BigTV English

Gold Price: బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?.. ఇంకా ఎంత పెరుగుతుంది?

Gold Price: బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?.. ఇంకా ఎంత పెరుగుతుంది?
gold-price

Gold Price: బంగారం ధర పెరిగింది. ఇది రొటీన్‌గా వినే స్టేట్‌మెంటే. కానీ, ఈసారి పెరుగుదల బెంచ్‌మార్క్‌ను దాటేసింది. 10 గ్రాముల 24k గోల్డ్ రేట్.. ఒకేరోజు 1400 పెరిగి రూ.61,100కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 2005 డాలర్లు పలికింది. గోల్డ్‌తో పాటే సిల్వర్ రేట్ కూడా ఎగిసింది. కిలో వెండి రూ.69,340కి చేరింది.


ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో.. డిమాండ్ పెరిగి బంగారం ధర పెరిగిందని అనుకోవద్దు. అంతర్జాతీయంగా నెలకొన్న సందిగ్థతే బంగారం ధర భారంగా మారడానికి కారణం. రష్యా-ఉక్రెయిన్ వార్ సమయంలో ఇలానే భారీగా పెరిగింది. మళ్లీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ బ్యాంకులు పతనం అవుతుండటంతో.. మళ్లీ బంగారం రేటుకు రెక్కలు వచ్చాయి. జస్ట్ పది రోజుల్లోనే.. తులం బంగారం ధర 56వేల నుంచి 60వేలకు ఎగబాకింది.

రోజుల వ్యవధిలోనే అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (SVB), సిగ్నేచర్‌ బ్యాంక్‌ మూతపడటం.. స్విట్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్‌ సూయిజ్‌ బ్యాంక్ పతనావస్థకు చేరడంతో మదుపర్లలో భయాలు పెరిగాయి. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో.. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై ఇన్వెస్టర్లు పెట్టుబడులను షిఫ్ట్ చేస్తుండటంతో గోల్డ్ రేట్ పెరుగుతూ పోతోంది.


ఇంకా ఎంత పెరుగుతుంది? ఎక్కడి వరకు పెరుగుతూ ఉంటుంది.. అనే దానిపై స్పష్టత లేదు. అయితే, మంగళవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ భేటీ ఉంది. కొంతకాలంగా వడ్డీ రేట్లు పెంచుతూ వస్తున్న ఫెడ్.. వరుస బ్యాంకింగ్‌ పతనాల నేపథ్యంలో ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఆసక్తి నెలకొంది. వడ్డీ రేట్ల పెంపుపై కాస్త వెనక్కి తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఫెడ్‌ నిర్ణయం వచ్చాక.. బంగారం ధర పెరుగుదలపై కాస్త క్లారిటీ రానుంది.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×