Air India Express Flash Sale: సమ్మర్ వేళ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సూపర్ ఆఫర్ ప్రకటించింది. బస్ టికెట్ ధరకే విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది. ఫ్లాష్ సేల్ పేరుతో అదిరిపో ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ రేపటి వరకే (జూన్ 18)ఉంటుందని వెల్లడించింది. సమ్మర్ సీజన్ లో ప్రయాణం చేయాలనుకునే వారి కోసం ఈ ఆఫర్ ను తీసుకొచ్చినట్లు తెలిపింది.
రూ. 1300కే విమాన ప్రయాణం
ఫ్లాష్ సేల్ లో భాగంగా జస్ట్ రూ. 1300కే విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది. జీరో కన్వీనియెన్స్ ఫీ కూడా ఇస్తోంది. అయితే, ఈ టికెట్లను ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ అధికారిక వెబ్ సైట్ లేదంటే మోబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. ఇక ఈ లిమిటెడ్ టైమ్ ఫ్లాష్ ఆఫర్ కు సంబంధించి టికెట్ల బుకింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. మే 18 వరకు టికెట్ల బుకింగ్ కు అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రకటించింది. తక్కువ ధరకే విమాన ప్రయాణం చేసే అవకాశం ఉండటంతో టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయాణీకులు ఎగబడుతున్నారు.
సెప్టెంబర్ వరకు ప్రయాణించే అవకాశం
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లాష్ ఆఫర్ లో టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణీకులు జూన్ 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ ఆఫర్ ను రెండు రకాలుగా అందిస్తోంది. ఇందులో ఒకటి ఎక్స్ ప్రెస్ లైట్ కాగా, మరొకటి ఎక్స్ ప్రెస్ వ్యాల్యూ. ఈ రెండింటిలో పలు రకాల ఆఫర్లు ఉన్నాయి. ఎక్స్ ప్రెస్ లైట్ లో రూ.1300 లకే విమాన టికెట్లు పొందే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా జీరో చెక్ ఇన్ బ్యాగేజీ అందిస్తోంది. ఎలాంటి ఖర్చు లేకుండా 3 కిలోల క్యాబిన్ బ్యాగేజీ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. చెక్ ఇన్ బ్యాగేజీలపై దేశీయ విమానాల్లో 15 కిలోల రూ.1000 ఛార్జ్ చేస్తారు. అంతర్జాతీయ విమానాల్లో 20 కిలోలకు రూ.13000 పే చేయాల్సి ఉంటుంది. ఇక వాల్యూ ఫేర్ లో రూ. 1524కే టికెట్లు అందిస్తోంది. అన్ని బుకింగ్ ప్లాట్ ఫామ్స్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
This is your sign to book that trip!
Our Flash Sale is live.
✔️ Xpress Lite fares from ₹1300 + no convenience fee
✔️ Xpress Value fares from ₹1524
📅 Book by 18 May 2025.
🛫 Travel between 1 Jun – 15 Sep 2025. pic.twitter.com/bYaxHjzNZp— Air India Express (@AirIndiaX) May 14, 2025
Read Also: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ ప్లేస్ కు వెళ్లడం అస్సలు మిస్ కాకండి!
సమ్మర్ టూర్ ప్లాన్ చేసే వారికి..
సమ్మర్ లో టూర్ ప్లాన్ చేసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్ తీసుకొచ్చినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. తక్కువ ధరకే ఫ్యామిలీతో కలిసి వెళ్లేలా ఈ ప్లాన్ రూపొందించినట్లు వెల్లడించింది. అటు తమ లాయల్టీ సభ్యులకు సమ్మర్ వేళ మరిన్ని ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపింది. ఎక్స్ ప్రెస్ బిజినెస్ ఫేర్స్, అప్ గ్రేడ్స్ మీద ఏకంగా 25 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది.
Read Also: ఆకాశంలో అద్భుత నిర్మాణం, చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!