Indian Railways: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అమృత్ స్టేషన్స్ పథకంలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లో 117 రైల్వే స్టేషన్లను రెన్నోవేషన్ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. వీటిలో తెలంగాణలో 40, ఏపీలో 73 రైల్వే స్టేషన్లలో నిర్మాణ పనులు పూర్తి కాగా, మిగతా స్టేషన్లలో కొనసాగుతున్నట్లు తెలిపింది.
తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి
తెలంగాణలో అమృత్ స్టేషన్స్ స్కీమ్ లో భాగంగా మొత్తం రూ. 1,992 కోట్లతో 40 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో ఆదిలాబాద్, బాసర, బేగంపేట, భద్రాచలం రోడ్, గద్వాల్, హఫీజ్ పేట, హైటెక్ సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్, జడ్చర్ల, జనగాం, కాచిగూడ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట జంక్షన్, ఖమ్మం, లింగంపల్లి, మధిర, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మలక్ పేట, మల్కాజ్ గిరి జంక్షన్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మిర్యాలగూడ, నల్లగొండ, నిజామాబాద్ జంక్షన్, పెద్దపల్లి జంక్షన్, రామగుండం, సికంద్రాబాద్, షాద్ నగర్, జోగులాంబ, తాండూర్, ఉండానగర్, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, యాకత్ పురా, జహీరాబాద్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో సింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రూ. 715 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ కు రూ. 237 కోట్లు కేటాయించారు.
ఏపీలో 73 రైల్వే స్టేషన్ల అభివృద్ధి
ఇక ఏపీలో అమృత్ స్కీమ్ లో భాగంగా 73 రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం రూ. 2,051 కోట్లు కేటాయించింది. వీటిలో ఆందోని, అనకాపల్లి, అనంతపూర్, అనపర్తి, అరకు, బాపట్ల, భీమవరం టౌన్, బొబ్బిలి జంక్షన్, చీపురుపల్లి, చీరాల, చిత్తూరు, కడప, కంబం, ధర్మవరం, డోన్, దొనకొండ, దువ్వాడ, ఎలిమంచిలి, ఏలూరు, గిద్దలూరు, గూటీ, గుడివాడ, గూడూర్, గుండాల, గుంటూరు, హిందూపూర్, ఇచ్చాపురం, కదిరి, కాకినాడ టౌన్ జంక్షన్, కొత్తవలస జంక్షన్, కుప్పం, కర్నూల్ సిటీ, మాచర్ల, మచిలీపట్నం, మదనపల్లె రోడ్, మంగళగిరి, మంత్రాలయం రోడ్, మార్కాపురం రోడ్, నందికొట్కూర్ జంక్షన్, నంద్యాల జంక్షన్, నర్సాపూర్, నర్సరావుపేట, నౌపడ జంక్షన్, నెల్లూరు, నిడదవోలు జంక్షన్, ఒంగోలు, పాకాల జంక్షన్, పలాస, పార్వతీపురం, పిగుడురాళ్ల, పీలేర్, రాజమండ్రి, రాజంపేట, రాయనపాడు, రేణిగుంట, రేపల్లె, సామర్లకోట, సత్తెనపల్లి, సత్యసాయి ప్రశాంతి నిలయం, సింహాచలం, సింగరాయకొండ, శ్రీకాళహస్తి, శ్రీకాకుళం రోడ్, సుళ్లూరుపేట, తాడేపల్లిగూడెం, తాడిపత్రి, తెనాలి, తిరుపలి, తుని, విజయవాడ, వినుకొండ, విశాఖపట్నం, విజయనగరం జంక్షన్ రైల్లే స్టేషన్లను డెవలప్ చేస్తున్నారు. వీటిలో విశాఖపట్నం స్టేషన్ కు రూ. 446 కోట్లు, నెల్లూరు రైల్వే స్టేషన్ కు రూ. 103 కోట్లు, తిరుపతి రైల్వే స్టేషన్ కు రూ. 312 కోట్లు, రాజమండ్రికి రూ. 271.43 కోట్లు కేటాయించింది.
ఏంటీ.. అమృత్ భారత్ స్టేషన్ పథకం?
దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేసేందుకు అమృత్ స్టేషన్స్ పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా 1,275 స్టేషన్లను అప్ గ్రేడ్ చేయడంతో పాటు ఆధునీకరించనున్నట్లు తెలిపింది. ఈ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్లలో యాక్సెసిబిలిటీని మెరుగుపరచడం, వెయిటింగ్ రూమ్స్, టాయిలెట్స్, అవసరమైన లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత వైఫై లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. రైల్వే స్టేషన్లను ఆహ్లాదకర రీతిలో అభివృద్ధి పరుస్తున్నారు. రెండు వైపులా చుట్టుపక్కల నగర ప్రాంతాలతో స్టేషన్లను అనుసంధానించడం, మల్టీమోడల్ కనెక్టివిటీని ప్రోత్సహించడం, దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించడం, బ్యాలస్ట్ లెస్ ట్రాక్ లను ప్రవేశపెట్టడంతో పాటు రూఫ్ ప్లాజాలను ఏర్పాటు చేస్తున్నారు.