Harihara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 2021 లోనే ప్రకటించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’. మెగా సూర్యా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం (AM Ratnam) సమర్పణలో ఏ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మొదట క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆయన సినిమా నుండి తప్పుకోవడంతో ఆ దర్శకత్వ బాధ్యతలను ప్రముఖ దర్శకుడు జ్యోతి కృష్ణ (Jyoti Krishna) తీసుకున్నారు. ఇక మొదటి భాగం పూర్తవగా జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. అనుపమ్ కేర్, బాబీ డియోల్, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాను ఒక ఛాలెంజ్గా తీసుకొని జ్యోతి కృష్ణ తెరకెక్కించబోతున్నారు.
క్రిష్ తప్పుకోవడం పై కాస్ట్యూమ్ డిజైన్ స్పందన..
ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి డైరెక్టర్ క్రిష్ తప్పుకోవడంతో అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. చిత్ర యూనిట్ తో విభేదాలు వచ్చాయని చాలామంది కామెంట్లు చేశారు. అసలు నిజం మాత్రం ఇప్పటికీ బయటపడలేదు. కానీ తాజాగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరొకవైపు ఈ సినిమా కాస్ట్యూమ్ డిజైనర్ కూడా తనవంతు ప్రమోషన్ మొదలుపెట్టింది. అందులో భాగంగానే క్రిష్ ఈ సినిమా నుండి తప్పుకోవడం వెనుక జరిగిన విషయాన్ని ఆమె తెలిపింది. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హరిహర వీరమల్లు సినిమా కోసం పనిచేసిన ప్రముఖ లేడి కాస్ట్యూమ్ డిజైనర్ ఐశ్వర్య రాజీవ్ (Aishwarya Rajeev) ఈ విషయంపై స్పందించారు.
క్రిష్ అందుకే సినిమా నుండి తప్పుకున్నారు..
ఇంటర్వ్యూలో భాగంగా హరిహర వీరమల్లు సినిమా మొదట క్రిష్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఎందుకు సడన్గా ఆయన తప్పుకొని జ్యోతి కృష్ణ రంగంలోకి దిగారు..? అని ప్రశ్నించగా ఐశ్వర్య రాజీవ్ మాట్లాడుతూ.. “మధ్యలో సినిమా షూటింగ్ కి ఎన్నో గ్యాప్స్ వచ్చాయి. అటు కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. ఆ తర్వాత పాలిటిక్స్ వల్ల పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోయారు. దాంతో ఎన్నో బ్రేక్స్ పడ్డాయి. అయితే అసలు కారణం ఏంటో ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. కానీ క్రిష్ జాగర్లమూడి సినిమా నుంచి తప్పుకున్నాక జ్యోతి కృష్ణ ఎంటర్ అయ్యారు. అయితే క్రిష్ సినిమా నుండి తప్పుకునే ముందు జ్యోతి కృష్ణతో పూర్తి డిస్కషన్ జరిగిన తర్వాత స్క్రిప్ట్ ను ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసి, వెళ్లిపోయారు. ఇద్దరు స్క్రిప్ట్ గురించి పూర్తిగా చర్చించుకున్న తర్వాతనే మొత్తం సినిమాను క్రిష్ జ్యోతి కృష్ణకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.” అంటూ క్రిష్ సినిమా నుంచి తప్పుకోవడం పై క్లారిటీ ఇచ్చింది ఐశ్వర్య రాజీవ్. ఇక ఇదే సమయంలో డైరెక్టర్ జ్యోతి కృష్ణ పై కూడా ప్రశంసలు కురిపించింది. అసలు తన సబ్జెక్టు కానిది ఎంచుకొని ఇప్పుడు పూర్తిగా ఒక పీరియాడిక్ డ్రామా తో చాలెంజింగ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అంటూ ఆయనపై ప్రశంసల కురిపించింది ఐశ్వర్య. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.