Udhampur-Srinagar-Baramulla Rail Link: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ఫైనల్ ట్రాక్ నిర్మాణం పూర్తయినట్లు కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. భారతీయ రైల్వేలో ఇదో చారిత్రాత్మక మైల్ స్టోన్ గా అభివర్ణించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. కాశ్మీర్, దేశంలోని ఇతర ప్రాంతాలు మధ్య నేరుగా రైల్వే కనెక్షన్ ని మెరుగు పర్చాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో కీలకమైన దశ పూర్తి కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. “ఇదో చారిత్రక మైలురాయి. ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ చివరి ట్రాక్ పనులు పూర్తయ్యాయి. శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం దిగువన కట్రా నుంచి రియాసికి అనుసంధానం చేసే 3.2 కి.మీ పొడవైన టన్నెల్ T-33 కోసం బ్యాలస్ట్-లెస్ ట్రాక్ వర్క్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యింది” అని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు.
జనవరిలో న్యూఢిల్లీ-కాశ్మీర్ డైరెక్ట్ రైలు ప్రారంభం
దేశంలోని రైల్వే కనెక్షన్లలో ముఖ్యమైన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ మీదుగా జనవరి 2025లో న్యూఢిల్లీ నుంచి కాశ్మీర్ వరకు నేరుగా వెళ్లే రైలు ప్రారంభం కానుంది. వందే భారత్ మూడవ వెర్షన్ అయిన స్లీపర్ రైలు ఈ రూట్ లో తొలిసారి అందుబాటులోకి రానుంది. న్యూఢిల్లీ-శ్రీనగర్ వందేభారత్ స్లీపర్ రైలు 800 కిలో మీటర్ల దూరాన్ని కేవలం 13 గంటల్లో చేరుకోనుంది. వచ్చే నెలలో రియాసి- కత్రా మధ్య 272 కిలో మీటర్ల ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (USBRL) ప్రాజెక్టుకు సంబంధించి చివరి 17 కిలో మీటర్లను ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు. USBRL ప్రాజెక్ట్ ద్వారా కాశ్మీర్, ఢిల్లీ మధ్య నేరుగా వందే భారత్ రైళ్లు ప్రారంభించడం వల్ల దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఈ ప్రాంతానికి కనెక్టివిటీ మెరుగుపడనుంది. లాజిస్టికల్ సమస్యలను పరిష్కరించడంతో పాటు, ఆర్థిక విస్తరణనకు ఉపయోగపడనుంది. ఈ రైల్వే లింక్ ద్వారా ఢిల్లీ, శ్రీనగర్‌లను కలుపుతూ ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లాకు చేరుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి కూడా ఈ మార్గంలోనే భాగంగా ఉంటుంది.
Historic milestone; Final track work on the Udhampur-Srinagar-Baramulla Rail link is complete.
The ballast-less track work for the 3.2 km-long Tunnel T-33, located at the foothills of Shri Mata Vaishno Devi Shrine and connecting Katra to Reasi, was successfully completed today… pic.twitter.com/VUZTTi61A7
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 13, 2024
ఢిల్లీ-శ్రీనగర్ రైల్వే మార్గం గురించి..
పీవీ నర్సింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 1995లో USBRL ప్రాజెక్టును రూ. 2,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రాథమికంగా మంజూరు చేశారు. ఆ తర్వాత 2002లో ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. ఈ లింక్ నిర్మాణం. 2009 వరకు బారాముల్లా-ఖాజిగుండ్ మధ్య 118 కిలోమీటర్ల విస్తరణ పూర్తయింది. 2013లో ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ లింక్ ను బనిహాల్ వరకు పొడిగించారు. 2014లో ఉదంపూర్-కత్రా సెగ్మెంట్ ప్రారంభించబడింది. 2023లో బనిహాల్-సంగల్దాన్ నడుమ లింక్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ. 35,000 కోట్లకు పైగా ఖర్చు చేశారు.
న్యూఢిల్లీ-కాశ్మీర్ వందేభారత్ స్లీపర్ రైలు టికెట్ల ధరలు
న్యూఢిల్లీ- కాశ్మీర్ వరకు సుమారు 800 కిలో మీటర్ల దూరాన్ని వందేభారత్ స్లీపర్ రైలు 13 గంటల్లో చేరుకోనుంది. ఈ రైలు న్యూఢిల్లీ నుంచి సాయంత్రం 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు శ్రీనగర్ చేరుకుంటుంది. ఇక ఈ రైలుకు సంబంధించి టికెట్ల ధర విషయాని వస్తే.. AC 3 టైర్ (3A) టికెట్ ధర సుమారు రూ. 2,000 ఉంటుంది. టూ-టైర్ AC (2A) టికెట్ ధర దాదాపు రూ. 2,500 ఉంటుంది. AC క్లాస్ I (1A) ధర దాదాపు రూ. 3,000 ఉంటుంది.
Read Also: టికెట్లతోనే కాదు.. క్యాన్సలేషన్‌తో కూడా డబ్బులే డబ్బులు.. ఎంత వస్తుందంటే?