E-Paper
Advertisement

NEET PG 2024: ‘వెబ్ సైట్ క్రాష్, లాగిన్ ప్రాబ్లమ్.. నాలుగు సెంటర్ల ఆపషన్లు’.. మండిపడుతున్న విద్యార్థులు

NEET PG 2024: ‘వెబ్ సైట్ క్రాష్, లాగిన్ ప్రాబ్లమ్.. నాలుగు సెంటర్ల ఆపషన్లు’.. మండిపడుతున్న విద్యార్థులు
Advertisement

NEET PG 2024: నీట్ పీజీ 2024 ఎంట్రెన్స్ ఎగ్జామ్ సెంటర్ల కేటాయింపుల విధానం పట్ల పరీక్ష రాసే అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జూలై 29న పరీక్ష నిర్వహించే బోర్డు ఈ లిస్టుని ఆన్ లైన్ ద్వారా విడుదల చేసింది. అయితే పరీక్ష సెంటర్ల ఎంపిక విధానం స్పష్టంగా లేదని. అసలు మొదటిరోజు వెబ్ సైట్ సరిగా పని చేయడం లేదని.. ఒకవేళ పనిచేస్తున్నా.. లాగిన్ కావడం లేదని చాలా మంది విద్యార్థులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

నీట్ పీజీ 2024 ఎంట్రెన్స్ ఎగ్జామ్ సెంటర్ల లిస్టుని సిటీల వారీగా.. పరీక్ష నిర్వహించే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) జూలై 19న విడుదల చేసింది. పరీక్ష రాయదలుచుకున్న అభ్యర్థులు నాలుగు పరీక్ష సిటీల ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. వీటిలో అభ్యర్థి ఏ నగరంలో పరీక్ష రాయాలో జూలై 29న వారికి ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు. ఆ తరువాత సిటీలోని ఏ సెంటర్ వారికి కేటాయించారో తెలుపుతూ హాల్ టికెట్‌ని ఆగస్టు 8న ఈ మెయిల్ పంపిస్తారు. నీట్ పీజీ 2024 పరీక్ష ఆగస్టు 11న దేశ వ్యాప్తంగా జరుగనుంది.

Advertisement

Also Read: Budget 2024| విద్యారంగానికి కేంద్ర బడ్డెట్ లో ప్రాధాన్యం ఎంత?

అయితే ఇక్కడ ఏ సిటీలో ఏ సెంటర్ అనేది విద్యార్థులకు చివరి వరకూ తెలియదు. పరీక్ష జరిగే రోజుకు మూడు రోజుల ముందు మాత్రమే తెలియజేస్తారు. పైగా అభ్యర్థి ఎంచుకున్న నాలుగు నగరాల్లో ఏ నగరంలో నైనా పరీక్ష సెంటర్ కేటాయించవచ్చు. ఒకవేళ ఈ నాలుగు నగరాల్లో వీలుకాకపోతే.. దేశంలోని ఏ నగరంలో నైనా రాండమ్ పద్ధతిలో అభ్యర్థికి ఏ పరీక్ష సెంటర్ అయినా కేటాయించబడుతుంది.

Advertisement

అంటే తెలంగాణ అభ్యర్థికి ఆంధ్రాలో, ఉత్తర్ ప్రదేశ అభ్యర్థికి దూరంగా ఏ కర్ణాటక, తమిళనాడు నగరంలోనో పరీక్ష సెంటర్ కేటాయిస్తే.. వారు అంత దూరం సమయానికి చేరుకోగలరా?.. పైగా రాండమ్ పద్ధతిలో పరీక్ష సెంటర్ కేటాయిస్తే.. మరి నాలుగు ఆప్షన్స్ అని చెప్పడం ఎందుకని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

ఇదే కాకుండా పరీక్ష సెంటర్ల నగరాల లిస్టుని విడుదల చేసిన రోజే అన్ని చోట్ల లాగిన్ ప్రాబ్లమ్ ఎదురైంది. పైగా అదే రోజు మైక్రోసాఫ్ట్ క్రౌడ్ స్ట్రైక్ సమస్య వచ్చింది. దీంతో ఎక్కడా సిస్టమ్ లు పనిచేయలేదు. వెబ్ సైట్ ఓపెన్ చేయగానే.. ఎర్రర్ మెసేజ్ చూపిస్తోంది.

“Due to ongoing Microsoft outage globally, the application of TCS for NEET PG 2024 test city selection is also facing issues. The application will go live as and when the issues are resolved by the end of day.” అని చూపిస్తోంది. విద్యార్థులు ఈ ఎర్రర్ స్క్రీన్ షాట్లను తీసి సోషల్ మీడియాలో పెట్టి అసహనం వ్యక్తం చేశారు.

ఒక సోషల్ మీడియా యూజర్ తన పోస్టులో, “వీళ్లసలు ఒక సింపుల్ లాగిన్ ప్రక్రియని సరిగా నిర్వహించేలేకపోతున్నారు.. మరి అలాంటప్పుడు ఒకే రోజు రెండు షిఫ్టులలో పరీక్ష నిర్వహించగలరా” అని సందేహం వ్యక్తం చేశాడు.

ఎగ్జామ్ సెంటర్ల నగరాల ఎంపికకు జూలై 21 వరకు మాత్రమే గడువు ఉంది. అంటే మొత్తం మూడు రోజుల గడువు. ఇందులో మొదటిరోజు సిస్టమ్ ఎర్రర్, లాగిన్ ఎర్రర్ సమస్యలతో వృధా అయిపోయింది.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×