BigTV English

Update from Tillu Square: ఆ హీరోయిన్‌తో ‘టిల్లు’ గాని ఐటెమ్ సాంగ్‌.. ఇరగదీసేస్తాడంట..!

Update from Tillu Square: ఆ హీరోయిన్‌తో ‘టిల్లు’ గాని ఐటెమ్ సాంగ్‌.. ఇరగదీసేస్తాడంట..!
Tillu Square movie updates

Update on Siddu Jonnalagadda’s Movie ‘Tillu Square‘:


టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ – నేహా శెట్టి జంటగా నటించిన ‘డీజే టిల్లు’ మూవీ మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇందులో హీరో సిద్దూ డైలాగ్స్, వాయిస్, సాంగ్స్ సినిమాకే హైలెట్ అయ్యాయి. ఇక ఈ మూవీ మంచి హిట్ సాధించడంతో ఇప్పుడు సీక్వెల్‌ తెరకెక్కుతోంది. ‘టిల్లు స్కేర్’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీలో సిద్దూ సరసన ఈ సారి నేహా శెట్టి కాకుండా.. మరోనటి అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఓ రేంజ్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇందులోని మాస్ బీట్ సాంగ్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయనే చెప్పాలి. అంతేకాకుండా ఫస్ట్ పార్ట్‌లో మంచి కామెడీ ఉండటంతో మంచి హిట్ అవడంతో ఈ సీక్వెల్ మూవీ కూడా దానికి రెట్టింపు కామెడీ ఉంటుందని అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.


అందువల్లనే ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇటీవల రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాల వల్ల రిలీజ్ కాలేకపోయింది. అనుకున్న రిలీజ్ డేట్‌ను మరో తేదీకి పోస్ట్ పోన్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

READ MORE: Tillu Square second single : టిల్లు స్క్వేర్ సెకండ్ సింగిల్.. రాధిక రింగుల జుట్టుకు టిల్లు ఫిదా..

ఈ మూవీలో తెలుగు అమ్మాయి నటి అంజలి ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తన మాస్ స్టెప్పులతో కుర్రకారును ఉర్రూతలుగించిన ఈ భామ.. ఇప్పుడు సిద్దూ లాంటి నాటి బాయ్‌తో చిందులేస్తే ఆ కిక్కే వేరు అని అభిమానులు అంటున్నారు.

కాగా గతంలో నితిన్ హీరోగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీలోనూ ఐటమ్ సాంగ్ చేసి తన డ్యాన్స్‌తో దుమ్ము దులిపేసింది. అంతకముందు కూడా అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ మూవీలో బ్లాక్ బస్టర్ సాంగ్‌కు సూపర్ డూపర్ స్టెప్పులతో మాసివ్ క్రేజీ అందుకుంది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ మూవీలో చిందేయనుంది అని తెలియడంతో ప్రేక్షకాభిమానుల్లో మరింత జోష్ పెరిగింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×