E-Paper
Advertisement

Sharad Pawar Slams EC: ‘పార్టీ గుర్తు కాదు.. సిద్ధాంతాలు ముఖ్యం’.. ఎన్నికల కమిషన్‌పై మండిపడిన షరద్ పవార్

Sharad Pawar Slams EC | మహారాష్ట్ర రాజకీయాలలో కురు వృద్ధుడు షరద్ పవార్ తమ పార్టీ పేరు, గుర్తుని ఎన్నికల కమిషన్ లాగేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించి.. దాని నిర్మాణం చేసిన వ్యక్తిని.. ఆ పార్టీకి ఎన్నికల కమిషన్ దూరం చేసిందని.. ఇలా జరగడం ఇదే తొలిసారి అని చెప్పారు.

Sharad Pawar Slams EC: ‘పార్టీ గుర్తు కాదు.. సిద్ధాంతాలు ముఖ్యం’.. ఎన్నికల కమిషన్‌పై మండిపడిన షరద్ పవార్
Advertisement

Sharad Pawar Slams EC: మహారాష్ట్ర రాజకీయాలలో కురు వృద్ధుడు షరద్ పవార్ తమ పార్టీ పేరు, గుర్తుని ఎన్నికల కమిషన్ లాగేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించి.. దాని నిర్మాణం చేసిన వ్యక్తిని.. ఆ పార్టీకి ఎన్నికల కమిషన్ దూరం చేసిందని.. ఇలా జరగడం ఇదే తొలిసారి అని చెప్పారు.

షరద్ పవార్ 1999లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP)ని స్థాపించారు. ఇటీవల ఎన్నికల కమిషన్ ఆయన పార్టీ పేరు, ఎన్నికల గుర్తుని ఆయన సోదరుడి కుమారుడు అజిత్ పవార్‌ వర్గానికి కేటాయించింది. దీనిపై షరద్ పవార్ ఆశర్చర్యం వ్యక్తం చేస్తూ.. సుప్రీం కోర్టుని ఆశ్రయిస్తామని తెలిపారు.

Advertisement

ఎన్నికల కమిషన్ చేసిందని ముమ్మాటికి తప్పు అని పవర్ చెబుతూ.. పార్టీ సిద్ధాంతాలు ముఖ్యమని.. ఎన్నికల గుర్తు కొంత వరకు మాత్రమే ఉపయోగపడుతుందని అన్నారు.

మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చి.. ఏక్ నాథ్ షిండే వర్గమైన శివసేన పార్టీ.. బిజేపీ సహాయంతో అధికారంలోకి వచ్చింది. అయితే షిండే ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని భావించిన అజిత్ పవార్‌కు షరద్ పవార్ వ్యతిరేకించారు. ఆ తరువాత అజిత్ పవార్ వెంట పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండడంతో ఆయన NCPకి తానే అధ్యక్షుడిగా ప్రకటించకున్నారు. దీంతో బాబాయ్, అబ్బాయ్ ల మధ్య పార్టీ ఆధిపత్య పోరు మొదలైంది.

Advertisement

మెజారిటీ సభ్యులు అజిత్ పవార్‌కు మద్దతు తెలపడంతో ఎన్నికల కమిషన్ ఆయన పక్షంలో నిర్ణయం తీసుకుంది.

Sharad Pawar, NCP, Ajit Pawar, Election Commission, party symbol, Supreme Court,

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×