రైల్వే స్టేషన్లు, కదులుతున్న రైళ్లు, రైలు పట్టాల మీద రీల్స్ చేస్తూ పలువురు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేశారు. రైల్వే పరిధిలో ఎలాంటి రీల్స్ చేసినా, వీడియోలు తీసినా, ఫోటోలు దిగినా చర్యలు తప్పవంటూ రూల్స్ తీసుకొచ్చారు. అయినప్పటికీ కొంత మంది తీరు మారడం లేదు. ఇప్పటికీ ప్రమాదకర స్టంట్లు చేస్తున్నారు. వారి ప్రాణాలతో పాటు, ఇతరుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా ఓ యువకుడు ఇలాంటి స్టంట్ చేశాడు. అంతేకాదు, ఓ యువతితో అసభ్యంగా తాకే ప్రయత్నం చేశాడు.
ప్రస్తుతం సదరు యువకుడి డేంజర్ స్టంట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఆ వ్యక్తి ప్రమాదకర రీతిలో స్టంట్ చేశాడు. క్లిప్ లో సదరు యువకుడు డోర్ దగ్గర హ్యాండిల్ పట్టుకుని ఒక కాలు రైల్లో, మరో కాలు రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారమ్ మీద ఉంచి ముందుకు జారుతూ కనిపిస్తాడు. అదే సమయంలో రైల్వే స్టేషన్ లో వెళ్తున్న మహిళను అసభ్యకర రీతిలో తగిలే ప్రయత్నం చేశాడు. ఒకవేళ అతడి చేయి తగిలితే ఆమెకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అతడి వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ఈ వీడియోలో ఘటన ఎక్కడ జరిగింది? అనే విషయం తెలియకపోయినా ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కానీ, రైళ్లలో యువకులు చేస్తున్న డేంజర్ స్టంట్లకు ఎగ్జాంఫుల్ గా ఉంది. ఇలాంటి ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. నెటిజన్లు ఈ వీడియో పైనా మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం కోసం ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని కామెంట్స్ పెడుతున్నారు. మీరు డేంజర్ లో పడటంతో పాటు ఇతరులను డేంజర్ లో పడేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వీడియోలో ఉన్న యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. డేంజరస్ స్టంట్ చేసిన ఘటనపై కేసు నమోదు చేయడంతో పాటు మహిళ పట్ల అసభ్యంగా వ్యవహరించడంపైనా సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. సదరు యువకుడిని ట్రేస్ చేసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అతడిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇలాంటి ఘటనలకు పాల్పడే వాడిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇతరులు కూడా హద్దుల్లో ఉండే అవకాశం ఉందంటున్నారు ప్రయాణీకులు. త్వరలోనే రైల్వే పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసి ఈ ఘటనకు ఫుల్ స్టాఫ్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: రైల్వే స్టేషన్ లో దారుణం, మహిళను తుపాకీతో బెదిరించి.. గదిలోకి లాక్కెళ్లి…