BigTV English

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ వెనుక.. అసలు మిస్టరీ ఇదే.. అరెరె పెద్ద ప్లానే!

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ వెనుక.. అసలు మిస్టరీ ఇదే.. అరెరె పెద్ద ప్లానే!

Vande Bharat Sleeper: ఇండియన్ రైల్వే చరిత్రలో మరో మైలురాయిగా నిలిచిన వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వేగం, సౌకర్యం, డిజైన్, మోడర్న్ టెక్నాలజీతో భారత రైల్వేను కొత్త దిశగా తీసుకెళ్లే ఈ ట్రైన్ వెనుక నిజంగా చాలా గొప్ప కథ ఉంది. ఇది ఒక్క రైలు ప్రయాణం కాదు, ఇది మన దేశ ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించే యాత్ర. ఈ కథలో డిజైన్ ఉంది, డెడికేషన్ ఉంది, డెవలప్‌మెంట్ ఉంది. అసలేమిటి ఈ వందే భారత్ స్లీపర్ వెనుక స్ఫూర్తిదాయకం వెనుక ఉన్న కథ తెలుసుకుందాం.


ఇంతకీ, వందే భారత్ అంటే ఏంటి?
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ మొదటిసారి 2019లో ప్రారంభమైంది. దీన్ని ఇండియా తొలి సెమీ-హైస్పీడ్ ట్రైన్‌గా పట్టాలెక్కించారు. 160 కి.మీ. వేగంతో పరుగెత్తే ఈ ట్రైన్ ఇప్పటికే అనేక రూట్లపై ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకూ వందే భారత్ ట్రైన్స్‌ అన్నీ డేచేర్ కోచ్‌లతో మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితే మారిపోయింది. రాత్రిపూట ప్రయాణించేవారి కోసమే వందే భారత్ స్లీపర్ వర్షన్‌ డిజైన్ చేయబడింది.

దేశీయ డిజైన్.. అదే మనకు గర్వం
ఈ ట్రైన్‌ను పూర్తి స్థాయిలో భారత్‌లోనే డిజైన్ చేసి, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద తయారుచేశారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), చెన్నైలో ఈ ట్రైన్ ఉత్పత్తి అయ్యింది. వందే భారత్ స్లీపర్ వెర్షన్ రూపకల్పనలో అనేక భారతీయ ఇంజనీర్లు, డిజైనర్లు, కార్మికులు అహర్నిశలు కష్టపడ్డారు. ఫారిన్ టెక్నాలజీపై ఆధారపడకుండా, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడిన ఈ ట్రైన్ భారతీయ శాస్త్రవేత్తల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం.


లగ్జరీ బస్సు కంటే మెరుగైన సౌకర్యాలు
వందే భారత్ స్లీపర్ ట్రైన్‌లో లోపలికి వెళ్ళగానే అది రైలు కంటే పెద్ద స్టార్ హోటల్ అనిపించుకోవడం ఖాయం. ఇంటీరియర్ డిజైన్‌లో మోడ్రన్ లైటింగ్, మృదువైన బెడ్స్, పెద్ద విండోలు, సైలెంట్ డోర్లు, నాయిస్-కెన్సలింగ్ టెక్నాలజీతో ప్యాసింజర్లకు ఒక సరికొత్త అనుభూతి కలుగుతుంది. ప్రతి కోచ్‌లో ప్రత్యేక టాయిలెట్లు, బ్రెథింగ్ స్పేస్, టెంపరేచర్ కంట్రోల్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి.

వేగంలో లేదు సాటి
ఒక సాధారణ స్లీపర్ ట్రైన్‌కు సరాసరి 100 నుండి110 కి.మీ వేగం ఉంటే, వందే భారత్ స్లీపర్ వేగం 160 కి.మీ వరకు ఉండేలా డిజైన్ చేశారు. అంటే రాత్రిపూట ప్రయాణిస్తూ ఉండగానే గమ్యం చేరుకోవడం ఇక సాధ్యమే. టైం సేవ్ కావడమే కాకుండా, ప్రయాణం కూడా ఎంతో సాఫీగా ఉంటుంది. రైలు వేగంగా వెళ్లినా లోపలకి దానివల్ల ఏ ప్రభావం ఉండదు. దీనికి ప్రధాన కారణం అత్యాధునిక సస్పెన్షన్ టెక్నాలజీ కారణమే.

ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం
ఇందులో ఏర్పాటు చేసిన ఫైర్ సెన్సింగ్ అలారమ్‌లు, స్మార్ట్ డోర్ లాకింగ్ సిస్టం, GPS ట్రాకింగ్, సీసీ టీవీ కెమెరాలు ప్రయాణికుల భద్రతకు గట్టి భరోసా ఇస్తాయి. అదే సమయంలో, స్మార్ట్ డిస్‌ప్లేలు ద్వారా స్టేషన్ల సమాచారం, సమయ వివరాలు ప్రయాణికులకు చూపించడం ద్వారా ప్రయాణ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చారు.

మొదటి రూట్ ఎక్కడి నుంచి ఎక్కడికీ?
ఇప్పటికీ అధికారికంగా ఇండియన్ రైల్వే పూర్తి డీటెయిల్స్ వెల్లడించలేదు కానీ, మొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ న్యూఢిల్లీ నుండి ముంబై మార్గంపై నడిపే అవకాశముంది. తర్వాత దశలవారీగా అన్ని ప్రధాన నగరాల మధ్య ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

Also Read: Vande Bharat Sleeper: బ్రేక్ వేస్తే విద్యుత్? వందే భారత్ స్లీపర్ ట్రైన్ టెక్నాలజీ.. సూపర్ ఐడియా కదా!

ఎందుకు ప్రత్యేకం?
వందే భారత్ ట్రైన్‌ అంటే ఇప్పటి వరకూ ఒక తక్కువ విరామ రైలు, రోజులోనే పూర్తయ్యే ట్రిప్ అని అందరికి అర్థం. కానీ స్లీపర్ వర్షన్‌తో ఆ నిర్వచనమే మారిపోయింది. ఇది మన దేశంలో రైలు ప్రయాణానికి కొత్త పుంతలు తెరుస్తోంది. ఇది కేవలం రైలు కాదు, భారత అభివృద్ధికి ప్రతీక, స్వదేశీ నైపుణ్యానికి నిదర్శనం, భవిష్యత్తు ట్రాన్స్‌పోర్టేషన్‌కు పునాదిగా మారిన ఆవిష్కరణగా చెప్పవచ్చు.

వందే భారత్ స్లీపర్ వెనుక ఉన్న ఈ ప్రయాణం, నిజానికి ఒక సాధారణ ట్రైన్ తయారీ కంటే ఎక్కువ. ఇది మన దేశ శక్తిని ప్రతిబింబించేదిగా, ప్రతి భారతీయుడిలో గర్వాన్ని కలిగించేదిగా నిలుస్తుంది. రైల్వేలు కేవలం రవాణా మార్గాలు మాత్రమే కాదు, ఇవి దేశ అభివృద్ధికి బలమైన వెన్నెముక లాంటివని ఈ ట్రైన్ మరోసారి నిరూపించింది.

Related News

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Special Trains: సికింద్రాబాద్ నుంచి ఆ నగరానికి స్పెషల్ ట్రైన్, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Big Stories

×