Air India flights: అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా అలర్ట్ అయ్యింది. ఈ ఘటన నుంచి బయటపడక ముందే సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో పలు దేశీయ, అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది ఆ సంస్థ.
అహ్మదాబాద్ విమానం ఘటన నుంచి ఇప్పటిడప్పుడే ఎయిరిండియా కోలుకుంటోంది. ఈ ఘటన తర్వాత ఆ సంస్థకు చెందిన పలు విమానాలకు సాంకేతిక సమస్యలు మొదలయ్యాయి. దీంతో ప్రయాణికుల్లో కలవరం మొదలైంది. నిర్వహణ సమస్యలు మొదలయ్యాయి. ఈ కారణంగా పలు విమాన సర్వీసులు ఆలస్యంగా వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఎనిమిది విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది ఎయిరిండియా. మెయింటెనెన్స్, కార్యాచరణ సమస్యల కారణంగా రద్దు చేసినట్లు తెలిపింది. జులై రెండో వారం వరకు కొన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్లు తెలిపింది. 16 అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులను తగ్గించింది.
జూన్ 21 నుంచి జులై 15 వరకు ఈ సర్వీసుల తగ్గింపు కొనసాగుతుందని పేర్కొంది. వాటిలో ఉత్తర అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియాల్లోని ప్రధాన నగరాలకు వెళ్లే సర్వీసులపై ఈ ప్రభావం పడనుంది. ఢిల్లీ-నైరోబి, అమృత్‌సర్-లండన్, గోవా-లండన్ సర్వీసులను వచ్చే నెల 15 వరకు నిలిపి వేస్తున్నట్లు వెల్లడించింది.
ALSO READ: ఆస్ట్రేలియా షోలో హైదరాబాదీ వంటకం, సెలబ్రిటీ చెఫ్ సారా టోడ్ ఫిదా
బోయింగ్ 777 విమానాల్లో తనిఖీలు, ఇరాన్ తన గగనతలాన్ని మూసివేయడం వంటి కారణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. తగ్గింపుల వల్ల ప్రభావితమైన ప్రయాణీకులకు ఎయిరిండియా క్షమాపణలు చెప్పింది.
శుక్రవారం రద్దయిన పలు ఎయిరిండియా విమానాలను ఒక్కసారి చూద్దాం.
దేశీయ విమానాలు
AI874- పుణె నుంచి ఢిల్లీ
AI456- అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ
AI2872- హైదరాబాద్ నుంచి ముంబై
AI571- చెన్నై నుంచి ముంబై
అంతర్జాతీయ విమానాలు
AI906- దుబాయ్ నుంచి చెన్నై
AI308- ఢిల్లీ నుంచి మెల్‌బోర్న్
AI309- మెల్ బోర్న్ నుంచి ఢిల్లీ
AI2204- దుబాయ్ నుంచి హైదరాబాద్ సర్వీసులు ఉన్నాయి. మరిన్ని వివరాలకు ప్రయాణికులు ఎయిరిండియా సంస్థకు ఫోన్ చేసి సంప్రదించవలెను.
Further to the press statement released yesterday, 18 June 2025, which announced a temporary reduction in services operated by Boeing 787 and 777 aircraft, we wish to provide details on the flights affected.
These reductions will be effective from 21 June 2025,…
— Air India (@airindia) June 19, 2025