SCR Special Trains: ప్రయాణీకుల రద్దీ పెరిగిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పలు కీలక మార్గాల్లో మొత్తం 48 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. జులై 9 నుంచి సెప్టెంబర్ 25 మధ్య ఈ ప్రత్యేక సర్వీసులు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు ప్రకటించారు.
ప్రత్యేక రైళ్లు ఏ మార్గాల్లో నడుస్తాయంటే?
సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించిన ఈ ప్రత్యేక రైళ్లు రద్దీ రూట్లలో నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా తిరుపతి- హిసార్ మధ్య 12 రైళ్లను నడపనున్నట్లు వెల్లడించారు. ఈ రైళ్లు ప్రతి బుధ, ఆది వారాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. అటు కాచిగూడ- తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు తెలిపారు. ఈ రైళ్లు ప్రతి గురు, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. అటు నర్సాపూర్, అరుణాచలం మధ్య ఏకంగా 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు ప్రతి బుధ, గురు వారాల్లో నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు.
Read Also: 180 ఏళ్లు నడిచిన రాయల్ రైలుకు గుడ్ బై, చివరి స్టాప్ కు చేరేది ఎప్పుడంటే?
ప్రత్యేక రైళ్లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం
సౌత్ సెంట్రల్ రైల్వే నడిపించే 48 ప్రత్యేక రైళ్లకు సంబంధించి ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణీకులు ఈ ప్రత్యేక రైళ్లను ఉపయోగించుకుని ఆహ్లాదకరంగా ప్రయాణాలు కొనసాగించాలని సూచించారు. రైళ్లకు సంబంధించిన షెడ్యూల్ వివరాల కోసం సౌత్ సెంట్రల్ రైల్వేకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ లో చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రత్యేక రైళ్ల కారణంగా ఆయా మార్గాల్లో ప్రయాణించే ప్యాసింజర్లకు మేలు కలగనుంది. ముఖ్యంగా తిరుపతికి వెళ్లే భక్తులకు ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
Read Also: అరుణాచలం టూర్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC అదిరిపోయే ప్యాకేజీ మీ కోసమే!