BigTV English

5 New Trains: 2025లో ఎంట్రీ ఇవ్వబోతున్న హైస్పీడ్ లగ్జరీ రైళ్లు ఇవే.. ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

5 New Trains: 2025లో ఎంట్రీ ఇవ్వబోతున్న హైస్పీడ్ లగ్జరీ రైళ్లు ఇవే.. ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

5 New Exciting Trains: భారతీయ రైల్వేలో 2025లో పలు అద్భుతమైన రైల్వే ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయి. పలు ప్రతిష్టాత్మక రైల్వే లైన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. దేశంలోనే అత్యంత వేగంతో దూసుకెళ్లే వందేభారత్ స్లీపర్ రైలు తన సేవలను ప్రారంభించబోతున్నది. భారత్ లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది పలు ప్రతిష్టాత్మక రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి.  అత్యంత వేగం, స్టార్ హోటళ్లను మించిన సౌకర్యాలతో ప్రయాణీకుల ముందుకు రాబోతున్నాయి. వాటిలో టాప్ 5 రైళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


⦿పారిస్-బెర్లిన్ హైస్పీడ్ రైలు

యూరప్ లోని రెండు కీలక దేశాల రాజధానులను కలిపే ఈ హైస్పీడ్ రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. గంటలకు 322 కిలో మీటర్లలతో దూసుకెళ్లే ఈ రైలు జర్మనీలోని బెర్లిన్ నుంచి ఫ్రాన్స్ రాజధాని పారిస్ ను కలపనుంది. 878 కిలో మీటర్ల దూరాన్ని 8 గంటల్లో చేరుకోనుంది. ఒకేసారి 444 మంది ప్రయాణించే అవకాశం ఉంది. అత్యధునిక సౌకర్యాలతో ఈ రైలు ప్రయాణీకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించనుంది.


⦿ చైనా హైస్పీడ్ బుల్లెట్ రైలు

హైస్పీడ్ బుల్లెట్ రైళ్లను రూపొందించడంలో చైనా రూటే సఫరేటు. తాజాగా CR450s అని పిలువబడే కొత్త రైలును ఆవిష్కరించింది. ఇది గంటకు 450 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. ఈ అత్యాధునిక రైలు, చైనాలోని కీలక నగరాలైన  బీజింగ్- షాంఘైని కేవలం రెండున్నర గంటల్లో కలపనుంది.

⦿ లా డోల్స్ వీటా సూపర్ డీలక్స్ రైలు

ఇటలీలో అత్యాధునిక సూపర్ డీలక్స్ రైలు అందుబాటులోకి రాబోతున్నది. లా డోల్స్ వీటా పేరుతో ఈ రైలు ఈ ఏడాది  ఏప్రిల్ లో ప్రారంభంకానుంది. అకార్ హోటల్స్ గ్రూప్ ఈ రైలును నడిపించబోతున్నది. సంప్రదాయ, ఆధునిక లక్షణాల కలబోతగా నిర్మించిన ఈ రైలు  చారిత్రక ఇటాలియన్ ఆల్ప్స్, వెనిస్, రోమ్ నగరాల మీదుగా మాటెరా, పలెర్మో వరకు తన ప్రయాణాన్ని కొనసాగించనుంది.  హైపర్‌ లగ్జరీ 11 కార్ల రైలులో లైవ్ మ్యూజిక్, గేమ్‌లతో కూడిన స్టైలిష్ బార్ కార్, 12 డీలక్స్ వుడ్ లైన్డ్ క్యాబిన్లు, డబుల్ బెడ్లు, సోఫాతో కూడిన 18 మాస్టర్ సూట్‌ లు ఉన్నాయి.

⦿అమ్‌ ట్రాక్ రీ ఎంట్రీ  

20 సంవత్సరాల తర్వాత  అమెరికాలో ఆమ్‌ ట్రాక్ తన రైలు మళ్లీ ప్రారంభంకాబోతున్నది.  అలబామా- న్యూ ఓర్లీన్స్ మధ్య ఈ ఏడాది తన సేవలను ప్రారంభించబోతున్నది. ఆగష్టు 2005లో కత్రినా హరికేన్ భీభత్సం తర్వాత పట్టాలు ధ్వంసం కావడంతో ఈ రైలు సేవలను నిలిపివేశారు. ప్రస్తుతం రైలు పట్టాల పునరుద్ధరణ కొనసాగుతున్నది. త్వరలో ఈ రైలు అందుబాటులోకి రానున్నది.

⦿బ్రిటానిక్ ఎక్స్‌ ప్లోరర్  

యుకెలో త్వరలో లగ్జరీ బ్రిటానిక్ ఎక్స్‌ ప్లోరర్ రైలు అందుబాటులోకి రానుంది. లండన్ నుంచి వేల్స్, లేక్ డిస్ట్రిక్ట్, కార్న్‌ వాల్ లాంటి ఐకానిక్ ప్రాంతాల మీదుగా ఈ లగ్జరీ స్లీపర్ రైలు ప్రయాణించనుంది. ఈ రైలు మూడు గ్రాండ్ సూట్‌లతో సహా  18 విలాసవంతమైన క్యాబిన్లను కలిగి ఉంటుంది.  వెల్వెట్ సోఫాలు, లగ్జరీ స్ట్రిప్డ్ వాల్‌ పేపర్, కాక్‌ టెయిల్ బార్, అబ్జర్వేషన్ కార్, ప్రయాణీకులు విశ్రాంతి తీసుకోవడానికి ఆన్ బోర్డ్ స్పా కూడా ఉన్నాయి. ఇందులో లంచ్, డిన్నర్, డ్రింక్స్ అందుబాటులో ఉంటాయి.

Read Also:  సంక్రాంతికి వెళ్తున్నారా? మీ కోసం మరో గుడ్ న్యూస్!

Related News

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Big Stories

×