Lake: హైదరాబాద్‌కు దగ్గర్లో ఉన్న అమీన్‌పూర్ సరస్సు ఒక అద్భుతమైన పర్యాటక గమ్యం. ప్రకృతి ప్రేమికులకు, పక్షి సంరక్షకులకు, ఫోటోగ్రాఫర్లకు ఇది ఒక నీలాకాశం. ఇది ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసుకుందాం!
బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్
2016 నవంబర్‌లో అమీన్‌పూర్ సరస్సు భారతదేశంలోనే మొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది. ఇక్కడ ఫ్లెమింగోలు, బార్-హెడెడ్ గీస్, కొంగలు, కింగ్‌ఫిషర్లు, ఈగ్రెట్లు వంటి 166 రకాల పక్షులు సంచరిస్తాయి.
అంతేకాకుండా ఉడుతలు, బూడిద ముంగీసలు, సరస్సులో చేపలు, 143 రకాల సీతాకోకచిలుకలు, డ్రాగన్‌ఫ్లైలు కూడా ఉంటాయి. వీటితో పాటు 250 రకాల మొక్కలు సరస్సు చుట్టూ పచ్చదనం నిండి ఉంటుంది.
రొమాంటిక్ వాతావరణం
కొండలు, రాతి నిర్మాణాల మధ్య ఉన్న ఈ సరస్సు అద్భుత దృశ్యాలను అందిస్తుంది. తెల్లవారుజామున పొగమంచు, సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఇక్కడి అందం మరోస్థాయిలో ఉంటుంది. పెద్ద అమీన్‌పూర్, చిన్న చెరువు చుట్టూ పంటపొలాలు, కొండలతో మనసు గెలుచుకుంటాయి. జంటలకు, ఫొటో లవర్స్‌కు ఇది స్వర్గం. అందుకే ఇక్కడ తరచుగా ప్రీ వెడ్డింగ్ షూట్‌లు కూడా జరుగుతాయి.
నేచర్ ఫోటోగ్రఫీ
పక్షులను చూడటానికి, ఫోటోలు తీయడానికి అమీన్‌పూర్ సరస్సు ఓ హాట్‌స్పాట్. శీతాకాలంలో (నవంబర్-ఫిబ్రవరి) ఫ్లెమింగోలు, పెలికాన్‌లు, స్పూన్‌బిల్‌లు ఇక్కడికి వస్తాయి. బయా వీవర్స్, రెడ్ అవడవాట్స్, బీ-ఈటర్స్, సీతాకోకచిలుకలు కూడా కనిపిస్తాయి. ఎంట్రీ ఫీజు లేకపోవడం, రద్దీ తక్కువగా ఉండటం ఫోటోగ్రాఫర్లకు కలిసొచ్చే అంశం.
రద్దీ లేని ప్రశాంతత
చాలా టూరిస్ట్ స్పాట్‌లకు భిన్నంగా, ఇక్కడ ఎంట్రీ ఫీజు లేదు, రద్దీ కూడా తక్కువ. 24 గంటలూ ఓపెన్ ఉండే ఈ సరస్సును ఉదయం లేదా సాయంత్రం సందర్శిస్తే అద్భుత అనుభవం. హైదరాబాద్ రద్దీ నుంచి తప్పించుకుని ప్రశాంతంగా గడపడానికి ఇది బెస్ట్.
చరిత్ర
గోల్కొండ రాజ్యం కాలంలో నీటిపారుదల కోసం నిర్మించిన ఈ సరస్సు చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉంది. ఒకప్పుడు పెద్ద గార్డెన్‌కు నీరు అందించిన ఈ సరస్సు చుట్టూ ఇప్పుడు ఫ్యాక్టరీలు, గ్రామాలు, అపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. ఈ మిశ్రమం చరిత్ర, ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది.
ఎలా వెళ్లాలంటే?
అమీన్‌పూర్ మెయిన్ రోడ్‌లో ఆర్చ్ ద్వారా సరస్సుకు సులభంగా చేరుకోవచ్చు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, ఓల్డ్ బాంబే హైవే (NH-9), మియాపూర్, బాచుపల్లి రోడ్ల ద్వారా హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ బాగుంది. మియాపూర్ మెట్రో స్టేషన్ (8 కి.మీ), లింగంపల్లి రైల్వే స్టేషన్ (5 కి.మీ) దగ్గర్లో ఉన్నాయి. క్యాబ్‌లు, బైక్ షేరింగ్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి.