BigTV English

CM Revanth Reddy: మహిళలను కోటీశ్వరులు చేసే లక్ష్యంగా రేవంత్ అడుగులు

CM Revanth Reddy: మహిళలను కోటీశ్వరులు చేసే లక్ష్యంగా రేవంత్ అడుగులు

CM Revanth Reddy: ప్రజలకు ఏది అవసరమో దాన్నే పాలకుడు ప్రయారిటీగా తీసుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలులో భాగంగా వరంగల్ చిరకాల స్వప్నం నెరవేర్చేందుకు శ్రీకారం చుట్టారు. అలాగే సరికొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చింది ప్రభుత్వం. తెలంగాణలో కొత్తగా 4 విమానాశ్రయాలకు కసరత్తు కూడా మొదలైంది.


17-11-2024 ఆదివారం (మన ఈవీ పాలసీ అదుర్స్)

ఒక పాలసీ తెస్తే అది ప్రజలకు బెనిఫిట్ జరిగిందనిపించుకోవాలి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త ఈవీ పాలసీ అసలైన ప్రయోజనాలు అందిస్తోంది. జీవో నెంబర్ 41 రిలీజ్ చేసింది. ఈ ఏడాది నవంబర్ 18 నుంచి 2026 డిసెంబర్ 31 వరకు దాకా ఈవీ పాలసీ అమలులో ఉండనుంది. ఈ ప్రకారం ఎలక్ట్రిక్​ 4 వీలర్స్​, టూ వీలర్స్​, ఎలక్ట్రిక్​ ట్రాన్స్ ​పోర్ట్​ వాహనాలు, నాన్​ ట్రాన్స్ ​పోర్ట్ వెహికిల్స్, ఆటోలు, ఎలక్ట్రిక్​ బస్సులకు టాక్స్ ​తో పాటు రిజిస్ట్రేషన్​ టాక్స్ ​లో వందశాతం మినహాయింపు దొరకనుంది.


ఈ ఈవీ పాలసీ విధానంతో అటు కాలుష్యానికి చెక్ పడుతుంది. ఇటు వాహనదారులకు కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం తప్పుతుంది. గత ప్రభుత్వంలో 2020 నుంచి 2030 వరకు ఎలక్ట్రిక్​ వెహికిల్​ పాలసీని తీసుకొచ్చి 5 వేల వాహనాల వరకు రాయితీ ఇచ్చి, ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో ఈవీ పాలసీ తీసుకొచ్చింది. అటు హైదరాబాద్​ లో ఇప్పుడున్న 3 వేల బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్​ బస్సులు తేవడం ద్వారా కాలుష్యానికి పూర్తిగా చెక్ పెట్టే పనిలో ఉన్నారు.

మన రైతులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తే అద్భుతాలు సృష్టిస్తారని మరోసారి ప్రూవ్ చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన బాగా వర్కవుట్ అయింది. సన్నవడ్లకు ప్రోత్సాహకం అందిస్తామని చెప్పడంతో రైతులు ఉత్సాహంగా నాట్లు వేసి కష్టపడ్డారు. దీంతో కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా రికార్డు స్థాయిలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండించారు మన రైతులు. దీంతో సీఎం రేవంత్ సంతోషం వ్యక్తం చేశారు. సన్నాలకు బోనస్ ఇస్తున్నారు. ఇందుకోసం ముందుగానే నిధులను రిలీజ్ చేశారు.

17-11-2024 (మన ఈవీ పాలసీ అదుర్స్)
ఒక పాలసీ తెస్తే అది ప్రజలకు బెనిఫిట్ జరిగిందనిపించుకోవాలి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త ఈవీ పాలసీ అసలైన ప్రయోజనాలు అందిస్తోంది. జీవో నెంబర్ 41 రిలీజ్ చేసింది. ఈ ఏడాది నవంబర్ 18 నుంచి 2026 డిసెంబర్ 31 వరకు దాకా ఈవీ పాలసీ అమలులో ఉండనుంది. ఈ ప్రకారం ఎలక్ట్రిక్​ 4 వీలర్స్​, టూ వీలర్స్​, ఎలక్ట్రిక్​ ట్రాన్స్ ​పోర్ట్​ వాహనాలు, నాన్​ ట్రాన్స్ ​పోర్ట్ వెహికిల్స్, ఆటోలు, ఎలక్ట్రిక్​ బస్సులకు టాక్స్ ​తో పాటు రిజిస్ట్రేషన్​ టాక్స్ ​లో వందశాతం మినహాయింపు దొరకనుంది.

ఈ ఈవీ పాలసీ విధానంతో అటు కాలుష్యానికి చెక్ పడుతుంది. ఇటు వాహనదారులకు కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం తప్పుతుంది. గత ప్రభుత్వంలో 2020 నుంచి 2030 వరకు ఎలక్ట్రిక్​ వెహికిల్​ పాలసీని తీసుకొచ్చి 5 వేల వాహనాల వరకు రాయితీ ఇచ్చి, ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో ఈవీ పాలసీ తీసుకొచ్చింది. అటు హైదరాబాద్​ లో ఇప్పుడున్న 3 వేల బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్​ బస్సులు తేవడం ద్వారా కాలుష్యానికి పూర్తిగా చెక్ పెట్టే పనిలో ఉన్నారు.

19-11-2024 మంగళవారం ( వెలుగుల్లో కాళోజీ కళాక్షేత్రం )

ఎన్నెన్నో ఆటంకాలు దాటుకుని కాళోజీ కళాక్షేత్రం అందుబాటులోకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో సుదీర్ఘకాలం నిర్లక్ష్యానికి గురైన ఈ నిర్మాణం.. ప్రజా ప్రభుత్వం రాగానే ఊపందుకున్నది. తాజాగా వరంగల్ లో ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు నిర్వహించిన సందర్భంలో ఈ కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అన్ని రకాల కళా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేలా ఈ ఆడిటోరియం ఉంది.

2014లో హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో దీన్ని నిర్మించారు. 4.2 ఎకరాల స్థలంలో 95 కోట్ల రూపాయల ఖర్చుతో రెండు అంతస్తుల్లో భవనాన్ని తీర్చిదిద్దారు. హైదరాబాద్‌ రవీంద్రభారతికన్నా పెద్దగా 1,150 మంది కూర్చునేలా భారీ ఆడిటోరియం, స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. అత్యాధునిక సౌండ్, లైటింగ్‌ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో ఆర్టియం, ప్రీఫంక్షన్‌ ఏరియా, వంటగది, రెండో అంతస్తులో కాళోజీ వినియోగించిన వస్తువులతో ఆర్ట్‌ గ్యాలరీ ఉన్నాయి. ఆయన చేసిన రచనలతో గ్రంథాలయం ఏర్పాటు చేశారు.

19-11-2024 మంగళవారం ( వరంగల్ దశ దిశ మారేలా.. )

గత పదేళ్లు వరంగల్ కు హామీలు తప్ప నిధుల వరద పారింది లేదు. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం తాజాగా నిర్వహించిన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో వరంగల్ అభివృద్ధికి అసలు సిసలైన రోడ్ మ్యాప్ ప్రకటించింది. వరంగల్ వాసుల్లో ఇది నమ్మకాన్ని పెంచింది. వరంగల్ ను మెట్రో సిటీగా తీర్చిదిద్దుతామని, ఇప్పుడు 6 వేల కోట్లు తర్వాత మరిన్ని నిధులు ఇస్తామన్నారు సీఎం రేవంత్. విజయోత్సవంలో భాగంగా కొన్ని పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వరంగల్ వాసులు ఎప్పటి నుంచో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోరుకుంటున్నారు. అయితే అది గత పదేళ్లుగా సాధ్యం కాలేదు. ఇప్పుడు ఏకంగా ఈ పనుల కోసం 4,170 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అటు తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మరెక్కడా ఎయిర్ పోర్టు లేదు. వరంగల్ మామునూరులో ఎయిర్ పోర్ట్ భూసేకరణకు 205 కోట్లు కేటాయించారు. అందుకే వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్, రామగుండంలో ఎయిర్ పోర్టులు సాధిస్తామంటున్నారు. ఇదే జరిగితే తెలంగాణ కొత్త దిశలో అభివృద్ధి చెందడం ఖాయమే. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు 160 కోట్లు, అలాగే టెక్స్ టైల్ పార్క్ కు భూములు ఇచ్చిన రైతులకు 863 ఇందిరమ్మ ఇండ్లకు 43 కోట్లు కేటాయించారు. ఇన్నర్ రింగ్ రోడ్ కు 80 కోట్లు ప్రకటించారు.

19-11-2024 మంగళవారం ( కొలువుల జాతర కంటిన్యూ )

తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం వచ్చిన 11 నెలల్లోనే 50 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేసింది. ఇది నిరుద్యోగ యువతకు చాలా ప్లస్ అయింది. గత పదేళ్లుగా ఉద్యోగాల కోసం వేచి చూసి విసిగిపోయిన వారిలో ఆశలు నింపింది రేవంత్ ప్రభుత్వం. ఇందులో భాగంగా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈనెల 19న గ్రూప్-4 ఫలితాలను వెల్లడించింది. 8,084 మందితో కూడిన ప్రొవిజినల్ జాబితాను రిలీజ్ చేసింది. సో వీరు కూడా ఉద్యోగాల్లో చేరబోతున్నారు.

గత పదేళ్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. నేషనల్ హైవేస్ పెండింగ్ పనుల పూర్తి, గిరిజన తండాలకు త్రీఫేజ్ కరెంట్, ఇందిరాశక్తి పథకాన్ని ఆచరణలోకి తీసుకురావడం, ఫార్మా కంపెనీలతో భారీ ఒప్పందాలు, ఏరోస్పేస్ కొత్త పెట్టుబడులు ఇవన్నీ ఈ వారం ప్రభుత్వానికి బూస్టప్ గా మారాయి. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలలో భాగంగా సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాపై ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించారు. తొలి ఏడాదిలోనే మొత్తం 694 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు.

శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు 76 కోట్లు, అలాగే 35 కోట్లతో అన్నదానం సత్రం నిర్మాణ పనులు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గల్ఫ్ దేశాలలో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం అందించారు. గల్ఫ్ పాలసీలో భాగంగా ప్రజా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మిడ్ మానేరు నిర్వాసితుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. 236 కోట్ల రూపాయలతో మిడ్ మానేరు రిజర్వాయర్ భూ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతామని నిధులు రిలీజ్ చేశారు. సో ఏడాది పాలన సందర్భంగా పూర్తి విశ్వాసం కల్పించేలా ప్రభుత్వం ముందడుగు వేసింది.

20-11-2024 – బుధవారం (తండాలకు త్రీ ఫేజ్ కరెంట్ )

గిరిజన తండాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆ గ్రామాలకు త్రీ ఫేజ్ కరెంట్ కావాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఆ డిమాండ్ ను ఫుల్ ఫిల్ చేసేందుకు ప్రజా ప్రభుత్వం డిసైడ్ అయింది. 3 నెలల తర్వాత దీన్ని అమలులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రెడీ చేసింది. ఈనెల 20న ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధులపై అలాగే 32 శాఖల పనితీరుపై ప్రభుత్వం సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలును సీరియస్‌గా తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించింది. తక్కువ ఖర్చు చేస్తున్న విభాగాల్లో కొత్త పనులను మంజూరు చేయడం, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధుల వ్యయంపై అన్ని శాఖలు 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధులను సకాలంలో ఖర్చు చేసేలా కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది.

20-11-2024 – బుధవారం (నేషనల్ హైవేస్ ఇక రయ్ రయ్..)

అభివృద్ధికి రోడ్లే కీలకం. అలాంటి రోడ్లు ఎంత త్వరగా పూర్తయితే అంత బెనిఫిట్. అందుకే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం మీదుగా వెళ్తున్న నేషనల్ హైవేస్ పెండింగ్ పనులపై ఫోకస్ పెంచింది. గత ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారుల విషయంలో నిర్లక్ష్యం వహించారని, ఇప్పుడు వాటిపై రివ్యూ చేసిన ప్రభుత్వం వేగం పెంచాలని ఆదేశించింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేషనల్ హైవేస్ నిర్మాణాలను ఆపొద్దని సూచించింది. భూసేకరణ, అటవీ అనుమతుల విషయంలో సీరియస్ గా పని చేయాలన్నారు. విజయవాడ-నాగ్‌పూర్ NH 163, హైదరాబాద్ – డిండి NH- 765, ఖమ్మం – దేవరపల్లి NH 365 పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్షించారు. 2025 మే లేదా జూన్ కల్లా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.

21-11-2024 – గురువారం (ప్రతి మండలానికి 2 అంబులెన్సులు )

పేదలకు వైద్యం విషయంలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కిందిస్థాయి నుంచి పటిష్ఠం చేస్తూ వస్తున్నారు. వైద్యశాఖలో ఇప్పటికే 7 వేలకు పైగా నర్సుల నియామకాలు చేపట్టారు. రోగులకు 90శాతం చికిత్స PHC, CHCల్లోనే జరిగేలా కార్యాచరణ రెడీ చేస్తున్నారు. ప్రభుత్వ డాక్టర్లు రోగిని తమ క్లయింట్‌గా భావించాలని వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. మంచిర్యాలలో 360 కోట్లతో చేపట్టనున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌ బాబు ఈనెల 21న భూమి పూజ చేశారు. హాస్పిటల్స్ లో వైద్య సిబ్బంది అందుబాటులో లేరనే విమర్శ రావొద్దని సూచించారు. ప్రతి మండలానికి 2 అంబులెన్స్‌లు, అలాగే ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్‌ ఉండేలా చర్యలు చేపట్టనుంది ప్రభుత్వం.

21-11-2024 – గురువారం (ఆచరణలోకి ‘ఇందిరాశక్తి’)

మహిళల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ఇప్పటికే ప్రకటించింది. అది మాటల్లో కాకుండా చేతల్లోనూ చూపిస్తోంది. మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కారు ఈ పథకం తీసుకొచ్చింది. తాజాగా, ఈ స్కీంపై సీఎస్ 21న రివ్యూ చేశారు. మహిళా సంఘాల ద్వారా మొత్తం 600 బస్సులను కొనుగోలు చేయబోతున్నారు. తొలి విడతలో 150 బస్సులను వెంటనే కొనబోతున్నారు. వీటిని మహిళా సంఘాల ద్వారా ఆర్టీకి అద్దెకు ఇవ్వనున్నారు. అలాగే, మహిళా సంఘాల ద్వారా 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయించబోతున్నారు. మొదటి దశలో వెయ్యి మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.

21-11-2024 – గురువారం (ఖాకీ కల నెరవేరిన వేళ..)

తెలంగాణ పోలీస్‌శాఖలో 8 వేల మందికిపైగా సివిల్, ఆర్మ్‌డ్‌ రిజర్వుడు కానిస్టేబుళ్లు విధుల్లో చేరారు. తెలంగాణ పోలీస్‌ అకాడమీతో పాటు రాష్ట్రంలోని పలు శిక్షణ కేంద్రాలో ఈ నెల 21న పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ జరిగింది. మరో 4 వేల మంది తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ శిక్షణ డిసెంబరులో పూర్తి కానుంది.

21-11-2024 – గురువారం (ఏరోస్పేస్ లో కొత్త పెట్టుబడి)

పెట్టుబడుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ పెంచుతోంది. ప్రపంచ ప్రఖ్యాత విమాన తయారీ సంస్థలకు కీలక పరికరాలను సరఫరా చేస్తున్న రఘువంశీ ఏరోస్పేస్‌.. 300 కోట్ల రూపాయలతో భారీ విస్తరణ ప్రణాళిక రెడీ చేసింది. ఈనెల 21న శంషాబాద్‌ ఏరోస్పేస్‌ పార్క్‌లో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ విస్తరణ జరిగితే రానున్న మూడేళ్లలో 1,200 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఎయిర్‌బస్‌ ఏ320, బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాల ఇంజిన్లకు, జీఈ ఏరోస్పేస్, రోల్స్‌ రాయిస్, ప్రాట్‌ అండ్‌ విట్నీ, సఫ్రన్, హానీవెల్‌ విమానాలకు ఇంజిన్లను తయారు చేసే సంస్థలకు రఘువంశీ ఏరోస్పేస్ ఫ్యూయల్ ట్యాంకులు, ల్యాండింగ్‌ గేర్లు వంటి కీలక విడిభాగాలను సరఫరా చేస్తోంది. ప్రస్తుతం ఈ పరిశ్రమ చేతిలో 2 వేల కోట్ల ఆర్డర్లు ఉన్నాయి.

22-11-2024 – శుక్రవారం ( మధ్యవర్తిత్వమే మార్గం )

గచ్చిబౌలిలో కామన్వెల్త్ మీడియేషన్ – ఆర్బిట్రేషన్ కాన్ఫరెన్స్-2024 కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే పాల్గొన్నారు. భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌‌‌‌లో ఉండడం కోర్టులకు సవాల్‌‌‌‌గా మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పెండింగ్ భారాన్ని తగ్గించడానికి, వేగంగా, సమర్థవంతంగా కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థలు అవసరమన్నారు.

మధ్యవర్తిత్వం, చర్చల ద్వారా వీలైనంత త్వరగా సమస్యలు, వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. అలా చేయడం వల్ల వివాదంలో చిక్కుకున్న ఇరువర్గాలకూ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. అందుకోసం ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్‌‌‌‌ ఉపయోగపడుతోంది. ఈ సందర్భంగా సీఎం చెప్పిన కీలక విషయం ఏంటంటే ఈ మధ్యవర్తిత్వ కేంద్రం సేవలను గ్లోబల్ ఇన్వెస్టర్స్‌‌‌‌కు, బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే పరిమితం చేయకుండా కామన్‌‌‌‌ మ్యాన్‌‌‌‌కు, చిన్న సంస్థలకు కూడా అందించాలన్నారు. ఆర్బిట్రేషన్ సేవలను పేదలకు అందుబాటులోకి తీసుకురావడంపై మరో సదస్సు నిర్వహించాలని సీఎం కోరారు.

(22-11-2024 – శుక్రవారం ( విద్యకు పట్టం )

విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్ లో నిధులు కేటాయించింది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రకటించిన వాటికి తోడుగా మరో 26 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లుకు ప్రభుత్వం అనుమంచింది. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను రేవంత్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగానే బోధన్, పెద్దపల్లి, డోర్నకల్, సత్తుపల్లి, వైరా, కోదాడ, కొత్తగూడెం, నకిరేకల్, నాగార్జునసాగర్, తాండూరు, మక్తల్, రామగుండం, నారాయణపేట, జుక్కల్, చొప్పదండి, కల్వకుర్తి, నిజామాబాద్ రూరల్, వనపర్తి, చేవెళ్ల, జగిత్యాల, వికారాబాద్, గద్వాల్, ధర్మపురి, మెదక్ మేడ్చల్, ఆర్మూర్ లో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు రాబోతున్నాయి.

22-11-2024 – శుక్రవారం ( హైడ్రా కీ అప్డేట్ )

చెరువుల సంరక్షణ కోసం కీలకంగా పని చేస్తున్న హైడ్రా.. ఈ వారం కీలకమైన అప్డేట్ ఇచ్చింది. ఎఫ్టీఎల్ లో ఇండ్లు ఉన్నప్పటికీ వాటికి పర్మిషన్లు ఉంటే ఆ ఇళ్లను కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, వాతావరణ నిపుణులు, అన్ని శాఖల మేధావులతో మీటింగ్ పెట్టామని.. ఎఫ్టీఎల్ పరిధిని ఎలా నిర్దారణ చేయాలి, చెరువుల సమస్యలు వంటి అంశాలపై చర్చించామని అన్నారు. ఇకనుంచి ఎఫ్టీఎల్ లో నిర్మాణాలు రాకుండా చూసుకోబోతోంది. బెంగుళూరులో చెరువుల పరిరక్షణపై ఇప్పటికే స్టడీ చేసి వచ్చారు. ప్రకృతి విపత్తుల నుంచి హైదరాబాద్‌ ప్రజలను అప్రమత్తం చేసేందుకు వాతావరణశాఖతో కలిసి పని చేయబోతోంది హైడ్రా.

22-11-2024 – శుక్రవారం (ఇక ఫార్మా ఫటా ఫట్..)

రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలను పెంచాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక ముందడుగు వేసింది. తాజాగా దేశంలో పేరొందిన పలు ఫార్మా కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో రాష్ట్రానికి దాదాపు 5,260 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా ఫార్మా రంగంలో 12,490 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్ కంపెనీల ప్రతినిధులు ఈనెల 22న సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో సంప్రదింపులు జరిపి ఎంవోయూ కుదుర్చుకున్నారు. కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాటు గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు ఈ అవగాహన ఒప్పందాలు కుదిరాయి.

22-11-2024 – శుక్రవారం ( పారదర్శకతకు పట్టం )

ప్రజల దృష్టిలో ఉద్యోగుల జవాబుదారీ తనాన్ని పెంచేలా ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు చేస్తున్నారు. రెగ్యులర్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల హాజరు ప్రక్రియను ఇక నుంచి ఫేషియల్ టెక్నాలజీ ద్వారా నమోదు చేస్తారు. ఉద్యోగుల సమయపాలనపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం ఫేస్ రికగ్నిషన్ హాజరు ప్రక్రియకు నిర్ణయించింది. ప్రజాప్రభుత్వం వచ్చాక ఉద్యోగులు ఆలస్యంగా వస్తున్నారని గుర్తించి పారదర్శకత పెంచేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో ప్రస్తుతం నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి ఏఎస్ఓలు, సెక్షన్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, జాయింట్‌ సెక్రటరీలు, అడిషనల్‌ సెక్రటరీల వరకు దాదాపు 4వేల మంది పని చేస్తున్నారు. ఐఏఎస్ లు మినహా అందరికీ ఫేషియల్‌ రికగ్నిషన్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. జవాబుదారీతనం పెంచే విషయంలో ఇదో కొత్త ఆలోచన.

23-11-2024 – శనివారం ( క్లైమాక్స్ కు ఇంటింటి సర్వే )

ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే రాష్ట్రంలో ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు 87.1 శాతం నివాసాలలో ఈ సర్వే పూర్తయింది. గడువు సమీపిస్తుండడంతో ఎన్యుమరేటర్లు స్పీడ్ పెంచారు. ఈ సర్వే పూర్తయ్యాకే కులాల వారీ జనాభా ఎంత ఉందో క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ ద్వారా బీసీల సంఖ్యను నిర్ధారించి పంచాయతీ ఎన్నికల్లో ఆ ప్రకారం రిజర్వేషన్లు కల్పించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నది. ఈ ఇంటి సర్వేతో సంక్షేమ పథకాలను మరింతగా జనానికి రూపొందించేందుకు ఉపయోగపడనుంది.

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×