BigTV English
Advertisement

Hyd Iconic Desert: ఆస్టేలియా షోలో హైదరాబాదీ వంటకం.. సెలబ్రిటీ చెఫ్ సారా టోడ్ ఫిదా, ఇది చదివితే నోట్లో నీళ్లు ఊరతాయ్!

Hyd Iconic Desert: ఆస్టేలియా షోలో హైదరాబాదీ వంటకం.. సెలబ్రిటీ చెఫ్ సారా టోడ్ ఫిదా, ఇది చదివితే నోట్లో నీళ్లు ఊరతాయ్!

హైదరాబాద్ ఫుడ్స్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతున్నాయి. ప్రముఖ చెఫ్‌లు, సెలబ్రిటీలు, పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఐకానిక్ హైదరాబాద్ బిర్యానీ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలి మరిన్ని హైదరాబాదీ ఫుడ్స్.. ఫుడ్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.  తాజాగా అప్రికాట్ డిలైట్(కుబానీ కా మీఠా) బాగా పాపులర్ అవుతోంది. ఈ డెజర్ట్ హైదరాబాదీ వేడుకల్లో ప్రత్యేకంగా అందిస్తారు.  ఇప్పుడు, ఈ డెజర్ట్ సెలబ్రిటీ చెఫ్ సారా టాడ్ కారణంగా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది.  ఆస్ట్రేలియా షోలో దీనిని ఫుడ్ లవర్స్ కు పరిచయం చేసింది సారా.


సారా టాడ్ ఆప్రికాట్ డిలైట్ వెర్షన్

‘మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా: బ్యాక్ టు విన్’ తాజా ఎపిసోడ్‌ లో,  తన పోటీ వంటలకు ధీటుగా సారా టాడ్ అప్రికాట్ డిలైట్‌ ను  రూపొందించింది. ఈ వంటకంలో మాండరిన్, ఆప్రికాట్ సోర్బెట్, బోర్బన్, మాండరిన్,  వైట్ చాక్లెట్ చాంటిల్లీ, దాల్చిన చెక్క, చక్కెర, కాల్చిన నెక్టరైన్‌లు, ఆప్రికాట్ రోజ్‌ మేరీ సాస్, బాదం కేక్ తో కలిపి దీనిని రూపొందించింది. ఇది ఆప్రికాట్లు, కస్టర్డ్, కేక్, క్రీమ్  లేయర్స్ తో హైదరాబాదీ డెజర్ట్ ఆహా అనిపించింది. షోలో భాగంగా షో జడ్జి ఆండీ అల్లెన్ ఈ వంటకం  వెనుక ప్రేరణ ఏంటి అని అడిగారు. టాడ్ అప్రికాట్ డిలైట్ అనేది హైదరాబాద్ వీధుల్లో సాధారణంగా కనిపించే డెజర్ట్ అని వివరించింది. ఆమె డెజర్ట్ వెర్షన్‌కు మంచి ఆదరణ లభించింది. జీన్-క్రిస్టోఫ్ నోవెల్లి ఈ వంటకాన్ని అద్భుతం అంటూ ప్రశంసించారు. ఆండీ అల్లెన్ దీనిని  మిలియన్ బక్స్ గా అభివర్ణించారు. ఎపిసోడ్ ప్రసారం అయిన తర్వాత సారా ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఈ డెజర్ట్ గురించి ఓ పోస్టు పెట్టింది. “ఖుబానీ కా మీఠా (ఆప్రికాట్ డిలైట్) నేను ఇండియన్ డెజర్ట్ లో అత్యంత ఇష్టపడే ఐటెమ్ గా అభివర్ణించింది.


Read Also: ఈ రైళ్లలో వెళ్తే హిమాలయాలను చూడొచ్చు.. ఎప్పటికీ మరిచిపోలేరు!

హైదరాబాద్ మీద సారాకు మక్కువ ఎక్కువే!  

సారా టాడ్‌ కు హైదరాబాద్‌ తో అనినాభావ సంబంధం ఉంది. ఇప్పటికి ఆమె హైదరాబాద్ ను చాలాసార్లు సందర్శించింది.  ఈ స్ట్రీట్ ఫుడ్ ను చాలాసార్లు రుచి చూసింది. చార్మినార్ సమీపంలోని స్థానిక అమ్మకం దారులతో ఈ ఫుడ్ గురించి తెలుసుకుంది. అంతేకాదు, ఇరానీ చాయ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. భారతీయ వంటకాలపై ఆమెకు చాలా ఆసక్తి ఉంది.   హైదరాబాద్‌ ను ఫుడ్స్ ను ఆమె తరచుగా ట్రై చేస్తుంటుంది. మాస్టర్‌ చెఫ్ ఆస్ట్రేలియా ప్రోగ్రాంలో ఆప్రికాట్ డిలైట్‌ను రూపొందించింది. చెఫ్‌ గా తాజాగా ఈ డెజర్ట్ ను రీ క్రియేట్ చేయడం పట్ల హైదరాబాదీల పట్ల ప్రశంసలు లభిస్తున్నాయి. హైదరాబాదీ ఫుడ్ కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నారు.

https://www.instagram.com/sarahtodd/p/DLCg1R0IqA-/

Read Also: హైదరాబాద్ లో ఉన్నారా? ఈ ప్లేస్ కు వెళ్లకపోతే వేస్టే.. ఎక్కడ ఉందంటే?

 

Related News

Train PNR Status: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

AP Family Tour: ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఏపీలోని ఈ ప్లేస్‌‌లపై ఓ లుక్కేయండి !

Assam Temple darshan: రూ.7వేలకే అస్సాం పవిత్ర యాత్ర.. కామాఖ్య, ఉమానంద ఆలయ దర్శనం ప్యాకేజ్ వివరాలు

Vande Bharat Trains: వందే భారత్ చూసి విదేశీయులే ఆశ్చర్యపోతున్నారు.. మోడీ కీలక వ్యాఖ్యలు!

Northeast India Tour: ఇండియాలోనే చూపు తిప్పుకోలేని అందాలు.. దీని ముందు వరల్డ్ టూర్ వేస్ట్ !

Vande Bharat: వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Free Travel: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!

Miniature Train: ఇది దేశంలోనే తొలి సోలార్ పవర్ ట్రైన్.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?

Big Stories

×