Fake Universities: దేశ వ్యాప్తంగా ఉన్న స్టూడెంట్స్‌కు బిగ్ అలర్ట్ ఇది. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 21 ఫేక్ యూనివర్సిటీలు ఉన్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పేర్కొంది. ఇందుకు సంబంధించిన జాబితాను యూజీసీ వెబ్‌సైట్‌లో అందులో ఉంచింది. ఫేక్ వర్సిటీల జాబితాలో ఢిల్లీలో అత్యధికంగా 8 ఉన్నట్లు వెబ్ సైట్. కర్ణాటకలో ఒకటి, కేరళలో రెండు, మహారాష్ట్రలో ఒకటి, పుదుచ్చేరిలో ఒకటి, ఉత్తరప్రదేశ్‌లో నాలుగు, పశ్చిమ బెంగాల్‌లో రెండు ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయి. తెలంగాణలో ఎలాంటి ఫేక్ యూనివర్సిటీ లేదు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) భారతదేశంలో పనిచేస్తున్న ఫేక్ యూనివర్సిటీలను తరుచుగా ప్రకటిస్తూనే ఉంది. సంస్థలు పనిచేయడానికి అవసరమైన గుర్తింపు, చట్టపరమైన అధికారం లేకుండా తప్పుడు డిగ్రీలను అందిస్తుంటాయి. తద్వారా విద్యార్థులను మోసగిస్తుంటాయి. యూజీసీ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఇలాంటి ఫేక్ యూనివర్సిటీలు ప్రదానం చేసే డిగ్రీలను ఉన్నత విద్య, ఉద్యోగ ప్రయోజనాల కోసం గుర్తించబోమని, ఆ డిగ్రీలు చెల్లుబాటు కావని యూజీసీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే విద్యార్థులు తాము ఎంపిక చేసుకునే విశ్వవిద్యాలయాలకు అధికారిక గుర్తింపు ఉందా? అనే విషయంలో యూజీసీ లేదా ప్రభుత్వ వెబ్‌సైట్‌ల ద్వారా ధృవీకరించుకోవడం ముఖ్యం. ఇక, దేశంలోని ఫేక్ యూనివర్సిటీల జాబితాను ఒకసారి చూస్తే..
నకిలీ విశ్వవిద్యాలయాలు అనేవి చట్టబద్ధమైన నియంత్రణ సంస్థల గుర్తింపును పొందకుండా చట్టవిరుద్ధంగా డిగ్రీలు అందిస్తాయి. ఇవి ఆశావహ విద్యార్థులను అక్రమ ధృవపత్రాలు అందించి మోసగిస్తాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఇటీవల 2024 మే నాటికి భారతదేశంలో 21 నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా విడుదల చేసింది, వీటిని వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాయి. UGC ప్రకారం 2024 మే నాటికి నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా ఇలా ఉంది.
ఫేక్ యూనివర్సిటీలు…
1 . ఆంధ్ర ప్రదేశ్ క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, #32-32-2003, 7వ లైన్, కాకుమాను వరిథోట, గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్-522002 మరియు ఫిట్ నం. 301, గ్రేస్ విల్లా అపార్ట్‌మెంట్, 7/5, శ్రీనగర్, గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్-522002
2 . ఆంధ్ర ప్రదేశ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా, హౌస్ నం. 49-35-26, ఎన్జీఓ కాలనీ, విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్-530016
3 . ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ & ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (AIIPHS) స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ, ఆఫీస్ ఖ. నం. 608-609, 1వ అంతస్తు, సంతో క్రిపాల్ సింగ్ పబ్లిక్ ట్రస్ట్ బిల్డింగ్, బీడీఓ ఆఫీస్ దగ్గర, ఆలీపూర్, ఢిల్లీ-110036
4 . ఢిల్లీ కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దర్యాగంజ్, ఢిల్లీ
5 . ఢిల్లీ యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఢిల్లీ
6 . ఢిల్లీ వోకేషనల్ యూనివర్సిటీ, ఢిల్లీ
7 . ఢిల్లీ ADR-సెంట్రిక్ జ్యూరిడికల్ యూనివర్సిటీ, ADR హౌస్, 8J, గోపాల టవర్, 25 రాజేంద్ర ప్లేస్, న్యూ ఢిల్లీ – 110 008
8 . ఢిల్లీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, న్యూ ఢిల్లీ
9 . ఢిల్లీ విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్-ఎంప్లాయ్‌మెంట్, రోస్గర్ సేవాసదన్, 672, సంజయ్ ఎన్‌క్లేవ్, జీటీకే డిపో ఎదురుగా, ఢిల్లీ-110033
10 . ఢిల్లీ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం (స్పిరిచువల్ యూనివర్సిటీ), 351-352, ఫేజ్-1, బ్లాక్-ఎ, విజయ్ విహార్, రిథాలా, రోహిణి, ఢిల్లీ-110085
11 . కర్ణాటక బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, గోకాక్, బెల్గాం, కర్ణాటక
12 . కేరళ సెయింట్ జాన్స్ యూనివర్సిటీ, కిషనట్టం, కేరళ
13 . కేరళ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ ప్రాఫెటిక్ మెడిసిన్ (IIUPM), కున్నమంగళం, కోజికోడ్, కేరళ-673571
14 . మహారాష్ట్ర రాజా అరబిక్ యూనివర్సిటీ, నాగ్పూర్, మహారాష్ట్ర
15 . పుదుచ్చేరి శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, నం. 186, తిలస్పెట్, వజుత్తవూర్ రోడ్, పుదుచ్చేరి-605009
16 . ఉత్తర ప్రదేశ్ గాంధీ హిందీ విద్యాపీఠ్, ప్రాయాగ్, అలహాబాద్, ఉత్తర ప్రదేశ్
17 . ఉత్తర ప్రదేశ్ నేతాజీ సుభాస్ చంద్ర బోస్ యూనివర్సిటీ (ఓపెన్ యూనివర్సిటీ), ఆచల్తల్, అలీగఢ్, ఉత్తర ప్రదేశ్
18 . ఉత్తర ప్రదేశ్ భారతీయ విద్యా పరిషద్, భారత్ భవన్, మటియారి చిన్హట్, ఫైజాబాద్ రోడ్, లక్నో, ఉత్తర ప్రదేశ్ – 227 105
19 . ఉత్తర ప్రదేశ్ మహామాయా టెక్నికల్ యూనివర్సిటీ, PO – మహర్షి నగర్, డిస్ట్. GB నగర్, సెక్టర్ 110 ఎదురుగా, నోయిడా – 201304
20 . పశ్చిమ బెంగాల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోల్కతా
21 . పశ్చిమ బెంగాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, 8-ఎ, డైమండ్ హార్బర్ రోడ్, బిల్డ్టెక్ ఇన్, 2వ అంతస్తు, ఠాకుర్‌పుకూర్, కోల్కతా – 700063
Also Read: KTR Press Meet: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఈ 16న ED విచారణ.. అసలేం జరగబోతుందంటే..?
స్టూడెంట్స్‌కు కీలక సూచన: చట్టబద్ధమైన విశ్వవిద్యాలయాల జాబితాను యూజీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా సంబంధిత ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా ఒకసారి చెక్ చేసుకోండి. గుర్తింపు లేని విశ్వవిద్యాలయాల నుండి పొందిన డిగ్రీలు అకాడమిక్ లేదా ప్రొఫెషనల్ విలువ కలిగి ఉండవు. మోసపూరిత సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండి, అవగాహన కలిగించండి.
NOTE: ఫేక్ యూనివర్సిటీల పట్ల జాగ్రత్తగా ఉండండి.