Big Stories

Elon Musk NeuraLink: మనిషి మెదడులో చిప్.. ఆలోచనలతోనే యంత్రాలపై నియంత్రణ!

Elon Musk NeuraLink: Justice League సినిమా చూశారా..? అందులో మనిషి మెదడులో చిప్ పెడతారు. ఆ చిప్ సాయంతో ఒక సామాన్య మనిషి అసాధారణ పనులు చేయగలుగుతాడు. ఇప్పుడు నిజజీవితంలో కూడా ఇలాంటి అద్భుతమే జరిగింది. ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్‌కు చెందిన (NEURA LINK) న్యూరా లింక్ అనే టెక్నాలజీ కంపెనీ ఈ అద్భుతాన్ని చేసి చూపించింది.

- Advertisement -

ఈ న్యూరా లింక్ ఉద్దేశం ఏమిటి? బ్రెయిన్‌లో చిప్ పెట్టి ఈ న్యూరా లింక్ ఏం సాధించాలనుకుంటోంది? .. ఈ ప్రయోగం విజయం సాధిస్తే.. ప్రపంచంపై దీని ప్రభావం ఏంటి?

- Advertisement -

Elon Musk.. ఎప్పుడూ వార్తల్లో నిలిచే బడా Businessman. Space X, Tesla, STAR LINK లాంటి దిగ్గజ కంపెనీలకు యజమాని. కొంతకాలం క్రితం మస్క్ సోషల్ మీడియా కంపెనీ Twitterని కూడా కొనుగోలు చేశారు. Twitter పిచుక పేరుని కూడా ‘X’అని మార్చారు.

ఎప్పుడూ ఏదో ఒక Tweet చేస్తూ.. సంచలనాలు, వివాదాలు చేసే మస్క్.. తన దూరదృష్టితో ఎన్నో అద్భుతాలు చేసి చూపించారు. అందుకే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయన future technology గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ.. అందులో పెట్టుబడులు పెడుతుంటారు. ఈ క్రమంలోనే ఆయన చాట్ జిపిటి టెక్నాలజీ లాంటి Artificial Intelligence కంపెనీ స్థాపన సమయంలో పెట్టుబడులు పెట్టారు.

అలాగే మరో Startup కంపెనీ NEURA LINKని కూడా ఇలాన్ మస్క్ 2016లో స్థాపించారు. ఈ కంపెనీలో ప్రస్తుతం 400 మంది ఉద్యోగులున్నారు. దీని Total funding 363 million డాలర్లు.

తాజాగా ఈ NEURA LINK కంపెనీ అద్భుతం చేసి చూపించింది. అమెరికన్ మీడియా కథనాల ప్రకారం.. ఈ NEURA LINK చేసిన ఒక ప్రయోగం అన్ని విధాలుగా successful అయితే Medical Science ప్రపంచమే మారిపోతుంది.

NEURA LINK అంతగా ఏం సాధించిందని చెప్పే ముందు.. అసలు NEURA LINK కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకుందాం.

2016లో ఏడుగురు scientistsల teamతో NEURA LINK startup company స్థాపన జరిగింది. Brain Computer Interface అంటే BCI అనే టెక్నాలజీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ ప్రారంభమైంది. Brain Computer Interfaceని Brain Machine Interface అని కూడా అంటారు.

Brain Computer Interface ఒక చిప్ లాంటి device. దీనిని మనిషి మెదడులో అమర్చి.. మెదడులోని Electric Activityని బయట ప్రపంచంలోని computer లేదా Robotic machineతో connect చేస్తారు.

ఈ టెక్నాలజీతో కాళ్లు, చేతులు లేని వికలాంగులు లేదా పక్షవాతంతో బాధపడేవారు తమ daily lifeలోని పనులు easyగా చేసుకోగలరు. అందుకే దీనిపేరు NEURA LINK అని పెట్టారు.

ఈ NEURA LINK story నిజానికి 1970లోనే ప్రారంభమైంది. 1970లో Jacques J Vidal అనే ఒక scientist University of California- National Science Foundation అనుమతి తీసుకొని NEURA LINK ప్రయోగాలు మొదలుపెట్టారు. 1973లో Jacques Vidal రాసిన ఒక Article science Journalలో print అయింది. ఈ Article ద్వారానే NEURA LINK ప్రయోగాల గురించి ప్రపంచానికి తొలిసారి తెలిసింది.

ఈ ప్రయోగాల గురించి చెప్పాలంటే.. NEURA LINK టెక్నాలజీతో మనిషి మెదడుని అధ్యయనం చేయడం. అందుకే Elon Musk ఈ Experiments గురించి మాట్లాడుతూ.. Understanding the Brain, Interfacing the Brain, Engineering with the Brain, అనే సిద్ధాంతాలపై NEURA LINK పనిచేస్తోందన్నారు.

2023లో పంది, కోతి లాంటి జంతువుల మెదడుపై NEURA LINK ప్రయోగాలు successful కావడంతో అమెరికా ప్రభుత్వం– మే 2023లో మనుషులపై ప్రయోగాలు చేసేందుకు అనుమతించింది. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం ప్రకారం.. పది మంది మనుషుల మెదడులో చిప్ అమర్చడానికి అమెరికా ప్రభుత్వ సంస్థ FDA అనుమతి ఇచ్చింది. ఈ NEURA LINK చిప్‌కి ఇలాన్ మస్క్ Telepathy అని పేరుపెట్టారు.

ఇప్పుడు ఈ చిప్‌లో ఏముంది? చిప్ ఎలా పనిచేస్తోంది అనేది అర్థం చేసుకుందాం.

NEURA LINK చిప్.. ఒక కాయిన్ ఆకారంలో ఉంటుంది. ముందుగా దీనిని పక్షవాతం లాంటి వ్యాధులతో బాధపడేవారి కోసం ఉపయోగిస్తారు. మనిషి తలక ఆపరేషన్ చేసి మెదడులో ఈ చిప్‌ని అమరుస్తారు. ఈ చిప్‌లో వెంట్రుక కంటే 20 రెట్లు సన్నగా ఉన్న తీగలుంటాయి. ఈ తీగలలో 1024 Electrodes ఉంటాయి. ఈ చిప్.. మెదడుని పరిశీలిస్తూ.. Psychological, Nervous పనితీరుని మెరుగుపరుస్తుంది. ఆ తరువాత దీనిలోని డేటాని ఒక కంప్యూటర్‌లో స్టోర్ చేసి study చేస్తారు.

ఈ డేటాని భవిష్యత్తులో జరిగే మరిన్ని ప్రయోగాల కోసం ఉపయోగిస్తారు. శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ చిప్.. మనిషి ఏం ఆలోచిస్తున్నాడో చదవగలుగుతుంది. అంటే ఈ చిప్ Mind reading చేస్తుంది. అలాగే ఈ చిప్‌ని కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ లాంటి deviceలో Connect చేయవచ్చు. ఆ తరువాత ఒక స్మోర్ట్ ఫోన్‌ని తాక కుండానే కేవలం ఆలోచనలతో ఉపయోగించవచ్చు.

ఇలాంటి ప్రయోగాలు జంతువులుపై చేసి విజయం సాధించారు. NEURA LINK దీనికి Proofగా ఒక వీడియోని చూపించింది. అందులో ఒక కోతి Joystick ఉపయోగించి వీడియో గేమ్ ఆడుతోంది. ఆ కోతి మెదడులో చిప్ అమర్చారు. మరోవైపు ఈ ప్రయోగాలు జరుపుతుండగా దాదాపు 1500 జంతువులు చనిపోయాయని సమాచారం. దీంతో కంపెనీపై విచారణ కూడా సాగింది.

ఇప్పుడు కంపెనీకి మనుషులపై ప్రయోగాలు చేసేందుకు అనుమతి లభించడంతో.. NEURA LINK ఈ experiments కోసం వాలంటీర్లకు ఆహ్వానం పలికింది. ఇప్పటికే ఒక మనిషి మెదడులో ఒక చిప్ విజయవంతంగా అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఆ మొదటి మనిషికి Neuro Disorder వ్యాధి ఉండడంతో ముందుగా అతడి మెదడులో చిప్ అమర్చామని ఇలాన్ మస్క్ తెలిపారు. ఆ మనిషి త్వరగా కోలుకుంటున్నాడని.. ఆ మనిషి మెదడులో Neuron Spike ఉన్నట్లు చిప్ ద్వారా తెలిసిందని ట్విట్టర్‌లో ఇలాన్ మస్క్ పోస్ట్ చేశారు.

Neuron Spike అనేది ఒక రకమైన signal. ఈ signal ద్వారా మెదడులోని Neuronల మధ్య communication జరుగుతుంది. ఈ Neuron Spikeను అధ్యయనం చేసి.. పక్షవాతం, Neurological Disorder లాంటి వ్యాధులతో బాధపడే వారిని మెరుగైన చికిత్స అందించవచ్చని కంపెనీ చెబుతోంది.

అయితే ఇలాంటి ప్రయోగాలు చేసే కంపెనీ Neura Link ఒక్కటే కాదు. Neura Linkకు పోటీగా synchron, Precision Neuroscience, Blackrock Neurotech, Bios, Paradromics లాంటి కంపనీలున్నాయి.

Neura Link లాంటి కంపెనీలు విజయం సాధిస్తే.. మానవులు కేవలం తమ ఆలోచనలతోనే machinesని ఉపయోగించగలుగుతారు. మెదడులోని signalsని ఈ చిప్ ఆదేశాలుగా మార్చి యంత్రాలకు పంపుతుంది. అంటే ఈ చిప్ ఒక బ్లూటూత్ connection లాగా పనిచేస్తుంది. ఇది నిజంగా science రంగంలో ఒక విప్లవమనే చెప్పాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News