8.7 బిలియన్ డాలర్లు(సుమారు 72495 కోట్లు).

అయితే కొన్ని నెలల క్రితం ఆమె యూరప్ దేశాల నుంచి అమెరికా ప్రయాణానికి తన సూపర్ యాచ్ట్ ఉపయోగించారు. దారిలో ఈ లగ్జరీ పడవపై కొంత మంది పర్యావరణ ప్రేమికులు రెండు సార్లు దాడి చేశారు.


యూరప్ నుంచి మెడిటెరనియన్ సముద్రం మీదుగా అమెరికా బయలుదేరిన కావోస్ సూపర్ యాచ్ట్‌పై స్పెయిన్‌ దేశంలో పర్యావరణ ప్రేమికులు జూన్, సెప్టెంబర్ నెలల్లో దాడి చేశారు. ఈ దాడుల్లో పడవపై ఎర్ర, నలుపు రంగులు చల్లి నిరసన తెలిపారు. పడవ ముందు వెనుకభాగం కాస్త దెబ్బతిన్నాయి. ఇలాంటి ఖరీదైన పడవల వల్ల పర్యావరణానికి చేటు జరుగుతోందని వారి వాదన. “ధనవంతులు తమ విలాసాల కోసం ఇలాంటి లగ్జరీ పడవలని ఉపయోగించి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. దాని వల్ల సామాన్యులకు సమస్యల వస్తున్నాయి,” అని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.

స్పెయిన సివిల్ గార్డ్ పోలీసులు.. కావోస్ సూపర్ యాచ్ట్‌పై దాడి చేసినందుకు పర్యావరణ ప్రేమికులని అరెస్టు చేశారు. ఆ తరువాత కావోస్ పడవ ఫ్రాన్స్ దేశంలోని లా సియోటాట్ అనే నగరానికి చేరి అక్కడ రిపేర్లు పూర్తిచేసుకొని 5000 మైళ్ల ప్రయాణం చేసి అమెరికా బహామాస్ చేరుకుంది.

Related News

California Murder: అమెరికాలో లైంగిక నేరస్థుడిని హత్య చేసిన భారతీయుడు.. వెబ్ సైట్ లో వెతికి, మారువేషంలో గాలించి మరీ

Netflix: H1-B వీసా ఫీజు పెంపుని సమర్థించిన నెట్ ఫ్లిక్స్ అధినేత..

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Big Stories

×