Golden Chariot Luxury Train: భారతీయ రైల్వే సంస్థ తక్కువ టికెట్ ఛార్జీలతో నిత్యం కోట్లాది మంది ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేర్చుతున్నది. తక్కువ టికెట్ ధరతో సౌకర్యవంతమైన ప్రయాణం చేసే అవకాశం ఉండటంతో చాలా మంది సామాన్యులు రైలు ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఓ వైపు పేద ప్రజలకు తక్కువ ధరలో రైలు ప్రయాణాన్ని అందిస్తున్న ఇండియన్ రైల్వే సంస్థ.. అత్యంత లగ్జరీ ప్రయాణాలను కూడా అందిస్తోంది. అందులో భాగంగా ఓ సరికొత్త రైలును పట్టాలెక్కించబోతోంది.
80 మంది మాత్రమే ప్రయాణించే అవకాశం
భారతీయ రైల్వే సంస్థ IRCTCతో కలిసి గోల్డెన్ చారియట్ అనే లగ్జరీ రైలును అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ రైలు 7 స్టార్ హోటల్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. ఈ రైలు డిసెంబర్ 14న బెంగళూరులో పట్టాలు ఎక్కబోతోంది. ఈ రైల్లో 13 డబుల్ బెడ్ క్యాబిన్లు, 26 ట్విన్ బెడ్ క్యాబిన్లతో పాటు దివ్యాంగుల కోసం 1 క్యాబిన్ ఉన్నది. కేవలం 40 క్యాబిన్లతో కూడిన ఈ లగ్జరీ రైలులో 80 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది.
విలాసవంతమైన క్యాబిన్లు
గోల్డెన్ చారియట్ రైలు అత్యంత విలాసవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ రైలులో అన్నీ లగ్జరీ క్యాబిన్లు ఉంటాయి. ప్రతి క్యాబిన్ ఏసీతో పాటు వైఫైని కలిగి ఉంటుంది. అన్ని క్యాబిన్లను కుషన్డ్ ఫర్నిచర్ తో రూపొందించారు. చివరకు బాత్ రూమ్ లు కూడా చాలా లగ్జరీగా ఉంటాయి. అత్యంత సౌకర్యవంతంగా ఉండే బెడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి క్యాబిన్ లో పెద్ద టీవీని ఏర్పాటు చేశారు.
ఘుమఘుమలాడే వంటకాలు
ఇక ఈ రైల్లో ప్రయాణించే వారికి దేశ, విదేశీ వంటకాలను అందుబాటులో ఉంచుతారు. ఇందులో రుచి, నలపాక్ పేరుతో రెండు అద్భుతమైన రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. శాకాహారంతో పాటు మాంసాహార వంటకాలు లభిస్తాయి. అత్యంత విశాలవంతమైన బార్ ఉంటుంది. ఇందులో బెస్ట్, బ్రాండెడ్ వైన్, బీరు, మదీరా దొరుకుతాయి.
స్పెషల్ హెల్త్ స్పా
ఇక ఈ లగ్జరీ రైల్లో స్పా సెంటర్ కూడా ఉంది. ఇందులో స్పా థెరపీతో సహా అనేక స్పాలను ఆనందించే అవకాశం ఉంది. అత్యాధునిక జిమ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రైల్లో ప్రయాణించే వారి భద్రతలకు రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రైలు అంతా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. ఫైర్ అలారమ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఒక్కో టికెట్ ధర రూ. 4 లక్షలు
ఇక గోల్డెన్ చారియట్ రైల్లో 5 రాత్రులు, 6 పగళ్లు గడిపేందుకు ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రైల్లో ఒక్కో టికెట్ ధర రూ. 4,00,530గా నిర్ణయించారు. అదనంగా 5శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
Karnataka’s Luxury Heritage on Wheels!
Step into a world of elegance with the Golden Chariot Luxury Tourist Train, now in a stunning new avatar! Explore Karnataka’s rich culture while enjoying world-class cabins with smart TVs, elegant furnishings, and top-tier security.
Savor… pic.twitter.com/aSU0ax3MJz
— Western Railway (@WesternRly) November 21, 2024
గోల్డెన్ చారియట్ రైళ్ల వివరాలు
⦿ ప్రైడ్ ఆఫ్ కర్నాటక (5 రాత్రులు/6 రోజులు):
బెంగళూరులో ప్రారంభం అయ్యే ఈ రైలు బందీపూర్, మైసూర్, హళేబీడు, చిక్కమగళూరు, హంపి, గోవాకు వెళ్లి తిరిగి బెంగళూరుకు చేరుకుంటుంది.
⦿ జెమ్స్ ఆఫ్ ది సౌత్ (5 రాత్రులు/6 రోజులు):
బెంగళూరు నుంచి ప్రారంభం అయ్యే ఈ రైలు మైసూర్, కాంచీపురం, మహాబలిపురం, తంజావూరు, చెట్టినాడ్, కొచ్చిన్, చేర్యాల వరకు వెళ్లి తిరిగి బెంగళూరుకు చేకుంటుంది.
గోల్డెన్ చారియట్ ప్రయాణాలు
⦿ డిసెంబర్ 14, 2024- ప్రైడ్ ఆఫ్ కర్ణాటక
⦿ డిసెంబర్ 21, 2024 – జెమ్స్ ఆఫ్ ది సౌత్
⦿ జనవరి 4, 2025- ప్రైడ్ ఆఫ్ కర్ణాటక
⦿ ఫిబ్రవరి 1, 2025 – ప్రైడ్ ఆఫ్ కర్ణాటక
⦿ ఫిబ్రవరి 15, 2025 – జెమ్స్ ఆఫ్ ది సౌత్
⦿ మార్చి 1, 2025- ప్రైడ్ ఆఫ్ కర్ణాటక
Read Also: 13 దేశాలను కలిపే ఏకైక రైలు, ప్రపంచంలో ఇదే లాంగెస్ట్ ట్రైన్ జర్నీ!