BigTV English

Visakhapatnam YogAndhra: యోగాంధ్ర వరల్డ్ రికార్డుకు సిద్దం.. ఆర్కే బీచ్‌ వద్ద భారీ ఏర్పాట్లు

Visakhapatnam YogAndhra: యోగాంధ్ర వరల్డ్ రికార్డుకు సిద్దం.. ఆర్కే బీచ్‌ వద్ద భారీ ఏర్పాట్లు

ఆర్కే బీచ్ లో ఏర్పాట్లు పరిశీలించిన సీఎం

జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా విశాఖ రెడీ అవుతోంది. ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని మోడీ రానుండడంతో ఆర్కే బీచ్‌ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి సూచనలు చేశారు చంద్రబాబు. భారీ ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తుండటంతో బీచ్‌ రోడ్డు వెంబడి ఏర్పాట్లు పరిశీలించారు. వీఐపీల భద్రతా ఏర్పాట్లపై అధికారులు సీఎంకు వివరించారు. ఆ తర్వాత నోవాటెల్‌ హోటల్‌కు వెళ్లి అక్కడే అధికారులతో సమీక్షించారు. పీఎంపాలెంలోని వైజాగ్‌ కన్వెన్షన్స్‌ సెంటర్‌లో టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని.. యోగా వేడుకలకు జన సమీకరణ విషయంలో చేపట్టాల్సిన అంశాలపై నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.


జూన్ 21న చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం

ప్రపంచానికి భారత దేశం ప్రసాదించిన దివ్య వరం యోగా అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యాన్నే కాకుండా ఆయుష్షును పెంచే యోగా మన జీవన విధానం కావాలన్నారు. ఈ నెల 21న విశాఖపట్నంలో 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు. యోగాను జీవితంలో భాగం చేసుకుని, ఆరోగ్యంగా జీవిద్దాం అని సీఎం పిలుపునిచ్చారు. యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు సీఎం చంద్రబాబు.

ఏపీ వ్యాప్తంగా 2 కోట్లమందితో పాల్గొనేలా ప్రణాళికలు

ఇంటర్నేషనల్ యోగా డే గురించి వైజాగ్ లో నిర్వహణ గురించి, ఇటీవలే నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో ప్రధానికి సీఎం చంద్రబాబు వివరించారు. యోగా నెల నిర్వహణ, ప్రజలకు యోగాలో ట్రైనింగ్, సర్టిఫికెట్ల జారీ, యోగా దినోత్సవంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, సామాన్యులు, సెలబ్రిటీలను భాగస్వామ్యం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 5 లక్షల మందితో రికార్డు స్థాయిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే రోజు ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి సుమారు 2 కోట్లమంది పాల్గొనేలా ప్రణాళికలు రెడీ చేశారు. విశాఖలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగే యోగా డే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఇతర రాష్ట్రాల సీఎంలనూ చంద్రబాబు ఇప్పటికే ఆహ్వానించారు.

యోగా డే నాడు 10లక్షల యోగా సర్టిఫికెట్ల జారీ లక్ష్యం

విశాఖలో యోగా డే సందర్భంగా కనీసం 10 లక్షల మందికిపైగా యోగా సర్టిఫికెట్లు ఇవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖలో 5 లక్షల మందితో ఆర్కే బీచ్‌ నుంచి భోగాపురం వరకు కార్యక్రమం చేపట్టనున్నారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు యోగా డే కార్యక్రమం ఉండనుంది. ఇటీవలే యోగాంధ్ర వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు సీఎం. అందరి జీవితాల్లో యోగా భాగం కావాలని, ఒత్తిడి నుంచి రిలీఫ్ కావాలంటే యోగా సాధన చేయాలని, పాఠశాలల్లోనూ ఇక నుంచి రోజూ ఒక గంట యోగా చేపట్టేలా సీఎం ఆదేశాలిచ్చారు.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×