E-Paper
Advertisement

అమరావతిలో మరో అద్భుతం.. ఏకంగా రూ.2,245 కోట్లతో దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్!

అమరావతిలో మరో అద్భుతం.. ఏకంగా రూ.2,245 కోట్లతో దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్!
Advertisement

Amaravati Railway Station: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. దేశంలోనే అత్యాధునిక, అతిపెద్ద రైల్వే టెర్మినల్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విమానాశ్రయాన్ని తలపించేలా   సదుపాయాలతో ఈ స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు. సుమారు రూ.2,245 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే సౌత్ ఇండియన్ రవాణా వ్యవస్థలో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది.

24 ప్లాట్‌ ఫారమ్‌లు.. నాలుగు భారీ టెర్మినళ్లు!

అమరావతిలో సుమారు 1,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ రైల్వే ప్రాజెక్టును నిర్మించాలని భావిస్తున్నారు. ఇందులో 24 హైటెక్ ప్లాట్‌ఫారమ్‌లు, నాలుగు ఆధునిక టెర్మినళ్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్‌లు, డిజిటల్ టికెటింగ్, ఆటోమేటెడ్ ఎంట్రీ గేట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. భవిష్యత్తులో పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాబోయే 40 నుంచి 50 ఏళ్ల అవసరాలకు సరిపోయేలా స్టేషన్‌ను రూపొందించనున్నారు. రోజుకు మూడు లక్షల మందికి పైగా ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టబోతున్నారు.

బుల్లెట్ రైళ్లకు కీలక కేంద్రంగా అమరావతి!

Advertisement

ఈ స్టేషన్ ప్రత్యేకతల్లో మరో ముఖ్యమైనది హైస్పీడ్ రైలు కనెక్టివిటీ. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ రైలు మార్గాలతో అమరావతిని అనుసంధానించే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మార్గాలు అందుబాటులోకి వస్తే ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రతిపాదిత ప్రయాణ సమయాల ప్రకారం హైదరాబాద్‌కు సుమారు 70 నిమిషాలు, చెన్నైకి 112 నిమిషాలు, బెంగళూరుకు రెండు గంటల్లో చేరుకోనున్నాయి. కోల్‌కతా, ముంబై లాంటి నగరాలకు కూడా రైల్వే కనెక్టివిటీ కల్పించనున్నారు.

కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల భారీ వంతెన

అమరావతిని రైల్వే నెట్‌ వర్క్‌ తో అనుసంధానించేందుకు ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య 57 కిలోమీటర్ల కొత్త బ్రాడ్‌ గేజ్ రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఇందులో భాగంగా కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల పొడవైన రైల్వే వంతెనను కూడా నిర్మించనున్నారు. స్థానిక రవాణా సౌకర్యాల కోసం మెట్రో కనెక్టివిటీని కూడా ప్రతిపాదించారు.

వరదలను తట్టుకునేలా ఆధునిక సాంకేతికత

Advertisement

ఈ రైల్వే ప్రాజెక్టులో భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రైళ్లు అనవసరంగా వేగం తగ్గించకుండా ప్రయాణించేలా పట్టాల అమరికను రూపొందించనున్నారు. ప్రమాదాలను నివారించేందుకు ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్’ను ఏర్పాటు చేయనున్నారు. కృష్ణా నది సమీపంలో ప్రాజెక్టు ఉండటంతో గత 100 ఏళ్ల వరద సమాచారాన్ని విశ్లేషించి వరద ముప్పును తగ్గించేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. అలాగే స్టేషన్ పైకప్పులు, ప్లాట్‌ఫారమ్‌లు, పార్కింగ్ ప్రాంతాల్లో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఎల్ఈడీ లైట్లు, సెంట్రల్ ఏసీ, ఆధునిక విద్యుత్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి.

ఎప్పటిలోగా పూర్తవుతుంది?

ఈ ప్రాజెక్టుకు అవసరమైన రైల్వే భూమిలో సుమారు 80 శాతం గుర్తించి సేకరించినట్లు సమాచారం. రూ.2,245 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ నిర్మాణాన్ని వచ్చే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఎప్పుడు పూర్తి అవుతుంది? అనే వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నాయి.

Read Also: సీనియర్ సిటిజన్లకు పిచ్చి పిచ్చిగా నచ్చేసిన బెంగళూరు-గోవా వందే భారత్.. ఎందుకో తెలుసా?

Tags

Related News

కాకులు వాలని ఎకైక పుణ్య క్షేత్రం.. సైన్స్‌కే సవాల్ విసురుతున్న యాగంటి రహస్యాలివే?

సీనియర్ సిటిజన్లకు పిచ్చి పిచ్చిగా నచ్చేసిన బెంగళూరు-గోవా వందే భారత్.. ఎందుకో తెలుసా?

వీసా లేకుండానే ఐర్లాండ్ ట్రిప్.. భారతీయులకు బంపర్ ఆఫర్!

6:45 PM అని కాకుండా 18:45 అని ఎందుకు రాస్తారు? రైల్వే, ఎయిర్‌లైన్స్ టైమింగ్స్ ఎందుకిలా ఉంటాయి?

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి 96 ప్రత్యేక రైళ్లు!

ఊటీ, అరకు బోర్ కొట్టాయా? నవంబర్‌లో తప్పక చూడాల్సిన 5 సీక్రెట్ హిల్ స్టేషన్లు ఇవే!

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి షాక్.. అప్పుడే నిండిపోయిన రైళ్లు!

Big Stories

Advertisement
×