E-Paper
Advertisement

రీల్స్ కోసం రైలు ఎక్కాడు.. కరెంట్ తగిలి కాలిపోయాడు!

రీల్స్ కోసం రైలు ఎక్కాడు.. కరెంట్ తగిలి కాలిపోయాడు!
Advertisement

Tragic End to Reel Attempt: సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం చేసిన ఓ పిచ్చి పని బాలుడి ప్రాణాలను తీసింది. రీల్స్ కోసం వీడియో తీసే ప్రయత్నంలో గూడ్స్ రైలు ఎక్కిన 15 ఏళ్ల బాలుడు హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన హర్యానాలోని యమునా నగర్‌ లో చోటుచేసుకుంది.

రైలు పైకి ఎక్కి వీడియో తీస్తుండగా..

యమునా నగర్‌లోని జగధ్రి వర్క్‌ షాప్ సమీపంలో ఈ ఘటన జరిగింది. జవహర్ నగర్‌కు చెందిన కేశవ్ అనే 15 ఏళ్ల బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. సోషల్ మీడియా కోసం రీల్స్ చేయాలని గూడ్స్ రైలు పైకి ఎక్కాడు. అయితే, అక్కడే ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలు అతడికి తగలడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. తీవ్రంగా కాలిపోయిన బాలుడు స్పాట్ లోనే ప్రాణాలు విడిచాడు.

కొత్త బట్టలు కొనడానికి వెళ్లి..

Advertisement

కేశవ్ తన రిలేటివ్ అయిన ఆశిష్‌తో కలిసి కొత్త బట్టలు కొనుక్కోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇద్దరూ బట్టలు కొనుగోలు చేసిన తర్వాత వీడియో చేయాలని అనుకున్నారు. అందులో భాగంగానే జగధ్రి వర్క్‌ షాప్ దగ్గర నిలిపి ఉంచిన గూడ్స్ రైలు దగ్గరకు వెళ్లారు. వీడియో రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో కేశవ్ రైలు పైకి ఎక్కగా, ఆశిష్ కిందనే నిలబడ్డాడు. పైన ఉన్న హై వోల్టేజ్ విద్యుత్ తీగలు కేశవ్‌కు తగలడంతో ఘోరం జరిగింది. విద్యుత్ షాక్ తీవ్రతకు శరీరం కాలిపోయింది.

భారీ శబ్దం రావడంతో అక్కడికి పరిగెత్తిన స్థానికులు

ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా, బాలుడు తీవ్రంగా కాలిపోయిన స్థితిలో కనిపించాడు. ఈ ఘటనతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం యమునా నగర్‌లోని సివిల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై వివరాలు సేకరించారు.

కుటుంబంలో తీరని విషాదం

Advertisement

కేశవ్ మృతితో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అతడికి ఒక చెల్లెలు ఉంది. తండ్రి ఎల్‌ఐసీ (LIC) ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. చిన్న వయసులోనే కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు చేయడం, వాటికి ఎక్కువ వ్యూస్ రావాలనే ప్రయత్నంలో ప్రమాదకరమైన పనులు చేయడం ఎలాంటి విషాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. ముఖ్యంగా రైల్వే ట్రాక్‌లు, ఆపి ఉంచిన రైళ్లు, కరెంటు తీగల సమీపంలో వీడియోలు చేయడం ప్రాణాలకే ప్రమాదకరం అని హెచ్చరిస్తోంది.

Read Also: వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఇక నాలుగు రకాల వంటకాలే.. ఎందుకంటే?

Tags

Related News

వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఇక నాలుగు రకాల వంటకాలే.. ఎందుకంటే?

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి కొల్లంకు స్పెషల్ ట్రైన్!

అయోధ్య-జనక్‌పూర్ మధ్య నేరుగా రైలు.. మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా చేతుల మీదుగా ప్రారంభం!

ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన.. కాళ్లపై పడి వేడుకున్నా కనికరించని అధికారులు.. వైరల్ వీడియో!

ఒంటరిగా ట్రావెలింగ్ ఇష్టపడేవారికి ఇండియాలో 7 అద్భుతమైన ప్రాంతాలు.. మహిళలకు కూడా సేఫ్

ఇండియా vs చైనా.. ఏ దేశంలో రైలు ప్రయాణం బెటర్? నెట్టింట వీడియో వైరల్..

ఇండియన్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ రూట్ ఫిక్స్.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

Big Stories

Advertisement
×