shubhman gill: 5 టెస్ట్ ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లిన భారత జట్టు నేడు మొదటి టెస్ట్ ఫైట్ కి సిద్ధమైంది. భారత్ – ఇంగ్లాండ్ మధ్య నేడు {శుక్రవారం} నుండి లీడ్స్ లోని హెడింగ్లీ లో మొదటి టెస్ట్ ప్రారంభం కాబోతోంది. ఈ టెస్ట్ తో శుభ్ మన్ గిల్ తన టెస్ట్ కెప్టెన్సీని మొదలు పెట్టబోతున్నాడు. కెప్టెన్ గా మొదటి టెస్ట్ గెలవాలి అనే ఒత్తిడి గిల్ పై ఉంది. అందువల్ల గిల్ కి ఇది ఓ అగ్నిపరీక్ష లాంటిది.
2007 తర్వాత తొలిసారిగా ఇంగ్లాండ్ లో టెస్ట్ సిరీస్ గెలవాలని భారత్ చూస్తోంది. చివరిసారిగా రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో విజయం సాధించింది భారత్. ఇప్పడు సిరీస్ విజయాల కరువును అంతం చేయడం గిల్ ముందున్న సవాల్. ఇక ఈ తొలి టెస్ట్ కోసం ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే తమ ప్లేయింగ్ 11 ని ప్రకటించగా.. భారత్ మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇక ఈ సిరీస్ గెలుపొందేందుకు నూతన కెప్టెన్ గిల్ తీవ్ర కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం.
ఈ టెస్ట్ సిరీస్ గెలిచి కప్పును ఎగరేసుకుపోవాలని గిల్ చాలా కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ టూర్ లో గిల్ డైట్ అలాగే ఫిట్నెస్ ప్లాన్ ల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంగ్లాండ్ లో గిల్ ఉదయం 5:00 గంటలకే నిద్రలోనుండి మేల్కోవడం, 5:15 గంటలకు మెడిటేషన్, 5:30 గంటలకు జాగింగ్, 6:00 గంటలకు క్రికెట్ ప్రాక్టీస్, 9:00 గంటలకు ఐస్ వాటర్ లో స్నానం, 9:30 గంటలకు బ్రేక్ ఫాస్ట్, 10:00 గంటలకు రీడింగ్, 10:30 గంటలకు ఈ టెస్ట్ సిరీస్ కోసం స్ట్రాటజిక్ ప్లానింగ్, 11:30 గంటలకు జట్టు సభ్యులతో సమావేశాలు వంటివి చేస్తున్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టు ఆడుతున్న మొదటి టెస్ట్ సిరీస్ ఇదే. ఈ సిరీస్ ని కోచ్ గౌతమ్ గంభీర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. యువ కెప్టెన్ గిల్ తో కూడిన టీం ఇండియా ఎలా ప్రదర్శిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇప్పటివరకు తమ జట్టును ప్రకటించలేదు.
టీమిండియా జట్టు అంచనా:
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, {గిల్ కెప్టెన్}, రిషబ్ పంత్ {వైస్ కెప్టెన్}, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ కృష్ణ/ నితీష్ రానా.
ఇంగ్లాండ్ జట్టు:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.