Mexico Train Accident: మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు డబుల్ డెక్కర్ ప్యాసింజర్ బస్సును ఢీకొన్నది. ఈ ప్రమాదంలో పది మంది స్పాట్ లోనే దుర్మరణం చెందారు. మరో 61 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో మృత దేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మాంసపు ముద్దలు అల్లంతదూరం విసిరివేయబడ్డాయి. ఎక్కడ చూసినా రక్తం మరకలే కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతం అంతా భీతావహ పరిస్థితి కనిపించింది. ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే స్పాట్ కు చేరుకున్న సహాయక బృందాలు మృతదేహాలను తొలగించడంతో పాటు క్షతగాత్రులను హాస్పిటలకు తరలించారు. ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రెండు ముక్కలైన బస్సు!
ఈ ప్రమాదంలో బస్సు రెండు ముక్కలు అయ్యింది. పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు, ముగ్గురు పురుషులు మరణించినట్లు మెక్సికో అటార్నీ జనరల్ కార్యాలయం వెల్లడించింది. ఈ ప్రమాదం ఉదయం 6.30 గంటలకు జరిగినట్లు ప్రకటించింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపింది. మరికొందరికి ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపింది. రైలు వస్తున్న సమయంలోనే బస్సు ట్రాక్ మీదికి రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు రైలు ఆపరేటర్ వెల్లడించాడు. ఈ ప్రమాదం పట్ల మెక్సికన్ రైల్వే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రైల్వే ప్రమాద బాధితుల కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేసింది. డ్రైవర్లు రైల్వే సిగ్నల్స్ ను పాటించాలని, రైల్ రోడ్ క్రాసింగ్స్ దగ్గర జాగ్రత్త వహించాలని సూచించింది. అయితే రైలు ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ట్రాఫిక్ సిగ్నల్ కనిపించలేదా? లేకపోతే ఏదైనా ఇతర కారణాల అని అధికారులు ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా చిన్న పొరపాటు కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ప్రమాదానికి గల కారణాలను అధికారులు కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
🚨🇲🇽 MEXICO BUS-TRAIN COLLISION
🔹A train collided with a double-deck bus in Atlacomulco, northwest of Mexico City, killing at least 8 people and injuring 45 early Monday. Authorities are still working at the crash site in an industrial zone. Cause remains under investigation.… pic.twitter.com/xd5hVtOshr
— Info Room (@InfoR00M) September 8, 2025
Read Also: కదులుతున్న రైలుకు వేలాడేతూ డేంజర్ స్టంట్, పైగా అమ్మాయిని టచ్ చేస్తూ..
మెక్సికోలో గతంలోనూ రైలు ప్రమాదాలు
మెక్సికోలో ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. 2021 మేలో ఒక ఎలివేటెడ్ విభాగంలో రైలు పైకి వెళ్తుండగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. మరో 98 మందికి పైగా గాయపడ్డారు. ప్రధానంగా వెల్డింగ్ డిజైన్ లోపల దెబ్బతినడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అటు 2023లో ఫెడరల్ హైవేలపై రోడ్డు ప్రమాదాల సంఖ్య 12,099గా ఉంది. ఈ ప్రమాదాల కారణంగా సుమారు 100 మిలియన్ డాలర్లకు గా ఆస్తి నష్టం కలగడంతో పాటు 1900 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6,400 మంది గాయపడ్డారు. గత ఫిబ్రవరిలో దక్షిణ మెక్సికోలో కాన్కున్ నుంచి టబాస్కోకు ప్రయాణిస్తున్న బస్సు ట్రైలర్ ట్రక్కును ఢీకొట్టి మంటల్లో చిక్కుకున్న ఘటనలో 40 మందికి పైగా మరణించారు.
Read Also: అఫ్ఘాన్ భూకంప శిథిలాల్లో మహిళలు.. బతికున్నా రక్షించకుండా వదిలేసిన మగాళ్లు!