Versaries Spoil Relation| ఒకప్పుడు పెళ్లి రోజు, పుట్టినరోజు వంటి వేడుకలు సంవత్సరానికి ఒకసారి జరిగేవి. కానీ, ఈ రోజుల్లో చిన్న చిన్న సందర్భాలు కూడా వేడుకలుగా మారాయి. 1, 3, లేదా 6 నెలలు కలిసి ఉండటం కూడా కొందరికి జరుపుకోవడానికి కారణం. తొలిసారి కలిసిన రోజు, మొదటి ముద్దు, కలిసి వంట చేసిన రోజు, లేదా ఇన్‌స్టాగ్రామ్ పాస్‌వర్డ్ షేర్ చేసిన రోజు—ఏదైనా సెలబ్రేషన్‌కు ఒక తేదీ అవుతుంది. ఏదైనా సందర్భం వేడుకకు కారణం కావచ్చు, అది అసలైన వార్షికోత్సవం కాకపోయినా సరే!
దీన్ని “ఆర్బిట్రరీ-వర్సరీ” అంటారు, అంటే చిన్న చిన్న జ్ఞాపకాలను జరుపుకోవడం. పాలియామరీ నిపుణురాలు లారా బోయిల్ ఈ పదాన్ని సృష్టించారు. “ఈ వేడుకలు మీరు ప్రేమించే వ్యక్తితో సమయాన్ని సరదాగా గుర్తుంచుకోవడానికి ఒక మార్గం,” అని ఆమె చెప్పారు. అవి తమాషాగా, మధురంగా, లేదా యాదృచ్ఛికంగా ఉన్నా, కలిసి ఆనందించడమే లక్ష్యం.
ఇవి తప్పని సరినా?
లారా బోయిల్ తన బ్లాగ్‌లో, జీవితంలో బిజీ షెడ్యూల్‌లో అసలు వార్షికోత్సవాలను మర్చిపోయినా, ఈ చిన్న జ్ఞాపకాలను జరుపుకోవచ్చని చెప్పారు. ఉదాహరణకు, “అసలు వార్షికోత్సవం కాకపోయినా, ‘మన మొదటి ముద్దు జ్ఞాపకం’ అని సందేశం పంపుతాను,” అని ఆమె రాసారు.
ఈ చిన్న వేడుకలు సంబంధాన్ని మరింత ఆనందమయం చేస్తాయా లేక సంక్లిష్టం చేస్తాయా? వార్షికోత్సవాలు గుర్తుంచుకోవడం అవసరమా అనే ప్రశ్నపై ఫోకస్ వస్తే.. దీనికి సమాధానం అవసరం లేదు అనే తెలుస్తుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తేదీల కంటే నిజమైన శ్రద్ధ, ప్రేమ, అర్థం చేసుకోవడం ముఖ్యం. కొందరికి ఈ చిన్న సందర్భాలు సంబంధాన్ని బలపరుస్తాయి, మరికొందరికి తేదీలను గుర్తుంచుకోవడం ఒక భారంలా అనిపిస్తుంది. సైకోథెరపిస్ట్ డాక్టర్ చాంద్నీ తుంగైత్ ఈ విషయంపై స్పందిస్తూ.. “మీ భాగస్వామికి నిరంతరం మీ ప్రేమను అందిస్తూ.. వారు ఏమైనా చెప్పాలనుకుంటే శ్రద్ధగా వింటూ, వారితో నాణ్యమైన సమయం గడిపడం ముఖ్యం అంతే కానీ కచ్చితమైన తేదీలు ముఖ్యం కాదు.రోజూ ప్రేమను చూపించే బదులు.. తమ ప్రేమపై నమ్మకం కలిగించడం ముఖ్యం.” అని చెప్పారు.
ఇవి సంబంధాన్ని సులభతరం చేస్తాయా?
ఈ చిన్న వేడుకలు ఒత్తిడిని తగ్గిస్తాయి. అసలు వార్షికోత్సవం మర్చిపోయినా.. ఒక సరదా జ్ఞాపకాన్ని జరుపుకోవచ్చు. బిజీ జీవితంలో ఈ చిన్న క్షణాలు ప్రేమను రిఫ్రెష్ చేస్తాయి. డాక్టర్ తుంగైత్ ప్రకారం.. ఈ చిన్న ఆచారాలు మీ భావోద్వేగాలను బలపరుస్తాయి. “ఈ వేడుకలు సంతోషకరమైన జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి. చిన్న చిన్న వేడుకలు మీ సంబంధానికి ప్రత్యేక భాషను సృష్టిస్తాయి, ఒత్తిడిలో కూడా మిమ్మల్ని కనెక్ట్ చేస్తాయి. అవి అలానే ఉండాలి. కానీ మితిమీరి భారం కాకూడదు.” అని ఆమె చెప్పారు.
సమస్య ఏంటంటే..
ఈ వేడుకలు అన్ని సమస్యలను పరిష్కరించవు. పుట్టినరోజు తేదీలు లేదా తల్లిదండ్రుల వార్షికోత్సవాలు గుర్తుంచుకోవడం కష్టమైతే, ఈ చిన్న తేదీలు ఒత్తిడిని పెంచవచ్చు. ఒకవేళ ఇవి బలవంతంగా మారితే, సహజమైన ప్రేమ కోల్పోవచ్చు. ఒక భాగస్వామి ఈ వేడుకలపై ఆధారపడితే, అది నమ్మకం లేదా సాన్నిహిత్య సమస్యలను సృష్టించవచ్చు.
Also Read: నల్ల మచ్చలు లేని మెరిసే చర్మం కావాలా.. ఈ జ్యూస్‌తో ఖర్చు లేకుండా
పరిష్కారం ఏంటి?
ఈ చిన్న వేడుకలు సహజంగా.. ఒత్తిడి లేకుండా జరిగితే బాగుంటాయి. నిజాయితీ, భావోద్వేగ బంధం, నిరంతర ప్రయత్నాలను ఇవి భర్తీ చేయకూడదు. “ప్రతి క్షణాన్ని వేడుకగా మార్చకండి. కొన్ని అర్థవంతమైన, సరదా క్షణాలను ఎంచుకోండి,” అని డాక్టర్ తుంగైత్ సూచిస్తున్నారు. చిన్న ఆనందాలు మీ సంబంధాన్ని సుసంపన్నం చేస్తాయి, కానీ నిజమైన ప్రేమే అసలైన ఆధారం.