Allu Arjun Best Movies on OTT : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. పుష్ప సినిమా తర్వాత ఈ స్టార్ క్రేజ్ ఖండంతరాలకు దాటిపోయింది. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బెస్ట్ సినిమాలను తెలుసుకుందాం.
ఆర్య (Arya)
సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీ అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది. బాక్సాఫీస్ షేక్ చేసిన ఈ మూవీలో పాటలు కూడా కుర్రకారుని ఉర్రూతలూగించాయి. ఈ మూవీలో ఆర్య అనే యువకుడు గీతా అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. గీత మాత్రం ఒక రాజకీయ నాయకుడు కొడుకు చేతిలో ఇరుక్కుపోతుంది. వీరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ చుట్టూ మూవీ తిరుగుతుంది. అల్లు అర్జున్ బెస్ట్ సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ గా ఈ మూవీ చెప్పుకోవచ్చు. సన్ యన్ ఎక్స్ టీ లో స్ట్రీమింగ్ అవుతోంది.
జులాయి (Julayi)
అల్లు అర్జున్ ఇలియానా సోనూసూద్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వమహించాడు. కష్టపడి డబ్బు సంపాదించడం కంటే టాలెంట్ తో ఈజీగా మనీ సంపాదించవచ్చు అనుకునే ఒక యువకుడికి, బిట్టు అని ఒక క్రిమినల్ కి మధ్య వార్ నడుస్తుంది. బిట్టుని పట్టించడానికి పోలీసులకు సహాయం చేసే హీరో కొన్ని అనుకోని సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మూవీ కామెడీ థ్రిల్లర్ తో ప్రేక్షకు ముందుకు వచ్చి అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ గా నిలిచింది.ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియొలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
అల వైకుంఠపురం లో (Ala Vaikunthapurramuloo)
అల్లు అర్జున్, పూజ హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. తండ్రి కొడుకులు మధ్య జరిగే సన్నివేశాలు ఈ మూవీలో ఆకట్టుకుంటాయి. ఒక డబ్బున్న కుటుంబంలో తన కొడుకు ఉండాలని చిన్నప్పుడే పిల్లల్ని మార్చేసి ఒక తండ్రి కథ చుట్టూ మూవీ నడుస్తుంది. ఈ మూవీ అల్లు అర్జున్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
పుష్ప : ది రైజ్ (Pushpa : The Rise)
ఈ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘పుష్ప : ది రైజ్’ మూవీ వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా, క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలలో నటించగా, ఫహీద్ ఫాజల్ , సునీల్ విలన్ పాత్రల్లో నటించారు. స్మగ్లింగ్ చేస్తూ గొప్ప పొజిషన్ కి రావడానికి అల్లు అర్జున్ చేసే ప్రయత్నాలు ఈ మూవీలో హైలెట్ గా నిలుస్తాయి. అల్లు అర్జున్ నటన ఈ సినిమాలో అద్భుతంగా ఉంటుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డు ఎక్కింది. డిసెంబర్ 5న 2024 ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. పుష్ప 2 ది రూల్ ఎంతగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందో చూడాలి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియొలో స్ట్రీమింగ్ అవుతోంది.