BigTV English

Director Bobby: తారక్ గురించి బాలయ్య మాట్లాడలేదు.. మాకు కవర్ చేయాల్సిన అవసరం లేదు

Director Bobby: తారక్ గురించి బాలయ్య మాట్లాడలేదు.. మాకు కవర్ చేయాల్సిన అవసరం లేదు

Director Bobby: నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్నాయని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టేశాడని, ఏ ఫంక్షన్స్ కు ఎన్టీఆర్ ని పిలవడని, వచ్చినా పట్టించుకోడని టాక్ నడుస్తూ ఉంటుంది.  ఎన్టీఆర్.. హరికృష్ణ రెండో భార్య కొడుకు అన్న విషయం తెల్సిందే. హరికృష్ణ చనిపోయేవరకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ను ఒకే విధంగా చూసుకున్నాడు. ఆయన చనిపోయాక.. ఆ తండ్రి స్థానాన్ని బాలయ్య  తీసుకున్నాడు. బాబాయ్- అబ్బాయ్  లు అప్పుడప్పుడు కలిసి కనిపించేవారు కూడా.


కానీ, మధ్యలో ఏమైందో తెలియదు.. బాలయ్య, ఎన్టీఆర్ ను దూరం పెట్టాడు. చాలా ఈవెంట్స్ లో ఎన్టీఆర్ మిస్ అయ్యాడు. అసలు తాత ఎన్టీఆర్ జయంతి వేడుకలకు కూడా తారక్ రాలేదు. దీంతో బాబాయ్ – అబ్బాయ్ కి చెడిందని ఇండస్ట్రీ కోడై కూస్తోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. బాలయ్య  హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. ఈ షోకు వచ్చిన స్టార్స్ ను బాలయ్య ఎంతో హుందాగా ఆహ్వానించి.. ఎన్నో సరదా ఆటలు ఆడిస్తుంటాడు. నాలుగు సీజన్స్ అయ్యాయి. ఏ ఒక్క స్టార్ దగ్గర కూడా బాలయ్య ఎన్టీఆర్ పేరు ఎత్తింది లేదు.

Nagavamsi: ఆ ఇద్దరు హీరోయిన్లు కొట్టించుకోవడానికి ఒప్పుకోలేదు.. ఊర్వశీ ఒప్పుకుంది..


బన్నీ వచ్చినప్పుడు కూడా తారక్ గురించి అడిగింది లేదు. వారిద్దరూ మంచి ఫ్రెండ్స్  అయినా బన్నీ కూడా ఎన్టీఆర్ గురించి చెప్పింది లేదు. దీంతో అప్పటినుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్యపై నిప్పులు చెరుగుతున్నారు. కనీసం షోలో తారక్ గురించి మాట్లాడే ప్రేమ కూడా లేదా .. ? అని విరుచుకుపడుతున్నారు.   ఇక మొన్నటికి మొన్న ఈ షోకు డాకు మహారాజ్ టీమ్ వచ్చింది. డైరెక్టర్ బాబీ, నిర్మాత నాగవంశీ వచ్చారు. ఇక ఇప్పటివరకు బాబీ  డైరెక్ట్ చేసిన సినిమాలను చూపిస్తూ ఆ హీరోల గురించి చెప్పమని బాలయ్య అడిగాడు.

రవితేజ, పవన్ కళ్యాణ్, వెంకటేష్- నాగచైతన్య, చిరంజీవి , బాలయ్య ల ఫోటోలను చూపించారు. వారి గురించి బాబీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. కానీ, బాబీ.. ఎన్టీఆర్ తో జై లవకుశ  సినిమా చేశాడు. అయినా ఎన్టీఆర్ ఫోటో మాత్రం చూపించలేదు. దీంతో మరోసారి  ఎన్టీఆర్ ఫ్యాన్స్  హర్ట్ అయ్యారు. ఇది అన్యాయం అని, తారక్ గురించి బాలయ్య మాట్లాడలేదని  మండిపడుతున్నారు.

Kannappa : మరో వివాదంలో కన్నప్ప.. పార్వతి దేవీ లుక్ పై హిందువులు ఆగ్రహం..

ఇక తాజాగా  డాకు మహారాజ్ ప్రెస్ మీట్ లో ఇదే ప్రశ్నకు నాగవంశీ, బాబీ సమాధానాలు చెప్పారు. నాగవంశీ  ఇప్పటికే దీని గురించి మాట్లాడాడు. బాలయ్య.. తారక్ గురించి మాట్లాడాడు అని   చెప్పాడు. అయినా ఫ్యాన్స్ నమ్మలేదు. ఏదో కవర్ చేస్తున్నాడు అని చెప్పుకొచ్చారు.

తాజాగా బాబీ మాట్లాడుతూ.. ” అక్కడ అంత డ్రామా జరగలేదు.. దాన్ని కవర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ చూపించిన ఫోటోల గురించే నన్ను అడిగారు. నేను సమాధానం చెప్పాను. మొన్న వంశీగారు చెప్పినట్లు షో మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఏదో ఒక సినిమా గురించి బాలయ్య  మాట్లాడారు. ఆ పాత్రలో మా తారక్ అయితే బావుంటుంది అని చెప్పారు.

Actor Suresh: పవన్ కళ్యాణ్ రీల్ అత్తతో సురేష్ ప్రేమ.. ఆయన ఏమన్నాడంటే.. ?

అది రికార్డింగ్ ప్రోగ్రామ్ కాకపోవడం వలన బయటకు రాలేదు. అంతేకాదు బాలయ్యకు జై లవకుశ సినిమా బాగా ఇష్టం. దాని గురించి ఆయన రెండుమూడుసార్లు అన్నారు. ఎలాంటి గొడవలు లేవు. అనవసరంగా ఒక ఫ్యామిలీ ఇష్యూని మనమే పెద్దది చేస్తున్నాం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు  నెట్టింట వైరల్ గా మారాయి. మరి బాబీ  ఇచ్చిన వివరణతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ శాంతిస్తారేమో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×