ఒకప్పుడు ఎయిర్ ఇండియా అంటే ప్రయాణీకులలో ఎంతో నమ్మకం ఉండేది. ఈ సంస్థకు చెందిన విమానాలు ఎక్కితే అత్యంత సేఫ్ గా గమ్యస్థానానికి చేరుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ, గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే, ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం అంటేనే భయంతో వణికిపోయే పరిస్థితి నెలకొంది. అహ్మదాబాద్ దుర్ఘటన తర్వాత ఆ సంస్థపై ప్రయాణీకులలో రోజు రోజుకు నమ్మకం సడలుతోంది. తాజాగా జరిగిన ఓ ఘటన గురించి ప్రయాణీకులు సోషల్ మీడియా వేదికగా షాకింగ్ విషయాలు వెల్లడించాడు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
జూలై 2న ఎయిర్ ఇండియా విమానంలో వెళ్లేందుకు ఓ ప్రయాణీకుడు ఢిల్లీ నుంచి వాషింగ్టన్ డీసీకి టికెట్ బుక్ చేసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసి షాకయ్యాడు. ఏకంగా 72 గంటల ప్రత్యక్ష నరకం అనుభవించినట్లు వెల్లడించాడు. ఎయిర్ పోర్టులో చెక్ ఇన్ సరిగానే ఉన్నా, విమానం 15 నిమిషాలు ఆలస్యంగా బయల్దేరింది. కాసేపటికే అసలు సమస్యలు మొదలయ్యాయి. విమానంలో ఎంటర్ టైన్ మెంట్ వ్యవస్థ పని చేయడం మానేసింది. దానికి ప్రత్యామ్నాయంగా వ్యక్తిగత గాడ్జెట్స్ ఉపయోగించుకుందామనుకున్నా స్ట్రీమింగ్ సర్వీస్ సపోర్టు చేయలేదు. ఏం చేయాలో అర్థంకాక, నిద్రపోయేందుకు ప్రయత్నంచాడు.
సాకేంతిక సమస్యల, చివరకు క్యాన్సిల్
దారి పొడవునా విమానంలో సమస్యలు కొనసాగాయి. ఇంధనం నింపేందుకు విమానం వియన్నాలో ఆగింది. అక్కడ సిబ్బంది మారారు. అదే సమయంలో విమానంలో సాంకేతిక లోపం కారణంగా షట్ డౌన్ తో పాటు రీబూట్ చేయాల్సి వచ్చింది. ఇందుకోసం సుమారు 20 నిమిషాల సమయం పడుతుంది. కానీ, గంటపాటు పొడిగించారు. చివరకు విమానం క్యాన్సిల్ చేస్తున్నట్లు సిబ్బంది ప్రకటించారు. ఈ ప్రకటనతో ప్రయాణీకులు గందరగోళానికి గురయ్యారు. ముఖ్యంగా ముసలి వాళ్లు, ఇంగ్లీష్ అర్థం చేసుకోని వాళ్లు ఇబ్బందులు మరింత దారుణంగా ఉన్నాయి. వారికి సాయం చేసేందుకు కనీసం ఎయిర్ ఇండియా సిబ్బంది అందుబాటులో లేరు.
Read Also: నార్త్ కొరియా ట్రేడ్ ఫెయిర్ టూర్.. వాళ్లకు మాత్రం నో ఎంట్రీ? ఎవరు చూస్తారు?
వసతి కల్పించడంలోనూ ఇబ్బందులు
విమానంలోని ప్రయాణీకులకు 200 హోటల్ గదులు ఇవ్వాల్సి ఉన్నా, చివరకు 25 ఇచ్చారు. చాలా మంది ప్రయాణీకులు ఫోల్డబుల్ బెడ్లపై టెర్మినల్ లోనే నిద్రించాల్సి వచ్చింది. ఖరీదైన విమానాశ్రయ రెస్టారెంట్లలో భోజనం కూడా చీప్ క్వాలిటీ ఫుడ్ కు కూపన్లు ఇచ్చారు. 24 గంటల తర్వాత, ఎమిరేట్స్ విమానంలో ప్రయాణీకులను గమ్యస్థానానికి చేరేలా నిర్ణయం తీసుకున్నారు. 72 గంటల తర్వాత వాషింగ్టన్ చేరుకున్నారు. చివరకు సదరు ప్రయాణీకుడికి సంబంధించిన బ్యాగులలో ఒకటి పోయింది. తిరుగు ప్రయాణంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురయ్యిందని ప్రయాణీకుడు వెల్లడించాడు. ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ఒక రోజు ముందుగానే విమానం తిరిగి షెడ్యూల్ చేయబడినట్లు చెప్పాడు. ఎయిర్ ఇండియా సర్వీసులు చాలా దారుణంగా ఉన్నాయన్నాడు. సిబ్బంది దగ్గర జవాబుదారీతనం అస్సలు లేదన్నాడు. వారి కారణంగా దేశం కాని, దేశంలో నానా అవస్థలు పడాల్సి వచ్చిందని మండిపడ్డాడు.
Read Also: కాచిగూడ- తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు, ఇతర రూట్లలో కూడా!