E-Paper
Advertisement

వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఇక నాలుగు రకాల వంటకాలే.. ఎందుకంటే?

వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఇక నాలుగు రకాల వంటకాలే.. ఎందుకంటే?
Advertisement

Vande Bharat Sleeper Food Menu: వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఫుడ్ మెనూకు సంబంధించి ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ మెనూను కంప్లీట్ గా మార్చబోతున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు భోజనంలో 8 నుంచి 10 రకాల వంటకాలు అందిస్తుండగా.. ఇకపై వాటి సంఖ్యను ఏకంగా నాలుగుకు తగ్గించాలని నిర్ణయించింది. ఫుడ్ ఐటెమ్స్ తగ్గించినప్పటికీ, క్వాలిటీ, టేస్టీపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని IRCTC భావిస్తోంది. రైళ్లలో ఫుడ్ గురించి ప్రయాణికుల నుంచి తరచుగా కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపై నాలుగు వంటకాలే..

వాస్తవానికి ఎక్కువ రకాల వంటకాలను ఒకేసారి తయారు చేయడం, వాటిని రైళ్లలో సరైన నాణ్యతతో అందించడం కష్టంగా మారుతోంది. అందుకే మెనూను తగ్గించాలని IRCTC నిర్ణయించింది. వంటకాల సంఖ్య తగ్గించడం వల్ల ప్రతి ఫుడ్ ఐటెమ్ ను పరిశీలించడం ఈజీ అవుతుంది. వంటకాల క్వాలిటీ, ఫ్రెష్ నెస్ కూడా మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అదే సమయంలో వంటకాల సంఖ్య తగ్గించినా.. ఫుడ్ ఐటెమ్స్ క్వాంటిటీలో ఎలాంటి మార్పు ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

గతంతో పోల్చితే తగ్గిన క్యాటరింగ్ కంప్లైంట్స్

Advertisement

రైల్వే క్యాటరింగ్ సర్వీసులపై ప్రయాణికుల ఫిర్యాదులను తగ్గించేందుకు IRCTC పలు చర్యలు చేపడుతోంది. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 15, 2026 మధ్య గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 10 శాతం తగ్గాయి. ఫుడ్ క్వాలిటీ చెకింగ్స్, నీట్ నెస్ మెయింటెనెన్స్, కాంట్రాక్టర్లపై చర్యలు, కంప్లైంట్స్ కు త్వరగా స్పందించడం వల్ల ఫిర్యాదులు తగ్గుతున్నాయని IRCTC తెలిపింది.

లోకల్ ఫుడ్ ఐటెమ్స్ కు ఇంపార్టెన్స్   

ముంబై-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలులో ఇప్పటికే ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, వడ, ఉప్మా, పోహా, చట్నీ, సాంబార్ లాంటి ఐటెమ్స్ అందిస్తున్నారు. ప్రయాణికుల లోకల్ ఇంట్రెస్టులకు తగినట్లుగా  మహారాష్ట్రకు చెందిన జుంకా భాకర్, పూరన్ పోలి లాంటి వంటకాలను కూడా మెనూలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. భోజనంలో శాకాహారులకు అన్నం, పప్పు, కూర, చపాతీ అందించనున్నారు. మాంసాహారం తీసుకునే వారికి చికెన్ కూడా ఉంటుంది. గతంలో సలాడ్, పెరుగు, ఊరగాయతో పాటు పలు రకాల కూరలతో పెద్ద మెనూ ఉండేది.

ప్యాకెట్ స్నాక్స్‌ పైనా కీలక నిర్ణయం..

Advertisement

మరోవైపు భోజనంతో పాటు ఇచ్చే బిస్కెట్లు, చిప్స్ లాంటి ప్యాక్ చేసిన ఫుడ్ ఐటెమ్స్ విషయంలోనూ మార్పులు చేయనున్నారు. వీటిని ఫుడ్ ప్యాకేజీ నుంచి తొలగించడం, ప్రయాణికులకు విడిగా అమ్మే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఛేంజెస్ తర్వలో ఇతర ప్రీమియం రైళ్లకూ విస్తరించే అవకాశంపైనా చర్చలు జరుగుతున్నాయి. ఎక్కువ వంటకాల కంటే.. తక్కువ ఫుడ్ ఐటెమ్స్ ఇచ్చినా క్వాలిటీగా అందించాలని రైల్వే భావిస్తోంది.

Read Also: అయోధ్య-జనక్‌పూర్ మధ్య నేరుగా రైలు.. మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా చేతుల మీదుగా ప్రారంభం!

Tags

Related News

అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి కొల్లంకు స్పెషల్ ట్రైన్!

అయోధ్య-జనక్‌పూర్ మధ్య నేరుగా రైలు.. మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా చేతుల మీదుగా ప్రారంభం!

ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన.. కాళ్లపై పడి వేడుకున్నా కనికరించని అధికారులు.. వైరల్ వీడియో!

ఒంటరిగా ట్రావెలింగ్ ఇష్టపడేవారికి ఇండియాలో 7 అద్భుతమైన ప్రాంతాలు.. మహిళలకు కూడా సేఫ్

ఇండియా vs చైనా.. ఏ దేశంలో రైలు ప్రయాణం బెటర్? నెట్టింట వీడియో వైరల్..

ఇండియన్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ రూట్ ఫిక్స్.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

జపాన్ కోసం అరకు రైల్వే మార్గం? ఈ రైల్వేలైన్ వెనుక ఉన్న అసలు కథ తెలుసా?

Big Stories

Advertisement
×